Rajamouli and Mahesh Movie: రాజమౌళి-మహేశ్ బాబు సినిమాపై ఆసక్తికర అప్డేట్.. ఏంటంటే?-ss rajamouli reveals movie with mahesh babu will be a globetrotting action adventure ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rajamouli And Mahesh Movie: రాజమౌళి-మహేశ్ బాబు సినిమాపై ఆసక్తికర అప్డేట్.. ఏంటంటే?

Rajamouli and Mahesh Movie: రాజమౌళి-మహేశ్ బాబు సినిమాపై ఆసక్తికర అప్డేట్.. ఏంటంటే?

Rajamouli and Mahesh Movie update: రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలో రానున్న సినిమాపై ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ప్రపంచాన్ని చుట్టే సాహస యాత్రికుడి కథ అంటూ రాజమౌళి అప్డేట్ ఇచ్చారు.

రాజమౌళి-మహేశ్ బాబు మూవీపై అప్డేట్

Rajamouli and Mahesh Movie update: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తదుపరి చిత్రం గురించి అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆయన తర్వాతి సినిమాను.. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందాని అభిమానులు ఆత్రుతగా చూస్తున్నారు.

వీరి కాంబినేషన్‌పై ఇప్పటికే భారీగా అంచనాలు పెట్టుకున్నారు సినీ ప్రియులు, అభిమానులు. ఈ కాంబోలో ఎప్పుడో సినిమా రావాల్సి ఉండగా.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుల కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. ఆ తరుణం రానే వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది.

ఈ సినిమా యాక్షన్ అడ్వెంచరెస్‌గా తెరకెక్కబోతుందట. ఈ విషయాన్ని రాజమౌళీనే స్వయంగా వెల్లడించారు. టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ఆయన.. ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఈ సినిమా యాక్షన్ అడ్వెంచరెస్‌గా ఉండబోతుందని తెలిపారు. పాన్ఇండియా స్థాయిలో కేఎల్ నారాయణ ఈ సినిమా నిర్మించనున్నారు.

రాజమౌళి దర్శకత్వంలో నటించే విషయంపై మహేశ్ బాబు ఇప్పటికే తన స్పందనను తెలియజేశారు. ఆయనతో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నానని స్పష్టం చేశారు. "రాజమౌళితో ఓ సినిమా చేస్తే.. 25 సినిమాలు చేసినట్లే.. ఈ ప్రాజెక్ట కోసం ఎదురుచూస్తున్నాను. ఇది పాన్ఇండియా సినిమా అవుతుంది. జాతీయ స్థాయిలో చిత్ర సరిహద్దులను చెరిపేస్తుంది." అని మహేశ్ బాబు గతంలో అన్నారు.

ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మహేశ్ బాబు కోసం రెండు కథలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఒకటి అమెజాన్ అడవుల నేపథ్యంలో నిధి వేట నేపథ్యంలో ఉండగా.. జేమ్స్ బాండ్ తరహాలో ఓ యాక్షన్ అడ్వెంచర్ కథగా మరోకటి ఉండనున్నట్లు సమాచారం. మరి వీటిలో ఏ కథ పట్టాలెక్కుతుందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశముంది.

సంబంధిత కథనం