Sarkaru Vaari Paata Collections | సర్కారు వారి పాట కలెక్షన్ల రికార్డు-sarkaru vaari paata is now fastest to 100 crores share in telugu version only movies ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Sarkaru Vaari Paata Is Now Fastest To 100 Crores Share In Telugu Version Only Movies

Sarkaru Vaari Paata Collections | సర్కారు వారి పాట కలెక్షన్ల రికార్డు

HT Telugu Desk HT Telugu
May 17, 2022 05:55 PM IST

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నటించిన సర్కారు వారి పాట మూవీకి మిక్స్‌డ్‌ రెస్పాన్స్‌ వచ్చినా.. కలెక్షన్ల విషయంలో మాత్రం రికార్డులు సృష్టిస్తూనే ఉంది.

కీర్తిసురేష్, మహేష్ బాబు
కీర్తిసురేష్, మహేష్ బాబు (twitter)

మహేష్‌ బాబు చాలా రోజుల తర్వాత నటించిన సినిమా సర్కారు వారి పాట. దీంతో ఈ మూవీ రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే రిలీజైన రోజు మాత్రం ఈ సినిమాకు మిక్స్‌డ్ రెస్పాన్స్‌ వచ్చింది. ఫ్యాన్స్‌ను వదిలేస్తే న్యూట్రల్‌ ప్రేక్షకులు సినిమాపై పెదవి విరిచారు. అందుకు తగినట్లే ఈ సినిమా రెండో రోజు కలెక్షన్లు కూడా తగ్గాయి.

అయితే ఫస్ట్‌ వీకెండ్‌లో ఈ మూవీ పుంజుకుంది. ఇక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.100 కోట్ల షేర్‌ను అందుకుంది. అంతేకాదు కేవలం తెలుగు వెర్షన్‌ సినిమాల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల షేర్‌ను అత్యంత వేగంగా అందుకున్న సినిమాగా నిలిచింది. ఈ విషయాన్ని మేకర్స్‌ కూడా మంగళవారం ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. పరశురాం డైరెక్షన్‌లో వచ్చిన ఈ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ బాక్సాఫీస్‌ దగ్గర రూ.160 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు సాధించింది. తొలి రోజు భారీ వసూళ్లు సాధించిన ఈ మూవీ.. రెండోరోజు కాస్త తగ్గి.. శనివారం నుంచి మళ్లీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లాంటి దేశాల్లోనూ ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్