Vishnupriya Remuneration: బిగ్ బాస్ నుంచి విష్ణుప్రియ ఎలిమినేట్! 3 నెలల సంపాదన ఇదే! విన్నర్స్ ప్రైజ్ మనీ కంటే ఎక్కువ?-bigg boss telugu 8 vishnupriya remuneration for 3 months is more than bigg boss 8 telugu winner prize money all seasons ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vishnupriya Remuneration: బిగ్ బాస్ నుంచి విష్ణుప్రియ ఎలిమినేట్! 3 నెలల సంపాదన ఇదే! విన్నర్స్ ప్రైజ్ మనీ కంటే ఎక్కువ?

Vishnupriya Remuneration: బిగ్ బాస్ నుంచి విష్ణుప్రియ ఎలిమినేట్! 3 నెలల సంపాదన ఇదే! విన్నర్స్ ప్రైజ్ మనీ కంటే ఎక్కువ?

Sanjiv Kumar HT Telugu

Vishnupriya Remuneration For Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు 8 నుంచి రెండో సారి ఎలిమినేషన్‌లో యాంకర్ విష్ణుప్రియ భీమనేని ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది.టైటిల్ విన్నర్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన విష్ణుప్రియ బిగ్ బాస్ 8 తెలుగులో 3 నెలలు పాల్గొన్నందుకు తో తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసుకుందాం.

బిగ్ బాస్ నుంచి విష్ణుప్రియ ఎలిమినేట్! 3 నెలల సంపాదన ఇదే! విన్నర్స్ ప్రైజ్ మనీ కంటే ఎక్కువ?

Bigg Boss 8 Telugu Vishnupriya Bhimeneni Remuneration: బిగ్ బాస్ తెలుగు 8 క్లైమాక్స్‌కు చేరుకుంది. బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ ముగియడానికి ఇంకా ఒక్క వారమే మిగిలింది. డిసెంబర్ 15న బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే నిర్వహించి టైటిల్ విన్నర్ ఎవరో ప్రకటిస్తారు. ఈ బిగ్ బాస్ సీజన్ విజేతను గెలిపించడానికి ఓటింగ్ పోల్ డిసెంబర్ 8 రాత్రి 10:30 గంటలకు ఓపెన్ అయింది.

పృథ్వీరాజ్‌తో లవ్ ట్రాక్

ఇదిలా ఉంటే, బిగ్ బాస్ 8 తెలుగు టైటిల్ ఫేవరెట్ కంటెస్టెంట్‌గా అడుగు పెట్టింది యాంకర్ విష్ణుప్రియ భీమనేని. కానీ, అతి తక్కువ కాలంలోనే తనలో విన్నర్ క్వాలిటీస్ లేవని, ఉన్నన్ని రోజులు ఎంటర్‌టైన్ చేయాలి, ఎంజాయ్ చేయాలి అన్నట్లుగా తన తీరు సాగింది. మొదటి రెండు వారాలు బాగానే గేమ్ ఆడిన విష్ణుప్రియ తర్వాత పృథ్వీరాజ్‌తో లవ్ ట్రాక్‌కు తెరదింపింది.

తన లవ్‌లోని డెప్త్‌ను విష్ణుప్రియ చాలా ఓపెన్‌గా, ఎలాంటి సంకోచం లేకుండా, ధైర్యంగా బయటపెట్టినప్పటికీ పృథ్వీ మాత్రం కేవలం ఫ్రెండ్షిప్ అంటూ పక్కన పెట్టాడు. అలా కేవలం ఒక్క పృథ్వీపైనే ఫోకస్ పెట్టిన విష్ణుప్రియ తన బిగ్ బాస్ గేమ్‌ను తానే చేతులారా నాశనం చేసుకుంది. టైటిల్ కొడుతుందని ఆశించిన తన అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది.

విష్ణుప్రియ ఎలిమినేట్

ఇప్పుడు టాప్ 5 కంటెస్టెంట్‌గా కూడా నిలవకుండా బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయింది. పృథ్వీ ఎలిమినేట్ అయిన తర్వాత విష్ణుప్రియ గేమ్ చాలా బాగా ఆడినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. అంతకుముందున్న ఆట తీరు, లవ్ ట్రాక్‌తో చాలా వరకు ఫ్యాన్ బేస్ కోల్పోయింది. బిగ్ బాస్ తెలుగు 8 ఫైనల్ వీక్‌లో రెండో ఎలిమినేషన్ ప్రక్రియలో విష్ణుప్రియ ఎలిమినేట్ అయింది.

బిగ్ బాస్ తెలుగు 8 డిసెంబర్ 8 ఎపిసోడ్‌లో నబీల్, విష్ణుప్రియ మధ్య ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. వారిలో నబీల్ సేవ్ అవ్వగా విష్ణుప్రియ ఎలిమినేట్ అయింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 8 తెలుగుకు విష్ణుప్రియ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతనే టాపిక్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. బిగ్ బాస్ తెలుగు 8లోకి 12వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన విష్ణుప్రియ హౌజ్‌లో 3 నెలలకు పైగా (99 రోజులు/14 వారాలు) ఉంది.

విష్ణుప్రియ రెమ్యునరేషన్

బిగ్ బాస్‌లో పాల్గొన్నందుకు ఒక్క వారానికి విష్ణుప్రియ రూ. 4 లక్షలు, రోజుకి రూ. 57,142 పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఇలా 14 వారాలకు విష్ణుప్రియ సుమారుగా రూ. 56 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, 99 రోజుల లెక్కన చూస్తే 56, 57,058 రూపాయలు అవుతున్నాయి. అంటే, బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ కంటే ఎక్కువ అని చెప్పొచ్చు.

ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగు ప్రతి సీజన్‌లో టైటిల్ విన్నర్‌కు రూ. 50 లక్షల వరకు ప్రైజ్ మనీ లభించింది. ఒక్క సీజన్‌లో మాత్రమే ప్రస్తుతం రూ. 54 లక్షల వరకు ప్రైజ్ మనీ ఉంది. ఇలా చూస్తే విష్ణుప్రియ 3 నెలల సంపాదన బిగ్ బాస్ 8 తెలుగు టైటిల్ విజేత కంటే ఎక్కువగా ఉందని తెలుస్తోంది.

బిగ్ బాస్ విన్నర్స్‌ కంటే ఎక్కువ

అయితే, విష్ణుప్రియ బిగ్ బాస్‌ కోసం వారానికి రూ. 5.5 లక్షల రెమ్యునరేషన్ తీసుకుందని మరో టాక్ వినిపిస్తోంది. ఇలా చూస్తే 3 నెలలకు విష్ణుప్రియ రూ. 77 లక్షలు సంపాదించిందని తెలుస్తోంది. ఇక ఇది బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ప్రైజ్ మనీకి చాలా ఎక్కువగా ఉంది. ఒకవేళ ఈ రెమ్యునరేషన్‌లో నిజముంటే విష్ణుప్రియ ట్రోఫీ అందుకోలేదు కానీ, అన్ని సీజన్స్‌లోని బిగ్ బాస్ విజేతల కంటే చాలా ఎక్కువ సంపాదించినట్లు అవుతుంది.