Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌లోకి కృష్ణ ముకుంద మురారి సీరియల్ హీరోయిన్.. హౌజ్‌లో కూడా తన విలన్‌తో పోటీ!-krishna mukunda murari actress prerana kambam confirmed to bigg boss telugu 8 contestant and fight with yashmi gowda ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌లోకి కృష్ణ ముకుంద మురారి సీరియల్ హీరోయిన్.. హౌజ్‌లో కూడా తన విలన్‌తో పోటీ!

Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌లోకి కృష్ణ ముకుంద మురారి సీరియల్ హీరోయిన్.. హౌజ్‌లో కూడా తన విలన్‌తో పోటీ!

Sanjiv Kumar HT Telugu
Aug 29, 2024 02:30 PM IST

Prerana Kambam In Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లోకి కృష్ణ ముకుంద మురారి సీరియల్ హీరోయిన్ ప్రేరణ కంబం కంటెస్టెంట్‌గా కన్ఫర్మ్ అయిందని తాజాగా ఓ న్యూస్ అందింది. ప్రేరణ కన్ఫర్మేషన్‌తో బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్‌లోకి మొత్తం దాదాపుగా 20 మంది కంటెస్టెంట్స్‌గా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్‌లోకి కృష్ణ ముకుంద మురారి సీరియల్ హీరోయిన్.. హౌజ్‌లో కూడా తన విలన్‌తో పోటీ!
బిగ్ బాస్‌లోకి కృష్ణ ముకుంద మురారి సీరియల్ హీరోయిన్.. హౌజ్‌లో కూడా తన విలన్‌తో పోటీ!

Bigg Boss 8 Telugu Contestant Prerana: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌కు అనుకున్నంత బజ్ క్రియేట్ కావట్లేదు. కానీ, హౌజ్‌లోకి వెళ్లే కంటెస్టెంట్స్ ఎవరనే క్యూరియాసిటీ ఉంది. సీజన్ స్టార్ట్ అయ్యాకే చూసుకుందాం అన్నట్లుగా ఆడియెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, బిగ్ బాస్ 8 తెలుగులోకి దాదాపుగా 20 మంది వరకు కంటెస్టెంట్స్ పార్టిస్‌పేట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

కృష్ణ పాత్రతో

తాజాగా బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లోకి కృష్ణ ముకుంద మురారి సీరియల్ హీరోయిన్ ప్రేరణ కంబం అడుగు పెట్టనుందని టాక్ నడుస్తోంది. స్టార్ మా ఛానెల్‌లోని పాపులర్ సీరియల్స్‌లో కృష్ణ ముకుంద మురారి ఒకటి. ఇందులో కృష్ణ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ప్రేరణ కంబం. మురారిని ప్రేమించే తింగరి పిల్లగా, అమాయకపు డాక్టర్‌గా తన నటనతో బాగా ఆకట్టుకుంది.

తెలుగులో మంచి పాపులారిటీ దక్కించుకున్న ప్రేరణను హౌజ్‌లోకి పంపించనున్నారట. తాజాగా ప్రేరణ బిగ్ బాస్ ఎంట్రీ కన్ఫర్మ్ అయిందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అయితే, తెలుగు బిగ్ బాస్ షోలోకి స్టార్ మా సీరియల్స్‌లోని నటీమణులు ఎంట్రీ ఇవ్వడం పరిపాటే. ఇదివరకు కార్తీక దీపం ఫేమ్ శోభా శెట్టి, కీర్తి భట్ అలా అడుగుపెట్టినవాళ్లే.

ముకుంద మురారి సీరియల్‌

అయితే, కార్తీక దీపం లాగే కృష్ణ ముకుంద మురారి సీరియల్‌లోని ఇద్దరు నటీమణులు బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ సీరియల్‌లో విలన్‌గా, కృష్ణను ప్రేమించే మురారిని దక్కించుకునే ముకుంద పాత్రలో అదరగొట్టింది యష్మీ గౌడ. ఈ సీరియల్ ద్వారా ప్రేరణకు ఎంత ఫాలోయింగ్ వచ్చిందో యష్మీ గౌడకు అంతే పాపులారిటీ వచ్చింది.

ఇదివరకే బిగ్ బాస్ 8 తెలుగులో కంటెస్టెంట్‌గా యష్మీ గౌడ నూటికి నూరు శాతం కన్ఫర్మ్ అయింది. బిగ్ బాస్ ప్రారంభం అయ్యే సెప్టెంబర్ 1 నాడే హౌజ్‌లోకి యష్మీ గౌడ ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. ఇప్పుడు ప్రేరణ కూడా కన్ఫర్మ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే సీరియల్‌లో మురారి కోసం ఇద్దరూ యుద్ధం చేసినట్లుగా బిగ్ బాస్ తెలుగు 8లో టైటిల్ కోసం ప్రేరణ కంబం, యష్మీ గౌడ మరోసారి పోటీ పడటం ఖాయం అనిపిస్తోంది.

టైటిల్ కోసం తన విలన్‌తో

హౌజ్‌లో బిగ్ బాస్ టైటిల్ కోసం తన విలన్‌తో యుద్ధానికి ప్రేరణ మరోసారి సిద్ధం కావాల్సిందేనని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఒక్క సీజన్‌లోనే ఒకే సీరియల్ నుంచి ఇద్దరు నటీమణలు కంటెస్టెంట్స్‌గా వెళ్లడం విశేషంగా మారుతుంది. ఇదివరకు కార్తీక దీపం సీరియల్ శోభా శెట్టి బిగ్ బాస్ తెలుగు 7లో అలరిస్తే.. కీర్తి భట్ సీజన్ 6లో పాల్గొంది.

కాగా బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్‌లోకి యష్మీ గౌడ, ప్రేరణ కంబంతోపాటు ఆదిత్య ఓం, అభిరామ్ వర్మ, బెజవాడ బేబక్క, నిఖిల్ మలియక్కల్, నైనిక అనసురు, అభయ్ నవీన్, విష్ణుప్రియ, విస్మయ శ్రీ, కిర్రాక్ సీత, ఆర్జే శేఖర్ బాషా, నాగ మణికంఠ, సహర్ కృష్ణన్, ఖయ్యూమ్ అలీ, రీతూ చౌదరి, ఇంద్రనీల్ కంటెస్టెంట్స్‌గా వెళ్లనున్నారట.

సుమారు 19 లేదా 20 మంది

అలాగే వీరితోపాటు మాజీ కంటెస్టెంట్స్ అయిన ఆర్జే చైతూ, జబర్దస్త్ అవినాష్ కూడా కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. ఇలా మొత్తంగా బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్‌లోకి 19 లేదా 20 మంది కంటెస్టెంట్స్‌గా పాల్గొనున్నట్లు తెలుస్తోంది.