Bigg Boss Elimination: షాకింగ్‌గా బిగ్ బాస్ చివరి ఎలిమినేషన్- ఈ వారం ఇద్దరు ఎలిమినేట్- ఇవాళ రోహిణి అవుట్- రేపు ఎవరంటే?
Bigg Boss Telugu 8 14th Week Elimination Double: బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌తో షాక్ ఇచ్చింది బీబీ టీమ్. బిగ్ బాస్ 8 తెలుగు డిసెంబర్ 7 ఎపిసోడ్‌లో రోహిణి ఎలిమినేట్ కానుంది. దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తి అయిపోయింది. ఇక రేపు (డిసెంబర్ 8) ఎవరు ఎలిమినేట్ కానున్నారనేది ఆసక్తిగా మారింది.
Bigg Boss Telugu 8 This Week Elimination Double: బిగ్ బాస్ తెలుగు 8లో ఈ వారం ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఏమాత్రం ఎక్స్‌పెక్ట్ చేయనివిధంగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనుంది. అంటే, బిగ్ బాస్ తెలుగు 8 పద్నాలుగో వారం రెండు సార్లు ఎలిమినేషన్ ప్రక్రియ జరగనుంది.
బిగ్ బాస్ టాప్ 6 కంటెస్టెంట్స్
అయితే, ఇప్పటివరకు బిగ్ బాస్ 8 తెలుగు 14వ వారం సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందని అంతా భావించారు. ఒక్కరినే ఎలిమినేట్ చేసి వచ్చే వారానికి అంటే బిగ్ బాస్ తెలుగు 8 ఫినాలే వీక్‌కు టాప్ 6 కంటెస్టెంట్స్‌ను పంపించే అవకాశం ఉందని అనుకున్నారు. బిగ్ బాస్ తెలుగు 7 సీజన్‌లో కూడా గ్రాండ్ ఫినాలేకు టాప్ 6 కంటెస్టెంట్స్‌ను పంపించారు. అలాగే, ఈ సీజన్‌లో ఉంటుందనుకున్నారు.
ఈ వారం డబుల్ ఎలిమినేషన్
కానీ, అంచనాలను తారుమారు చేసేలా ఎప్పటిలా ఉండే టాప్ 5 కంటెస్టెంట్స్‌ను మాత్రమే బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలేకు పంపించనున్నారని తెలుస్తోంది. అందుకోసమే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా బిగ్ బాస్ తెలుగు 8 డిసెంబర్ 7 ఎపిసోడ్‌లో జబర్దస్త్ రోహిణి ఎలిమినేట్ అయినట్లు బీబీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం.
ఈ వారం నామినేషన్స్‌లో ఆరుగురు
దీనికి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ పూర్తి అయింది. రోహిణి ఎలిమినేషన్ ఎపిసోడ్‌ను ఇవాళ ప్రసారం చేయనున్నారు. ఇక ఎప్పటిలా చేసే వీకెండ్ ఎలిమినేషన్‌లో ఎవరు హౌజ్ నుంచి ఎలిమినేట్ కానున్నారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. అయితే ఈ వారం అవినాష్ మినహా మిగతా ఆరుగురు కంటెస్టెంట్స్ గౌతమ్, విష్ణుప్రియ, నబీల్, నిఖిల్, ప్రేరణ, రోహిణి నామినేషన్స్‌లో ఉన్నారు.
డేంజర్ జోన్‌లో విష్ణుప్రియ, రోహిణి
వీరిలో బిగ్ బాస్ ఓటింగ్ ప్రకారం డేంజర్ జోన్‌లో రోహిణి, విష్ణుప్రియ ఉంటూ వచ్చారు. ఇక తాజాగా మొదటి ఎలిమినేషన్‌గా రోహిణి ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌజ్ నుంచి అవుట్ అయింది. ఇక బాటమ్ 2లో ఉన్న విష్ణుప్రియ రేపు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు 99.99 శాతం ఉన్నాయని సమాచారం. అయితే, కొన్ని ఓటింగ్ పోల్స్ నబీల్, ప్రేరణ కూడా డేంజర్ జోన్‌లో ఉన్నట్లు చూపించాయి.
ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్
కాబట్టి, బిగ్ బాస్ తెలుగు 8 డిసెంబర్ 8 ఎపిసోడ్‌లో నబీల్, ప్రేరణలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన రెండో ఎలిమినేషన్‌లో రేపు (ఆదివారం) విష్ణుప్రియ, ప్రేరణ, నబీల్‌లో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే, డిసెంబర్ 15న జరగనున్న బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలేలోకు వెళ్లే టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరో మరింత ఆసక్తిగా మారింది.
టాపిక్