తెలుగు న్యూస్  /  Entertainment  /  Brahmastra Budget Is Mind Blowing As It Is The Highest In The Bollywood

Brahmastra Budget: బ్రహ్మాస్త్ర బడ్జెట్‌ ఇంత భారీగానా.. బాలీవుడ్‌లో ఇదే హయ్యెస్ట్‌

Hari Prasad S HT Telugu

02 September 2022, 17:14 IST

    • Brahmastra Budget: బ్రహ్మాస్త్ర బడ్జెట్‌ షాక్‌కు గురి చేస్తోంది. ఇది బాలీవుడ్‌లోనే హయ్యెస్ట్‌ బడ్జెట్‌ మూవీ అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
బ్రహ్మాస్త్ర మూవీలో రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌
బ్రహ్మాస్త్ర మూవీలో రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ (Twitter)

బ్రహ్మాస్త్ర మూవీలో రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌

Brahmastra Budget: రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ నటించిన బ్రహ్మ్రాస్త్ర మూవీ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే శుక్రవారం (సెప్టెంబర్‌ 9) మూవీ రిలీజ్‌ కానుంది. హిందీతోపాటు తెలుగు, తమిళంలోనూ ప్రేక్షకులను అలరించనుంది. సుమారు ఐదేళ్లుగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు వేచి చూస్తున్నారు. అయాన్‌ ముఖర్జీ డైరెక్ట్‌ చేసిన ఈ బ్రహ్మాస్త్ర ఫస్ట్ పార్ట్ శివగా ఇప్పుడు రాబోతోంది.

ట్రెండింగ్ వార్తలు

Guppedantha Manasu Today Episode: వ‌సుధార‌పై మ‌న‌సు ప‌డ్డ మ‌ను - శైలేంద్రకు మ‌హేంద్ర ప‌నిష్‌మెంట్ - రాజీవ్ చ‌నిపోలేదా?

Krishna mukunda murari april 30th: మురారి బిడ్డ ముకుంద కడుపులో.. కృష్ణ నెల తప్పిందని భవానీ ఆనందం, ఆదర్శ్ జలస్

Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్..జ్యోత్స్నకి ఘోరమైన అవమానం.. దీపని గెంటేసిన పారిజాతం, అడ్డుపడిన సుమిత్ర

Heeramandi OTT Release Date: మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్.. ఎక్కడ చూడాలంటే?

అయితే తాగా బాలీవుడ్ హంగామాలో వచ్చిన రిపోర్ట్‌ ప్రకారం.. ఈ బ్రహ్మాస్త్ర మూవీ బడ్జెట్‌ అందరి అంచనాలను మించిపోయింది. బాలీవుడ్‌ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌ సినిమాగా నిలిచిపోనుంది. ఈ బ్రహ్మాస్త్రను తీయడానికి మేకర్స్‌ ఏకంగా రూ.400 కోట్లు ఖర్చు పెట్టినట్లు బాలీవుడ్‌ హంగామా చెబుతోంది. ప్రింట్‌, పబ్లిసిటీ ఖర్చులు కాకుండానే సినిమా నిర్మాణానికి రూ.410 కోట్లు ఖర్చయినట్లు సమాచారం.

"బాలీవుడ్‌లో ఇప్పటి వరకూ వచ్చిన హయ్యెస్ట్‌ బడ్జెట్‌ మూవీ ఇది. ఆ బడ్జెట్‌ ప్రతి ఫ్రేమ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా సినిమాను నిర్మించాలనే ఇంత భారీ బడ్జెట్‌తో తీశారు. అయాన్‌, అతని టీమ్‌ ఓ రేంజ్‌లో విజువల్స్‌ను క్రియేట్‌ చేయడంలో సక్సెసయ్యారు. స్క్రీన్‌పై వీటిని చూస్తే ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురవుతారు. ట్రైలర్‌లో చూసింది చాలా తక్కువ. సినిమాలో మరో లెవల్లో విజువల్స్‌ ఉంటాయి" అని ఈ సినిమా వర్గాలు చెప్పినట్లు బాలీవుడ్‌ హంగామా రిపోర్ట్‌ చేసింది.

అయితే ఈ మధ్య బాలీవుడ్‌ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. ఆమిర్‌ఖాన్‌, అక్షయ్‌కుమార్‌లాంటి వాళ్లు కూడా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్రహ్మాస్త్రపై బాలీవుడ్‌ భారీ ఆశలే పెట్టుకుంది. దీంతో ఇంత భారీ బడ్జెట్‌ పెట్టిన బ్రహ్మాస్త్ర మేకర్స్‌ ఊపిరి బిగపట్టుకొని మూవీ రిజల్ట్ కోసం వేచి చూస్తున్నారు. ఈ సినిమాలో రణ్‌బీర్‌, ఆలియాతోపాటు అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనీ రాయ్‌ నటించారు.

అయితే సినిమాలో షారుక్‌ ఖాన్‌ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో వానరాస్త్రం క్యారెక్టర్‌ను పోషించింది షారుకే అన్న పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మేకర్స్‌ అఫీషియల్‌గా ఎలాంటి ప్రకటన చేయలేదు. బ్రహ్మాస్త్ర మొత్తంగా మూడు పార్ట్‌లుగా రానుండగా.. ఇప్పుడు వచ్చేది తొలి పార్ట్‌.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.