K.G.F: Chapter 2: 2022లో హయ్యెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్ ఏదంటే-yash kgf 2 becomes highest grossing indian film of 2022 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  K.g.f: Chapter 2: 2022లో హయ్యెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్ ఏదంటే

K.G.F: Chapter 2: 2022లో హయ్యెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్ ఏదంటే

HT Telugu Desk HT Telugu
Aug 04, 2022 01:56 PM IST

యశ్ (yash) హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్ 2 (Kgf 2) చిత్రం అరుదైన అరుదైన ఫీట్ ను సాధించింది. ఆ రికార్డ్ ఏదంటే...

యశ్
యశ్ (twitter)

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్ 2 చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాఖీభాయ్ గా యశ్ హీరోయిజాన్ని ఆవిష్కరించిన తీరు, అతడిపై తెరకెక్కించిన యాక్షన్ సీక్వెన్స్ అభిమానులను ఫిదా చేశాయి. కన్నడ, బాలీవుడ్, టాలీవుడ్ తో పాటు పలు భాషల్లో ఈ సినిమా వందల కోట్ల వసూళ్లను సాధించింది.

తాజాగా 2022లో హయ్యెస్ట్ గ్రాసర్ సినిమా గా కేజీఎఫ్ 2 కొత్త రికార్డును క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్ గా కేజీఎఫ్ 2 సినిమా 1233 కోట్ల వసూళ్లను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో కేజీఎఫ్ 2 చిత్రం 136 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. హిందీలో 525 కోట్ల గ్రాస్ తో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కేజీఎఫ్ 2 సినిమాకు తమిళనాడు 115 కోట్లు, కన్నడంలో 185 కోట్లు, కేరళలో 70 కోట్ల వరకు వసూళ్లు వచ్చాయి.

ఓవర్ సీస్ లో 200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఓవరాల్ గా ఈ సినిమా ఫుల్ థియేట్రికల్ రన్ లో 1233 కోట్ల గ్రాస్ ను సాధించినట్లు సమాచారం. ఈ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో కేజీఎఫ్ 2 తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా 1161 కోట్ల వసూళ్లతో రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో కమల్ హాసన్ విక్రమ్ నిలవగా ఆరో స్థానాన్ని మహేష్ బాబు సర్కారువారి పాట చిత్రం సొంతం చేసుకున్నది.

IPL_Entry_Point

టాపిక్