NTR31 Shooting: ఎన్టీఆర్‌తో మూవీ.. షూటింగ్‌ ఎప్పుడో చెప్పిన ప్రశాంత్‌ నీల్-ntr31 shooting to commence from april 2023 says prashanth neel ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ntr31 Shooting: ఎన్టీఆర్‌తో మూవీ.. షూటింగ్‌ ఎప్పుడో చెప్పిన ప్రశాంత్‌ నీల్

NTR31 Shooting: ఎన్టీఆర్‌తో మూవీ.. షూటింగ్‌ ఎప్పుడో చెప్పిన ప్రశాంత్‌ నీల్

HT Telugu Desk HT Telugu
Aug 15, 2022 03:34 PM IST

NTR31 Shooting: ట్రిపుల్‌ ఆర్‌ బ్లాక్‌బస్టర్‌ అయిన తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అతని నెక్ట్స్‌ మూవీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఎంతో ఆసక్తి రేపుతున్న ఎన్టీఆర్‌31 షూటింగ్‌పై అప్‌డేట్‌ వచ్చింది.

ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్
ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ (Twitter)

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీతో జూనియర్‌ ఎన్టీఆర్‌ రేంజ్‌ మరో లెవల్‌కు వెళ్లింది. పాన్‌ ఇండియా స్థాయిలో అతడు స్టార్‌ అయిపోయాడు. కొందరు హాలీవుడ్‌ ప్రముఖులు కూడా ఈ సినిమాలో తారక్‌ నటనకు ఫిదా అయ్యారు. ఈ సినిమా ఊహించిన దాని కంటే కూడా ఎక్కువ సక్సెస్‌ కావడంతో జూనియర్‌ నెక్ట్స్‌ మూవీ కోసం అతని ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

రాజమౌళిలాంటి పాన్‌ ఇండియా డైరెక్టర్‌ తర్వాత అతడు కేజీఎఫ్‌లాంటి సూపర్‌ డూపర్‌ హిట్‌ అందించిన ప్రశాంత్‌ నీల్‌తో మూవీ చేయబోతున్నాడన్న వార్తలు రావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే ఇది ఎన్టీఆర్‌31. ఆలోపు కొరటాల శివతో ఎన్టీఆర్‌30 రాబోతోంది. ప్రస్తుతం సలార్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్న ప్రశాంత్‌ నీల్‌ ఆ తర్వాత ఎన్టీఆర్‌31 మొదలుపెట్టనున్నాడు.

ఈ సినిమా షూటింగ్‌ 2023, ఏప్రిల్‌లో ప్రారంభం కానున్నట్లు తాజాగా ప్రశాంత్‌ చెప్పాడు. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌31 షూటింగ్‌పై క్లారిటీ ఇచ్చాడు. ఆలోపు ఎన్టీఆర్‌30 పూర్తి కానుండగా.. అటు సలార్‌ ముగించుకొని ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ కోసం ప్రశాంత్‌ నీల్‌ సిద్ధం కానున్నాడు. 2022లో ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌ 2లాంటి ఇండియన్‌ సినిమా హిస్టరీలో నిలిచిపోయే సినిమాలు అందించిన హీరో, డైరెక్టర్‌ కలిసి సినిమా చేస్తున్నారంటే అది మరెన్ని సంచలనాలు సృష్టిస్తుందో ఊహించుకోవచ్చు.

IPL_Entry_Point