Ganesh Chaturthi at Sharukh Home: షారుక్‌ఖాన్ ఇంట్లోని గణపతిని చూస్తారా?
Ganesh Chaturthi at Sharukh Home: షారుక్‌ఖాన్ తన ఇంట్లోని గణపతిని దర్శనం చేయించాడు. బుధవారం (ఆగస్ట్ 31) దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
Ganesh Chaturthi at Sharukh Home: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ తన ఇంట్లో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాడు. చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలలాగే తన ఇంట్లోనూ గణపతిని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ఈ ఫొటోలను బుధవారం (ఆగస్ట్ 31) సాయంత్రం తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో షేర్ చేసుకున్నాడు.
ప్రతి ఏటా కింగ్ ఖాన్ ఇలాగే తన ఇంట్లో గణపతి పూజ నిర్వహించి ఆ ఫొటోలతోనే ఫ్యాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు చెబుతాడు. ఈసారి కూడా అతడు అలాగే చేశాడు. ఈ ఫొటోను షేర్ చేస్తూ మంచి క్యాప్షన్ కూడా పెట్టాడు. ఈసారి తన ఇంట్లో గణపతికి తనతోపాటు చిన్న కొడుకు అబ్‌రామ్ స్వాగతం పలికినట్లు షారుక్ చెప్పాడు.
"మా ఇంట్లో మా చిన్నోడు, నేను కలిసి గణపతిని స్వాగతించాం. పూజ తర్వాత తిన్న మోదక్‌లు చాలా బాగున్నాయి. హార్డ్ వర్క్, పట్టుదల, దేవుడిపై నమ్మకంతోనే మనం ఏదైనా నేర్చుకుంటాం. మన కలలను సాకారం చేసుకుంటాం. అందరికీ హ్యాపీ గణేష్ చతుర్థి" అని షారుక్ తన ఇన్‌స్టా పోస్ట్‌లో అన్నాడు.గతేడాది కూడా షారుక్ ఖాన్ తన ఇంట్లో గణపతి పూజల తర్వాత ఫ్యాన్స్‌కు శుభాకాంక్షలు చెబుతూ.. అందరికీ ఆ గణేషుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకున్నాడు.
బాలీవుడ్‌లో షారుక్‌ఖాన్ ఇంట్లోనే కాదు.. మరో ఖాన్ సల్మాన్ ఇంట్లోనూ గణపతి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ప్రతి ఏటా బాలీవుడ్ సెలబ్రిటీలు అందరినీ పిలిచి గణేష్ ఉత్సవాలను సల్మాన్ నిర్వహిస్తాడు. హిందూ పండగలతోపాటు ఈద్ జరుపుకోవడం ఈ ఖాన్స్‌కు ఎప్పటి నుంచో అలవాటు. అటు సల్మాన్ తల్లి.. ఇటు షారుక్ భార్య గౌరీ హిందువులన్న విషయం తెలిసిందే.