Mahesh Babu | మహేష్, రాజమౌళి సినిమా షూటింగ్‌పై విజయేంద్రప్రసాద్ అప్‌డేట్
మహేష్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా ఇప్పుడు టాలీవుడ్‌లో ఎంతో ఆసక్తి రేపుతోంది. ఈ ఇద్దరూ తొలిసారి కలిసి పని చేస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
రాజమౌళి ఏ సినిమా చేసినా ఓ సెన్సేషనే. మగధీర, ఈగ, బాహుబలి.. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్. అయితే ఓ డిఫరెంట్ సబ్జెక్ట్.. లేదంటే ఓ భారీ బడ్జెట్. అతని సినిమా సూపర్ హిట్ కావడం ఖాయమన్న అంచనాలు ప్రేక్షకుల్లో ఉంటాయి. బాహుబలితో టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా రేంజ్‌కు వెళ్లిపోయిన రాజమౌళి.. సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో సినిమా చేయబోతున్నాడన్న వార్త సహజంగానే ఎంతో ఆసక్తి రేపుతోంది.
ఈ క్రేజీ కాంబినేషన్ టాలీవుడ్‌లో మరో పెను సంచలనం సృష్టించడం ఖాయమన్న అంచనాలు ఉన్నాయి. వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారన్న వార్త పాతదే అయినా.. తాజాగా దీనిపై ఓ కీలకమైన అప్‌డేట్ ఇచ్చారు రాజమౌళి తండ్రి, రైటర్ విజయేంద్ర ప్రసాద్. రాజమౌళి సినిమాలన్నింటికీ కథలను అందించే ఆయనే.. ఈ సినిమాకూ స్టోరీని సిద్ధం చేస్తున్నారు.
తాజాగా పింక్‌విల్లాతో మాట్లాడుతూ.. మహేష్, రాజమౌళి సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్‌లో ప్రారంభం కాబోతోందని చెప్పారు. నిజానికి ఈ ఏడాది చివర్లో మూవీ సెట్స్‌పైకి వెళ్లొచ్చని భావించినా.. అది సాధ్యం కాదని విజయేంద్ర ప్రసాద్ తేల్చేశారు. "మేము స్టోరీ సిద్ధం చేస్తున్నాం. నేనింకా స్క్రిప్ట్ రాయడం పూర్తి చేయలేదు. ఇది ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మూవీ. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్‌లో షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ ఏడాది మహేష్ బాబు మరో సినిమాతో బిజీగా ఉన్నాడు. అతడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మూవీ చేస్తున్నాడు" అని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.
ఆఫ్రికా అడవుల్లో జరిగే యాక్షన్ అడ్వెంచర్ మూవీగా భావిస్తున్నారు. ఇప్పటి వరకూ ఇండియన్ సినిమాలో చూడని యాక్షన్ సీన్లు ఇందులో ఉండబోతున్నాయన్న వార్తలు కూడా వచ్చాయి. ట్రిపుల్ ఆర్ కంటే పెద్ద సినిమా మహేష్‌తో చేస్తానని ఇప్పటికే రాజమౌళి కూడా చెప్పాడు. ఈ సినిమా కోసం మహేష్ ఎలా సిద్ధం కానున్నాడన్న విషయం మాత్రం విజయేంద్ర ప్రసాద్ చెప్పలేదు. అది రాజమౌళి పరిధిలోని అంశమని ఆయన అన్నారు.
సంబంధిత కథనం
టాపిక్