Koffee With Karan: కాఫీ విత్ కరణ్‍కు కొత్త పేరు పెట్టిన ఆలియా భట్.. ఆ హీరోయిన్ గురించి ప్రశ్న దాటేసిన కరీనా కపూర్
Koffee With Karan season 8: కాఫీ విత్ కరణ్ టాక్ షోకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఆలియా భట్, కరీనా కపూర్ కలిసి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్‍గా మారింది.
Koffee With Karan season 8: బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ హోస్ట్ చేసే ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షో చాలా పాపులర్. ప్రస్తుతం 8వ సీజన్ నడుస్తోంది. ఈ సీజన్‍లో తదుపరి కాఫీ విత్ కరణ్ ఎపిసోడ్‍కు బాలీవుడ్ హీరోయిన్లు ఆలియా భట్, కరీనా కపూర్ రానున్నారు. ఈ ఎపిసోడ్‍కు సంబంధించిన ప్రోమో బయటికి వచ్చింది.
కాఫీ విత్ కరణ్‍కు కాంట్రవర్సియల్ విత్ కే అంటూ పేరు పెట్టారు ఆలియా భట్. దీంతో కరణ్ ఒక్కసారి ఎక్స్‌ప్రెషన్ మార్చేశారు. టాక్ షోకు వచ్చే సెలెబ్రిటీలను ఒక్కోసారి కరణ్ వివాదాస్పద ప్రశ్నలు వేస్తుండటంతో ఈ షోను సరదాగా కాంట్రవర్సియల్ విత్ కరణ్ అని ఆలియా అన్నారు.
మాటల్లో భాగంగా మరదలు, వదిన అనే రిలేషన్లను కరణ్ జోహార్ అన్నారు. “నీకే తెలియాలి. నువ్వే కే3జీ (కబీ ఖుషి కబీ గమ్) సినిమా తీశావు కదా” అని కరీనా కపూర్ అన్నారు. “నేను ఎవరికీ వదిన కాదు” అని అన్నారు. పార్టీల్లో ఎక్కువ చేసే డ్యాన్స్ మూవ్ ఏది అని ఆలియాను కరణ్ అడిగారు. దీంతో ఆమె ఆ స్టెప్ చేసి చూపించారు.
గదర్ 2 సినిమా సక్సెస్ పార్టీకి ఎందుకు రాలేదని కరీనా కపూర్‌ను కరణ్ జోహార్ ప్రశ్నించారు. అమిషా పటేల్‍తో గతంలో కరీనాకు ఉన్న విభేదాలను గుర్తు చేశారు. గదర్ 2 పార్టీకి ఎందుకు రాలేదన్న ప్రశ్నకు తాను స్పందించనని కరీనా కపూర్ అన్నారు. తన స్టైల్‍లో ఆ క్వశ్చన్‍కు నో చెప్పారు. దీంతో ప్రోమో ముగిసింది. ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. ఆలియా, కరీనా కపూర్ పూర్తి ఎపిసోడ్ త్వరలోనే రానుంది.
కాఫీ విత్ కరణ్ 8వ సీజన్ డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍పామ్‍లో స్ట్రీమ్ అవుతోంది. ప్రతీ గురువారం కొత్త ఎపిసోడ్ వస్తోంది.
ఆలియా భట్, కరీనా కపూర్ కలిసి ఇప్పటి వరకు ఏ చిత్రం చేయలేదు. అయితే, ఇటీవల ఇద్దరూ కలిసి ఓ జువెలరీ యాడ్ చేశారు. ఇటీవల దివాలీ పార్టీని కరీనా కపూర్ తన ఇంట్లో నిర్వహించారు. ఈ పార్టీకి ఆలియా భట్, రణ్‍బీర్ కపూర్ కూడా హాజరయ్యారు.
ఆలియా భట్ హాలీవుడ్‍లోనూ అడుగుపెడుతున్నారు. హార్ట్ ఆఫ్ స్టోన్ అనే ఇంగ్లిష్ చిత్రంలో ఆమె నటిస్తున్నారు. ఇక కరీనా కపూర్ చివరగా జానేజాన్ మూవీలో కనిపించారు. తదుపరి బకింగ్ హామ్ మర్డర్స్ అనే సినిమా చేస్తున్నారు.