తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Elimination: బిగ్ బాస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్- 15 లక్షలకు ఆశపడని టాప్ 4 ఫైనలిస్ట్- మరి ఎంత సంపాదించారంటే?

Bigg Boss Elimination: బిగ్ బాస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్- 15 లక్షలకు ఆశపడని టాప్ 4 ఫైనలిస్ట్- మరి ఎంత సంపాదించారంటే?

Sanjiv Kumar HT Telugu

15 December 2024, 5:30 IST

google News
    • Bigg Boss Telugu 8 Avinash And Prerana Remuneration: బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే ఇవాళ జరగనుంది. అయితే బిగ్ బాస్ 8 తెలుగు ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ శనివారం (డిసెంబర్ 13) జరగ్గా హౌజ్ నుంచి అవినాష్, ప్రేరణ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. మరి అవినాష్, ప్రేరణ రెమ్యునరేషన్ ఎంతో ఇక్కడ తెలుసుకుందాం.
బిగ్ బాస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్- 15 లక్షలకు ఆశపడని టాప్ 4 ఫైనలిస్ట్- మరి ఎంత సంపాదించారంటే?
బిగ్ బాస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్- 15 లక్షలకు ఆశపడని టాప్ 4 ఫైనలిస్ట్- మరి ఎంత సంపాదించారంటే? (Disney Plus Hotstar/Youtube)

బిగ్ బాస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్- 15 లక్షలకు ఆశపడని టాప్ 4 ఫైనలిస్ట్- మరి ఎంత సంపాదించారంటే?

Bigg Boss Telugu 8 Grand Finale Today And Elimination:బిగ్ బాస్ తెలుగు 8 ఫైనల్‌కు చేరుకుంది. మరికొన్ని గంటల్లో గ్రాండ్ ఫినాలే నిర్వహించి బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌ను ప్రకటించనున్నారు. అయితే, బిగ్ బాస్ విన్నర్ రేస్‌లో టాప్ 2 ఫైనలిస్ట్స్ మాత్రమే ఉంటారు. కాబట్టి, ఇందులో భాగంగానే టాప్ 5, టాప్ 4 ఫైనలిస్ట్స్‌ను ఎలిమినేట్ చేస్తారు.

అవినాష్, ప్రేరణ ఎలిమినేట్

బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌ను ఇవాళ (డిసెంబర్ 15) ప్రసారం చేయనున్నారు. కానీ, దీనికి సంబంధించిన బిగ్ బాస్ 8 తెలుగు డిసెంబర్ 15 ఎపిసోడ్ కొంత భాగం శనివారం (డిసెంబర్ 14) నాడే షూట్ చేశారు. దాని ప్రకారం బిగ్ బాస్ నుంచి టాప్ 5, టాప్ 4 ఫైనలిస్ట్స్ ఇద్దరు హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. వారు ఎవరో కాదు అవినాష్, ప్రేరణ.

బిగ్ బాస్ తెలుగు 8 టాప్ 5 కంటెస్టెంట్‌గా అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే, అవినాష్‌కు ఎలాంటి మనీ ఆఫర్ చేయలేదు. అవినాష్‌ను డైరెక్ట్‌గా ఎలిమినేట్ చేసినట్లు బిగ్ బాస్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. అలాగే, బిగ్ బాస్ 8 తెలుగు టాప్ 4 కంటెస్టెంట్‌గా ప్రేరణ కంబం ఎలిమినేట్ అయింది. అయితే, ప్రేరణకు మాత్రం బిగ్ బాస్ ప్రైజ్ మనీలోని రూ. 15 లక్షల డబ్బును ఆశ చూపారట.

15 లక్షలు వద్దన్న ప్రేరణ

కానీ, ఆ రూ. 15 లక్షలకు ప్రేరణ ఏమాత్రం లొంగలేదని సమాచారం. తాను బిగ్ బాస్ విన్నర్ అవుతాననే నమ్మకంతో మనీ ఆఫర్‌ను ప్రేరణ రెజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దాంతో టాప్ 4 ఫైనలిస్ట్ అయిన ప్రేరణ ఎలిమినేట్ అయింది. అవినాష్, ప్రేరణ ఎలిమినేషన్‌ వరకు శనివారం షూటింగ్ పూర్తి చేశారట.

ఇక మిగతా టాప్ 3 కంటెస్టెంట్ ఎలిమినేషన్ ప్రక్రియను గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రారంభ అయ్యే సమయానికి షూట్ చేస్తారని సమాచారం. అంటే, బిగ్ బాస్ తెలుగు 8 ఇన్ఫినిటీ ఫినాలే ఎపిసోడ్ ప్రారంభం అయ్యే సమయానికి (రాత్రి 7 గంటలకు) టాప్ 3 ఎలిమినేషన్, విన్నర్‌ను ప్రకటన వంటి భాగాన్ని షూటింగ్ చేయనున్నరన్నమాట. టాప్ 4 ఎలిమినేషన్ ప్రసారం అవగానే టాప్ 3 ఎలిమినేషన్ ఎపిసోడ్‌ను కంటిన్యూ చేస్తారని తెలుస్తోంది.

అవినాష్ రెమ్యునరేషన్

ఇదిలా ఉంటే, టాప్ 5 కంటెస్టెంట్‌గా ఎలిమినేట్ అయిన అవినాష్‌ బిగ్ బాస్ రెమ్యునరేషన్ వారానికి రూ. 2 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. అంటే, అక్టోబర్ 6న బిగ్ బాస్ తెలుగు 8లోకి వైల్డ్ కార్డ్‌ కంటెస్టెంట్‌గా వచ్చిన అవినాష్ 10 వారాలు హౌజ్‌లో ఉన్నాడు. ఈ లెక్కన బిగ్ బాస్ 8 తెలుగు ద్వారా పది వారాల్లో అవినాష్ రూ. 20 లక్షలు సంపాదించినట్లు టాక్.

అయితే, బిగ్ బాస్ తెలుగు 4 సీజన్‌లో అలరించిన అవినాష్ బిగ్ బాస్ 8 తెలుగుకు కాస్తా ఎక్కువ పోరితోషికం అందుకున్నాడని మరో టాక్ నడుస్తోంది. ఈ సీజన్‌కి వారానికి రూ. 5 లక్షలు తీసుకున్నట్లు మరికొన్ని వార్తలు వచ్చాయి. దీని ప్రకారం చూసుకుంటే అవినాష్ పది వారాల్లో రూ. 50 లక్షలు సంపాదించినట్లే. అంటే, బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్‌ మనీ అంతా అవినాష్ దక్కించుకున్నట్లే అని తెలుస్తోంది.

ప్రేరణ రెమ్యునరేషన్

ఇక టాప్ 4 కంటెస్టెంట్‌గా ఎలిమినేట్ అయిన ప్రేరణ వారానికి రూ. 2 లక్షలు, రోజుకు రూ. 28,571 రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అంటే, సెప్టెంబర్ 1న బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టిన ప్రేరణ హౌజ్‌లో 15 వారాలు, మూడున్నర నెలలు, 105 రోజులు ఉన్నట్లు. దీని ప్రకారంగా 15 వారాల్లో ప్రేరణ సుమారుగా రూ. 30 లక్షలు సంపాదించినట్లు సమాచారం.

అయితే, కృష్ణ ముకుంద మురారి సీరియల్‌లో హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రేరణకు బిగ్ బాస్‌లో పాల్గొన్నందుకు రూ. 3.5 లక్షల పారితోషికం ఇచ్చినట్లు మరో టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కల ప్రకారం 15 వారాలకు ప్రేరణ రూ. 52.5 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది. ఇలా అయితే, ప్రేరణ కూడా బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ అంత సంపాదించినట్లే అవుతుంది. మరి ఈ రెమ్యునరేషన్‌లో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.

తదుపరి వ్యాసం