Kerala Film Awards: సర్వైవల్ థ్రిల్లర్ ఆడు జీవితంకు 8 అవార్డ్స్- సలార్ విలన్‌కు 3వసారి- కేరళ అవార్డ్స్ విజేతలు వీళ్లే!-kerala state film awards 2024 winners list aadujeevitham got 8 awards prithviraj sukumaran as best actor for third time ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kerala Film Awards: సర్వైవల్ థ్రిల్లర్ ఆడు జీవితంకు 8 అవార్డ్స్- సలార్ విలన్‌కు 3వసారి- కేరళ అవార్డ్స్ విజేతలు వీళ్లే!

Kerala Film Awards: సర్వైవల్ థ్రిల్లర్ ఆడు జీవితంకు 8 అవార్డ్స్- సలార్ విలన్‌కు 3వసారి- కేరళ అవార్డ్స్ విజేతలు వీళ్లే!

Sanjiv Kumar HT Telugu
Aug 16, 2024 02:33 PM IST

Kerala State Film Awards 2024 Winners List: కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డ్స్ 2024లో సలార్ విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఆడు జీవితంకు ఏకంగా 8 విభాగాల్లో అవార్డులు వరించాయి. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్‌కు మూడోసారి ఉత్తమ నటుడు పురస్కారం దక్కింది.

సర్వైవల్ థ్రిల్లర్ ఆడు జీవితంకు 8 అవార్డ్స్- సలార్ విలన్‌కు 3వసారి- కేరళ అవార్డ్స్ విజేతలు వీళ్లే!
సర్వైవల్ థ్రిల్లర్ ఆడు జీవితంకు 8 అవార్డ్స్- సలార్ విలన్‌కు 3వసారి- కేరళ అవార్డ్స్ విజేతలు వీళ్లే!

Kerala State Film Awards 2024: సౌదీ అరేబియాలోని ఎడారిలో ఏళ్ల తరబడి బానిసత్వంలో ఉండి మేకలను మేపుతున్న మలయాళీ వలసదారుడి నిజ జీవిత కథాంశంతో తెరెక్కిన సినిమా 'ఆడు జీవితం'. వరల్డ్ వైడ్‌గా 'ది గోట్ లైఫ్' అనే టైటిల్‌తో రిలీజ్ అయింది. 2024లో మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రంగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.

54వ కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్‌

ఇప్పుడు తాజాగా ఆడు జీవితం మూవీకి అవార్డుల పంట పండింది. ఏకంగా 8 కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకుని సత్తా చాటింది. 54వ కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, బెస్ట్ మేకప్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ సౌండ్ మిక్సింగ్‌తోపాటు తదితర విభాగాల్లో పురస్కారాలను గెలుచుకుంది ఈ సినిమా.

31 కిలోల బరువు తగ్గి

ఆడు జీవితం చిత్రంలో 'నజీబ్' పాత్రను పోషించిన పృథ్వీరాజ్ సుకుమారన్ శారీరకంగా చాలా శ్రమించాడు. తన బాడీని పలు విధాలుగా మార్చుకున్నాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ దాదాపుగా 31 కిలోల బరువు తగ్గాడు. దీనికి ఎన్నో ప్రశంసలు అందుకున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఉత్తమ నటుడిగా కేరళ ఫిల్మ్ స్టేట్ అవార్డ్‌ను 2024 సంవత్సరానికి గానూ అందుకున్నారు.

మూడోసారి

అయితే, పృథ్వీరాజ్ సుకుమారన్ గతంలో కూడా ఉత్తమ నటుడిగా అవార్డ్స్ దక్కించుకున్నారు. 2006, 2012 సంవత్సరాల్లో కేరళ స్టేట్ అవార్డులను పృథ్వీరాజ్ సుకుమారన్ అందుకోవడం విశేషం. 41 ఏళ్ల పృథ్వీరాజ్ సుకుమారన్‌కు ఇది మూడో రాష్ట్ర ఉత్తమ నటుడి పురస్కారం. దీంతో తన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని ఫ్యాన్స్, నెటిజన్స్ భావిస్తున్నారు.

ప్రజాదరణ పొందిన మూవీగా

ఇక ఈ కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో బ్లెస్సీ (ఉత్తమ దర్శకుడు), కేఆర్ గోకుల్ (స్పెషల్ జ్యూరీ), సునీల్ కేఎస్ (సినిమాటోగ్రఫీ), రంజిత్ అంబడి (మేకప్), సౌండ్ మిక్సింగ్ (రసూల్ పూకుట్టి, శరత్ మోహన్) అవార్డులు అందుకున్నారు. అలాగే ది గోట్ లైఫ్ మూవీ ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా కూడా ఎంపికైంది.

స్వలింగ సంపర్కుడి కథ

ఇదే కాకుండా ఈ కేరళ ఫిల్మ్ అవార్డ్స్‌లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పోషించిన 'కాథల్: ది కోర్' మూవీ ఉత్తమ చిత్రంగా అవార్డ్ దక్కించుకుంది. ఇందులో ఓ స్వలింగ సంపర్కుడి కథా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు, అతని వైవాహిక జీవితం గురించి ఎంతో వివరంగా, ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేకుండా తెరకెక్కించారు. 2023లో వచ్చిన ఈ సినిమాకు జియో బేబీ దర్శకత్వం వహించారు.

ఉత్తమ నటిగా ఇద్దరు

గే పాత్రలో మమ్ముట్టి నటించిన 'కాథల్: ది కోర్' విడుదలైన తొలి రోజు నుంచే విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఉత్తమ నటిగా సీనియర్ నటి ఊర్వశి.. 'ఉల్లోజుక్కు' చిత్రానికి గానూ.. 'తడవు' చిత్రానికి బీనా ఆర్ చంద్రన్ అవార్డులు అందుకున్నారు.

టెక్నిషియన్స్ అవార్డ్

విద్యాధరన్ మాస్టర్ (ఉత్తమ నేపథ్య గాయకుడు - పురుషుడు), అన్నే అమీ (ఉత్తమ నేపథ్య గాయని - మహిళ), ఉత్తమ రెండవ చిత్రం (ఇరాట్టా), ఉత్తమ స్క్రీన్ ప్లే - రోహిత్ (ఇరాట్టా), ఉత్తమ గీత రచయిత - హరీష్ మోహన్ (చావర్), ఉత్తమ సంగీత దర్శకుడు - జస్టిన్ వర్గీస్ (చావర్) అవార్డ్స్ అందుకున్నారు.

Whats_app_banner