Brahmastra Promotions: అరిటాకులో అన్నం తిన్న రణ్‌బీర్‌, రాజమౌళి, నాగార్జున.. వీడియో-brahmastra promotions in full swing as ranbir and rajamouli eat in banana leaf in chennai ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmastra Promotions: అరిటాకులో అన్నం తిన్న రణ్‌బీర్‌, రాజమౌళి, నాగార్జున.. వీడియో

Brahmastra Promotions: అరిటాకులో అన్నం తిన్న రణ్‌బీర్‌, రాజమౌళి, నాగార్జున.. వీడియో

HT Telugu Desk HT Telugu
Aug 24, 2022 05:32 PM IST

Brahmastra Promotions: బ్రహ్మాస్త్ర మూవీ ప్రమోషన్‌లో భాగంగా అరిటాకులో అన్నం తింటూ కనిపించారు ఈ మూవీ హీరో రణ్‌బీర్‌ కపూర్‌, దర్శకధీరుడు రాజమౌళి, అక్కినేని నాగార్జున.

చెన్నైలో బ్రహ్మాస్త్ర ప్రమోషన్లలో భాగంగా అరిటాకులో తింటున్న నాగార్జున, రాజమౌళి, రణ్‌బీర్‌
చెన్నైలో బ్రహ్మాస్త్ర ప్రమోషన్లలో భాగంగా అరిటాకులో తింటున్న నాగార్జున, రాజమౌళి, రణ్‌బీర్‌ (Twitter)

Brahmastra Promotions: బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ తన నెక్ట్స్‌ మూవీ బ్రహ్మాస్త్ర ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా బుధవారం (ఆగస్ట్‌ 24) అతడు చెన్నై వచ్చాడు. అతనితోపాటు బ్రహ్మాస్త్రలో నంది అస్త్రంగా కనిపిస్తున్న అక్కినేని నాగార్జున, దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఉన్నారు. ఈ ముగ్గురూ కలిసి అరిటాకులో భోజనం చేస్తున్న వీడియో, ఫొటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

పక్కా తమిళ సాంప్రదాయంలో అరిటాకులో అన్నీ వడ్డించిన తర్వాత వీళ్లు కడుపు నిండా తిన్నారు. ఈ సందర్భంగా తమిళ సూపర్‌స్టార్స్‌ అయిన రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, అజిత్‌ల గురించి రణ్‌బీర్‌ మాట్లాడాడు. రజనీకాంత్‌ గురించి చెప్పమని అడిగినప్పుడు అతడు సూపర్‌స్టార్‌ స్టైల్లో గాగుల్స్‌, సిగరెట్‌ సీన్లను రీక్రియేట్‌ చేశాడు. ఇక తన తండ్రి రిషీ కపూర్‌తో కమల్ హాసన్‌ కలిసి పని చేసినప్పటి విషయాలను కూడా గుర్తు చేసుకున్నాడు.

ఇక చివర్లో అజిత్‌ గురించి అడిగినప్పుడు అతని గురించి ఎంతో గొప్పగా చెప్పాడు. "అతడో గొప్ప వ్యక్తి. సినిమాల్లో కాకుండా బయట ఎక్కడా కనిపించడు. నేను కూడా అతన్ని సినిమాల్లోనే చూశాను తప్ప బయట అతనికి సంబంధించిన ఒక్క ఫొటో కూడా చూడలేదు. అతడు ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు రావడం కనిపించదు. మరేదీ కనిపించదు. ఇదే పెద్ద మిస్టరీ. ఈ కాలంలో సోషల్‌ మీడియా, పాపరాజి కల్చర్‌తో యాక్టర్స్‌ తరచూ ఎక్కడో ఓచోట కనిపిస్తూనే ఉంటారు. ఈ విషయంలో అజిత్‌ను నేను చాలా గౌరవిస్తాను" అని రణ్‌బీర్‌ అన్నాడు.

బ్రహ్మాస్త్ర మూవీలో రణ్‌బీర్‌తో కలిసి నాగార్జున కూడా నటించాడు. ఈ సినిమా సౌత్‌లో రాజమౌళి సమర్పణలో రిలీజ్‌ కాబోతోంది. దీంతో అతడు కూడా వీళ్లతోపాటు ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. చెన్నైలో సినిమా ప్రమోషన్లు పూర్తయిన తర్వాత ఈ ముగ్గురూ కలిసి ఇలా అరిటాకులోనే భోజనం చేశారు. బ్రహ్మాస్త్ర పార్ట్‌ వన్‌ మూవీ సెప్టెంబర్‌ 9న రిలీజ్‌కాబోతోంది. హిందీతోపాటు అన్ని సౌత్‌ ఇండియన్‌ భాషల్లో వస్తోంది.