Shamshera Teaser: రణ్‌బీర్‌ కపూర్‌ షంషేరా టీజర్‌ అదిరింది-ranbir kapoors shamshera teaser released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ranbir Kapoors Shamshera Teaser Released

Shamshera Teaser: రణ్‌బీర్‌ కపూర్‌ షంషేరా టీజర్‌ అదిరింది

Hari Prasad S HT Telugu
Jun 22, 2022 02:46 PM IST

బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన షంషేరా మూవీ టీజర్‌ రిలీజైంది. తన తెగను కాపాడుకోవడానికి ఓ యోధుడు చేసే పోరాటం ప్రధాన ఇతివృత్తంగా ఈ మూవీ తెరకెక్కింది.

షంషేరా మూవీ టీజర్ లో రణ్‌బీర్‌ కపూర్‌
షంషేరా మూవీ టీజర్ లో రణ్‌బీర్‌ కపూర్‌

రణ్‌బీర్‌ కపూర్ మచ్‌ అవేటెడ్‌ మూవీ బ్రహ్మాస్త్ర రిలీజ్‌కు ఇంకా రెండున్నర నెలల సమయం ఉంది. అయితే ఆలోపే అతని మరో ఇంట్రెస్టింగ్‌ ప్రాజెక్ట్‌ షంషేరా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా టీజర్‌, ఫస్ట్‌ లుక్‌ను మేకర్స్‌ బుధవారం రిలీజ్‌ చేశారు. ఈ మధ్య బాలీవుడ్‌ను కూడా సౌత్‌ ఇండస్ట్రీ డామినేట్‌ చేస్తున్న పరిస్థితుల్లో షంషేరా టీజర్‌ చూస్తుంటే కాస్త సౌత్‌ వాళ్ల నుంచి నేర్చుకున్నట్లు కనిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

ఈ టీజర్‌లోని కొన్ని సీన్లు చూస్తే కేజీఎఫ్‌, ట్రిపుల్‌ ఆర్‌ మూవీ సీన్లు గుర్తుకొస్తాయి. ఇందులో పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌లో సంజయ్‌ దత్‌ కనిపిస్తుండగా.. రణ్‌బీర్‌ తన తెగను కాపాడుకునే యోధుడిలా కనిపించనున్నాడు. గత వారం ఈ సినిమా పోస్టర్‌ లీక్‌ కావడంతో మంగళవారం మేకర్స్‌ దీనిని అధికారికంగా రిలీజ్‌ చేశారు. అంతేకాదు తమ ప్రమోషనల్‌ స్ట్రేటజీని కూడా మార్చారు.

ఈ సినిమాను యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మస్తోంది. కాజా అనే నగరంలో జరిగిన కథగా ఈ సినిమా రూపొందింది. ఎడారి మధ్యలో ఉండే ఈ నగర ప్రజలు గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్న సమయంలో పోలీసులు వాళ్లను చిత్రహింసలు పెడుతున్న సీన్‌తో టీజర్‌ మొదలవుతుంది. కేజీఎఫ్‌లో అధీరాలాంటి క్రూరమైన పాత్రలో కనిపించిన సంజయ్‌ దత్‌.. ఈ షంషేరా మూవీలో ఓ కఠినమైన పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌లో కనిపిస్తున్నాడు.

ఓ సూర్యుడిలా అతడు ఉదయిస్తుంటే అడ్డుకోవడం ఎవరి వల్లా కాదనే ఓ పవర్‌ఫుల్‌ డైలాగ్‌తో రణ్‌బీర్‌ ఇందులో ఎంట్రీ ఇచ్చాడు. ఈ పీరియడ్‌ యాక్షన్ డ్రామాలో రణ్‌బీర్‌ డ్యుయల్‌ రోల్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్‌కానుంది. వచ్చే నెల 22న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.