Highest Paid Actor Yash: అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా యశ్.. రామాయణ సినిమాతో 2 రికార్డులు-yash is highest paid bollywood actor with ramayana remuneration yash beats shah rukh khan yash remuneration for ravana ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Highest Paid Actor Yash: అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా యశ్.. రామాయణ సినిమాతో 2 రికార్డులు

Highest Paid Actor Yash: అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా యశ్.. రామాయణ సినిమాతో 2 రికార్డులు

Sanjiv Kumar HT Telugu

Yash Ramayana Movie Remuneration: రణ్ బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న రామాయణం సినిమాలో కేజీఎఫ్ హీరో యశ్ రావాణాసురుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్‌తో యశ్ బాలీవుడ్‌లోనే అత్యధిక పారితోషికం అందుకున్న హీరోగా రికార్డుకెక్కాడు.

అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా యశ్.. రామాయణ సినిమాతో 2 రికార్డులు

Highest Paid Bollywood Actor Yash: కన్నడ స్టార్ హీరో యశ్ సౌత్ సినీ ఇండస్ట్రీలోనే ఇంపాక్ట్‌ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమాలతో బీభత్సమైన పాపులారిటీ అందుకున్నాడు యశ్. ఈ కన్నడ స్టార్ హీరో ఇప్పుడు రెండు మేజర్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. వాటిలో ఒకటి రామాయణ మూవీ.

రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి రాముడు, సీతగా నటిస్తున్న సినిమా రామాయణ (Ramayana Movie). బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ రామాయణ సినిమాలో రావాణాసురుడుగా స్టార్ హీరో యశ్ నటిస్తున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. యశ్ మాత్రమే కాకుండా ఇందులో భారీ తారాగాణం నటిస్తోంది.

రామాయణ సినిమాలో నటించేందుకు అందులోని నటీనటులకు భారీగానే పారితోషికం ముట్టజెబుతున్నారు మేకర్స్. అయితే, తాజాగా ఓ ఆసక్తికర విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో రావాణాసురుడి పాత్రలో నటిస్తున్నందుకు యశ్‌కు భారీగా రెమ్యునరేషన్ (Yash Remuneration) ఇస్తున్నారట నిర్మాతలు.

రామాయణ సినిమాలోని తన పాత్రకు కోసం యశ్ ఏకంగా రూ. 200 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడని సమాచారం. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ అవుతుంది. ఎందుకంటే ఈ చిత్రానికి యశ్ రెండు వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవడంతో బాలీవుడ్‌లో చరిత్రలోనే అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా రికార్డుకెక్కాడు.

యశ్ తీసుకున్న 200 కోట్ల రెమ్యునరేషన్ పఠాన్ (Pathaan Movie) మూవీకి బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ (Shahrukh Khan) తీసుకున్న పారితోషికం కంటే ఎక్కువగా ఉంది. పఠాన్ సినిమాకు షారుక్ రూ. 120 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నాడు. అంటే, షారుక్‌ను మించి పారితోషికం తీసుకుని యశ్ బాలీవుడ్‌లో హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్‌గా నిలిచాడు.

అంతేకాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకున్న సౌత్ ఇండస్ట్రీ యాక్టర్‌గా కూడా యశ్ మరో మైలు రాయి అందుకున్నాడు. ఇలా రామాయణ మూవీతో రెండు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు యశ్. కాగా రామాయణ సినిమాలో రణ్ బీర్, సాయి పల్లవి, యశ్‌తోపాటు సన్నీ డియోల్, లారా దత్తా, రవి దూబే వంటి స్టార్స్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. మొదటి భాగం 2025 చివరిలో లేదా 2026 ప్రారంభంలో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. ఇక యశ్ ఈ సినిమా మాత్రమే కాకుండా టాక్సిక్ (Toxic Movie) అనే మరో భారీ ప్రాజెక్ట్‌తో కూడా బిజీగా ఉన్నాడు. కన్నడలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు.

టాక్సిక్ చిత్రాన్ని కేవీఎన్ నిర్మించగా.. యశ్ సహా నిర్మాతగా ఉన్నాడు. ఈ సినిమాలో కరీనా కపూర్ (Kareena Kapoor) నటించాల్సింది. కానీ, ఇటీవల పలు కారణాలతో ఆమె తప్పుకున్నారు. అయితే, ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం గేమ్ చేంజర్ (Game Changer Movie) హీరోయిన్ కియారా అద్వానీని (Kiara Advani) ఎంపిక చేసినట్టు సమాచారం. ఇక టాక్సిక్ మూవీ ఏప్రిల్ 2025లో థియేటర్లలోకి రానుంది.