Alia Bhatt: బేబీ బంప్‌తో ఆలియా.. బ్రహ్మాస్త్ర ప్రమోషన్లలో రణ్‌బీర్‌తో బ్యూటీ-alia bhat shows her baby bump with ranbir kapoor ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Alia Bhat Shows Her Baby Bump With Ranbir Kapoor

Alia Bhatt: బేబీ బంప్‌తో ఆలియా.. బ్రహ్మాస్త్ర ప్రమోషన్లలో రణ్‌బీర్‌తో బ్యూటీ

Maragani Govardhan HT Telugu
Aug 06, 2022 04:01 PM IST

ఆలియా బట్.. తన భర్త రణ్‌బీర్‌తో కలిసి సందడి చేసింది. తొలిసారిగా తన బేబీ బంప్‌తో కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. బ్రహ్మాస్త్ర ప్రమోషన్లలో పాల్గొంది. ఈ సినిమా సెప్టెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆలియా-రణ్‌భీర్
ఆలియా-రణ్‌భీర్ (HT)

ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ కలిసి నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. ఎట్టకేలకు వీరిద్దరూ ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నారు. వీరిద్దరూ కలిసిన నటించిన ఈ సినిమా సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్‌లో ఆలియా-రణ్‌బీర్ వివాహంతో ఒక్కటి కాగా.. కొన్ని రోజుల తర్వాత ఆలియా తాను గర్భవతినని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. తాజాగా బ్రహ్మాస్త్ర ప్రమోషన్లలో పాల్గొన్న ఆలియా.. బేబీ బంప్‌తో కనిపించింది.

ఇటీవలే తన డార్లింగ్స్ అనే సినిమా ప్రచారంలో బయటకు వచ్చిన ఆలియా.. తొలిసారిగా బేబీ బంప్‌తో దర్శనమిచ్చింది. తాజాగా మరోసారి రణ్‌బీర్‌తో కలిసి బ్రహ్మాస్త్ర ప్రచారంలో భాగంగా బయటకు వచ్చి మరోసారి కనిపించింది. దీంతో మీడియా ప్రతినిధులు వీరి ఫొటోలను క్లిక్‌మనిపించారు. రణ్‌బీర్ కపూర్ బ్లాక్ క్యాజువల్స్‌ను ధరిస్తే.. ఆలియా భట్ బ్రౌన్ డ్రెస్‌లో టూ టోన్ హీల్స్‌తో కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సినిమా విషయానికొస్తే.. తొలిసారి ఆలియా, రణ్‌బీర్ ఈ చిత్రంలో కలిసి నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన కేసరియా(కుంకుమలా) సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రెండో పాట దేవ దేవ సాంగ్ టీజర్ ఇటీవలే విడుదలైంది. ఇందులో శివ(రణ్‌బీర్) పరమేశ్వరుడిని స్తుతిస్తూ కాంతి గొప్పతాన్ని ఇషా(ఆలియా)కు వివరిస్తున్నాడు. దీని పూర్తి పాట ఆగస్టు 8న విడుదల కానుంది.

బ్రహ్మాస్త్ర సినిమా సెప్టెంబరు 9న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. అయ్యన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించగా.. అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్, నాగార్జున తదితరులు కీలక పాత్రలు పోషించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం