SSMB28 Update: జూనియర్‌ ఎన్టీఆర్‌ ట్రైనర్‌తో చేతులు కలిపిన మహేష్‌.. ఇక రచ్చే!-mahesh babu training hard with jr ntrs trainer lloyd stevens for ssmb28 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Mahesh Babu Training Hard With Jr Ntrs Trainer Lloyd Stevens For Ssmb28

SSMB28 Update: జూనియర్‌ ఎన్టీఆర్‌ ట్రైనర్‌తో చేతులు కలిపిన మహేష్‌.. ఇక రచ్చే!

HT Telugu Desk HT Telugu
Aug 16, 2022 02:59 PM IST

SSMB28 Update: సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నెక్ట్స్‌ మూవీ ఎస్‌ఎస్‌ఎంబీ 28 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు అదిరిపోయే వార్త. ఈ సినిమా కోసం మహేష్‌.. జూనియర్‌ ఎన్టీఆర్‌ ట్రైనర్‌తో చేతులు కలిపాడు.

ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ తో మహేష్ బాబు
ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ తో మహేష్ బాబు (Twitter)

సర్కారు వారి పాట సూపర్‌ సక్సెస్‌ తర్వాత వరుస వెకేషన్లు ఎంజాయ్‌ చేసిన మహేష్‌ బాబు.. మొత్తానికి తన నెక్ట్స్‌ మూవీ SSMB28 కోసం పని మొదలుపెట్టాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేస్తున్న సినిమా కావడంతో దీనిపై ఫ్యాన్స్‌కు భారీ అంచనాలే ఉన్నాయి. అయితే తాజాగా వస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా కోసం మహేష్‌ తన బాడీ షేప్‌పై వర్కవుట్‌ చేయనున్నాడు.

అంతేకాదు దీనికోసం సెలబ్రిటీ ట్రైనర్‌ లాయిడ్‌ స్టీవెన్స్‌ను రంగంలోకి దించాడు. ఇతడు మామూలు వ్యక్తి కాదు. టాలీవుడ్‌లో యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ నుంచి బాలీవుడ్‌లో రణ్‌వీర్‌ సింగ్‌ వరకూ ఎందరో సెలబ్రిటీలు అదిరిపోయే లుక్‌ పొందారంటే దానికి కారణం ఇతడే. ఎన్టీఆర్‌నే తీసుకోండి. అరవింద సమేతలో అతని సిక్స్‌ ప్యాక్‌ బాడీ లుక్‌ ఫ్యాన్స్‌ను కట్టిపడేసింది.

ఆ తర్వాత మొన్నటి ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం కూడా తారక్‌.. ఈ లాయిడ్‌తోనే కలిసి పని చేశాడు. అలాంటి వ్యక్తితో ఇప్పుడు మహేష్‌ పని చేయబోతుండటంతో అతని లుక్‌ ఎంతలా మారుతుందా అని ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాను టాలీవుడ్‌ ప్రిన్స్‌తో కలిసి పని చేయబోతున్నట్లు లాయిడ్‌ స్టీవెన్స్‌ తన ట్విటర్‌ ద్వారా చెప్పాడు. మహేష్‌తో దిగిన సెల్ఫీని కూడా పోస్ట్‌ చేశాడు.

ఇందులో మహేష్ లైట్‌గా ఉన్న గడ్డంతో మరింత హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నాడు. లెట్స్‌ డూ దిస్‌ మహేష్‌ అంటూ అతడు ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశాడు. రానున్న రోజుల్లో దీనికి సంబంధించి కీలక అప్‌డేట్స్‌ ఇవ్వనున్నట్లు కూడా హ్యాష్‌ట్యాగ్‌ ద్వారా లాయిడ్‌ స్టీవెన్స్‌ హింట్ ఇచ్చాడు. లాయిడ్‌ ట్రైనింగ్‌లో మహేష్‌ కచ్చితంగా ఓ డిఫరెంట్‌ లుక్‌లో కనిపిస్తాడన్న ఆశతో ఫ్యాన్స్‌ ఉన్నారు.

అయితే అదే సమయంలో అతనితో ట్రైనింగ్‌ అంటే మామూలు విషయం కాదు. మహేష్‌కు కూడా శారీరక శ్రమ భారీగానే ఉండనుంది. ఈ ఎస్‌ఎస్‌ఎంబీ28 తర్వాత మహేష్‌.. రాజమౌళితో మూవీ చేయనున్న విషయం తెలిసిందే. దాని కోసం కూడా అతడు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నట్లు దీనిని బట్టి తెలుస్తోంది. ఆ సినిమా వచ్చే ఏడాది షూటింగ్‌ జరుపుకోనుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో స్ట్రైక్‌ నడుస్తుండటంతో ఎస్ఎస్‌ఎంబీ28 షూటింగ్‌ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందన్నదానిపై ఎలాంటి అప్‌డేట్‌ లేదు.

IPL_Entry_Point