Kareena Kapoor Toxic: యశ్ టాక్సిక్ నుంచి తప్పుకున్న కరీనా కపూర్.. కారణం అదేనా?-bollywood actress kareena kapoor exits yashs toxic movie this is the reason behind it ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kareena Kapoor Toxic: యశ్ టాక్సిక్ నుంచి తప్పుకున్న కరీనా కపూర్.. కారణం అదేనా?

Kareena Kapoor Toxic: యశ్ టాక్సిక్ నుంచి తప్పుకున్న కరీనా కపూర్.. కారణం అదేనా?

Hari Prasad S HT Telugu
May 03, 2024 10:41 PM IST

Kareena Kapoor Toxic: రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న టాక్సిక్ మూవీ నుంచి బాలీవుడ్ నటి కరీనా కపూర్ తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో ఆమె కీలకమైన పాత్ర పోషించాల్సి ఉంది.

యశ్ టాక్సిక్ నుంచి తప్పుకున్న కరీనా కపూర్.. కారణం అదేనా?
యశ్ టాక్సిక్ నుంచి తప్పుకున్న కరీనా కపూర్.. కారణం అదేనా?

Kareena Kapoor Toxic: కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా లెవల్లో స్టార్ గా మారిపోయిన రాకింగ్ స్టార్ యశ్ రాబోయే మూవీ టాక్సిక్. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు వార్తలు వచ్చిన కొద్ది గంటల్లోపే మరో షాకింగ్ న్యూస్ వచ్చింది. ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తుందని భావించిన బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఇప్పుడీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం.

yearly horoscope entry point

టాక్సిక్ నుంచి తప్పుకున్న కరీనా

కేజీఎఫ్, కేజీఎఫ్ 2 తర్వాత యశ్ మరో మూవీలో కనిపించలేదు. మొత్తానికి టాక్సిక్ అంటూ కొన్ని నెలల కిందట తన నెక్ట్స్ ప్రాజెక్టును అతడు అనౌన్స్ చేశాడు. ఈ మూవీలో బాలీవుడ్ ప్రముఖ నటీమణులు కరీనా కపూర్, కియారా అద్వానీ, శృతి హాసన్ లాంటి వాళ్లు నటిస్తున్నట్లు వార్తలు వచ్చినా.. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

అయితే తాజాగా ఈ టాక్సిక్ మూవీలో యశ్ సోదరి పాత్రలో కనిపించబోతోందని భావించిన కరీనా కపూర్.. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపైనా టీమ్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. గతేడాది డిసెంబర్లో టైటిల్ లాంచ్ తప్ప ఇప్పటి వరకూ ఈ మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు.

అయితే కరీనా కపూర్ మాత్రం డేట్స్ కుదరడం లేదంటూ ఈ టాక్సిక్ నుంచి తప్పుకున్నట్లు చెబుతున్నారు. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే ఆమె తప్పుకుందని కూడా వార్తలు వస్తున్నాయి. కొన్ని నెలలుగా మేకర్స్ ప్రీప్రొడక్షన్ పనుల్లోనే బిజీగా ఉన్నారు తప్ప మూవీలో నటించబోయే వాళ్ల గురించిగానీ ఇతర సమాచారం ఏదీ ఇవ్వలేదు.

ఫ్యాన్స్ అసంతృప్తి

కేజీఎఫ్ లాంటి ఫ్రాంఛైజీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయిన యశ్ నెక్ట్స్ మూవీపై ఈ స్థాయిలో గందరగోళం నెలకొనడం ఫ్యాన్స్ ను అసంతృప్తికి గురి చేస్తోంది. ఈ సినిమాను కేవీఎన్ బ్యానర్లో తెరకెక్కిస్తున్నారు. అయితే ఆ ప్రొడక్షన్ హౌజ్ నుంచి ఎలాంటి అప్డేట్స్ ఉండటం లేదు. కానీ ఇప్పుడు కరీనా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందన్న వార్తలు మాత్రం వాళ్లను ఆనందానికి గురి చేస్తోంది.

ఈ మూవీలో ఆమె ఉందన్న వార్తలు వచ్చినప్పుడు యశ్ కు తల్లి పాత్రలో నటిస్తోందా అని పలువురు అభిమానులు ట్రోల్ చేశారు. ఈ టాక్సిక్ మూవీని గీతూ మోహన్‌దాస్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా 1960ల నేపథ్యంలో తెరకెక్కనుంది. గోవాలోని డ్రగ్ మాఫియా చుట్టూ తిరిగే కథగా భావిస్తున్నారు.

మరోవైపు యశ్ ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్ లో తెరకెక్కుతున్న రామాయణం మూవీకి అతడు కోప్రొడ్యూసర్ గా ఉన్న విషయం తెలిసిందే.

Whats_app_banner