MS Dhoni: తల ధోనీ ప్రొడ్యూసర్.. దళపతి విజయ్ హీరో.. కాంబినేషన్ అదిరింది!
చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌తో తమిళనాడు ఫ్యాన్స్‌కు దగ్గరయ్యాడు ఎమ్మెస్ ధోనీ. అతన్ని తమలో ఒకడిగా అక్కడి వాళ్లు భావిస్తున్నారు. 'తల'(నాయకుడు) అనే బిరుదుతో అతనికి తమ హృదయాల్లో స్థానమిచ్చారు.
తల ధోనీ ప్రొడ్యూసర్, దళపతి విజయ్ హీరో.. ఈ కాంబినేషన్ ఊహించుకోవడానికే ఎంతో అద్భుతంగా ఉంది కదా. కానీ ఈ ఊహే నిజం కాబోతుందన్న వార్తలు ఇప్పుడు వస్తున్నాయి. ఎమ్మెస్ ధోనీ నిర్మాతగా వ్యవహరిస్తున్న మూవీలో దళపతి విజయ్ హీరోగా నటించనున్నట్లు కోలీవుడ్ కోడై కూస్తోంది. ధోనీయే స్వయంగా విజయ్‌కి ఫోన్ చేసి తన సినిమాలో నటించాల్సిందిగా కోరినట్లు కొన్ని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ధోనీ ఆఫర్‌కు విజయ్ ఓకే చెప్పినట్లు కూడా సమాచారం. ఇది నిజమైతే గనక ఫ్యాన్స్‌కు పండగే. ముఖ్యంగా తమిళ ప్రేక్షకులు ఆరాధ్యంగా భావించే ఈ ఇద్దరూ ఒకే సినిమాతో ముందుకు రానుండటం నిజంగా విశేషమే. తమిళనాడులో విజయ్‌కున్న స్టార్డమ్ అంతా ఇంతా కాదు. ఇటు ధోనీ అయితే సీఎస్కే టీమ్ కెప్టెన్‌గా చెన్నైని తన రెండో ఇంటిగా మార్చుకున్నాడు.
ఇక ఇదే మూవీలో ధోనీ ఓ చిన్న పాత్ర పోషించనుండటం కూడా విశేషమే. ధోనీ తన సొంత ప్రొడక్షన్ హౌజ్ ధోనీ ప్రొడక్షన్స్‌ను లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నాడు. విజయ్‌తోనే మరో రెండు సినిమాలు కూడా నిర్మించే ఆలోచనలో ధోనీ ఉన్నాడట. ప్రస్తుతం విజయ్.. దళపతి 66 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ధోనీ మూవీలో నటించే ఛాన్స్ ఉంది. ఈ దళపతి 66 ఫస్ట్ లుక్ కూడా ఈ నెల 22న తన బర్త్‌డే రోజే రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
ఈ మధ్యే ధోనీ నిర్మాతగా మారుతున్నాడని, అతని సినిమాలో సౌత్ సూపర్‌స్టార్ నయనతార నటించబోతుందన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇవన్నీ చూస్తుంటే ధోనీ తన కొత్త ఇన్నింగ్స్‌కు రెడీ అవుతున్నట్లు స్పష్టమవుతోంది. వచ్చే ఏడాది ఐపీఎల్‌కు కూడా అతడు గుడ్‌బై చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ధోనీ ప్రొడక్షన్స్పైనే అతడు ఎక్కువ సమయం గడపనున్నాడు.
సంబంధిత కథనం