Jailer First Look: రజనీ ఇంటెన్స్‌ లుక్‌.. జైలర్‌ షూటింగ్ ప్రారంభం-jailer shoot begins as makers released first look of rajnikanth ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jailer First Look: రజనీ ఇంటెన్స్‌ లుక్‌.. జైలర్‌ షూటింగ్ ప్రారంభం

Jailer First Look: రజనీ ఇంటెన్స్‌ లుక్‌.. జైలర్‌ షూటింగ్ ప్రారంభం

HT Telugu Desk HT Telugu
Aug 22, 2022 12:18 PM IST

Jailer First Look: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ జైలర్‌ షూటింగ్‌ సోమవారం (ఆగస్ట్‌ 22) నుంచి ప్రారంభం కానుంది. దీంతో మేకర్స్‌ ఫస్ట్ లుక్‌ను రిలీజ్‌ చేశారు.

<p>జైలర్ మూవీలో రజనీకాంత్</p>
జైలర్ మూవీలో రజనీకాంత్ (Twitter)

jailer movie rajinikanth: రజనీకాంత్‌ 169వ సినిమా జైలర్‌ షూటింగ్‌ సోమవారం నుంచి ప్రారంభమైంది. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో రమ్యకృష్ణ కూడా నటిస్తోంది. ఈ సినిమా నుంచి మేకర్స్‌ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో రజనీకాంత్‌ ఇంటెన్స్‌ లుక్‌ చూడొచ్చు. ఫార్మల్‌ డ్రెస్‌లో షర్ట్‌ పై రెండు బటన్స్‌ తీసేసి.. చాలా సీరియస్‌గా నడిచి వస్తున్న రజనీ లుక్‌ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.

yearly horoscope entry point

jailer movie rajinikanth: జైలర్‌ మూవీ కోసం టోటల్‌ డిఫరెంట్‌ లుక్‌లో రజనీ కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్‌లో చాలా వరకూ హైదరాబాద్‌లోనే జరగనుంది. దీనికోసం భాగ్యనగరంలో ప్రత్యేకంగా ఓ జైలు సెట్‌ వేశారు. ఈ సినిమా కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌ విలన్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఐశ్వర్య రాయ్‌ కూడా ఈ మూవీలో ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

కళానిధి మారన్‌ సమర్పణలో వస్తున్న ఈ జైలర్‌ మూవీకి అనిరుధ్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి నటీనటుల వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. వచ్చే ఏడాది సమ్మర్‌ హాలిడేస్‌లో ఈ జైలర్‌ మూవీ రిలీజ్‌ కానుంది. ఈ మధ్యే దళపతి విజయ్‌తో బీస్ట్‌ మూవీ తెరకెక్కించిన నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ విమర్శలు ఎదుర్కొన్నాడు.

ఆ మూవీ బాక్సాఫీస్‌ కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపించినా.. సినిమాకు నెగటివ్‌ రివ్యూలే వచ్చాయి. ఇటు రజనీకాంత్‌ చివరి మూవీ అన్నాత్తై కూడా ఆశించిన రేంజ్‌లో సక్సెస్‌ కాలేకపోయింది. మరి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న జైలర్‌ ఎంత వరకూ సక్సెసవుతుందో చూడాలి.

Whats_app_banner