Raayan OTT Official: 3 రోజుల ముందుగానే ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ తమిళ మూవీ- తెలుగులోనూ స్ట్రీమింగ్- ఇక్కడ చూసేయండి!
Raayan OTT Streaming Date Official: తమిళ స్టార్ హీరో ధనుష్ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ రాయన్ ఓటీటీలోకి వచ్చేయనుంది. ఏకంగా ఐదు భాషల్లో ఓటీటీలో రాయన్ స్ట్రీమింగ్ కానుందని సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్ అధికారికంగా సోషల్ మీడియాలో వెల్లడించింది.
Raayan OTT Release Official: తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ రాయన్. ధనుష్ హీరోగా మాత్రమే కాకుండా మొదటి సారి దర్శకత్వ వహించిన మూవీ రాయన్. తన సినీ కెరీర్‌లోని 50వ సినిమాను ధనుష్ డైరెక్ట్ చేయడం విశేషంగా మారింది. అయితే, ఈ సినిమా విడుదలకు ముందు పెద్దగా బజ్ క్రియేట్ చేయలేదు. కానీ, టాక్ పరంగా సత్తా చాటింది.
జూలై 26న వరల్డ్ వైడ్‌గా చాలా గ్రాండ్‌గా విడుదలైన రాయన్ మూవీకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా కథ పాతదే అయినప్పటికీ ధనుష్ టేకింగ్ చాలా కొత్తగా ఉందని ప్రశంసలు వచ్చాయి. అలాగే ఇందులో ధనుష్ యాక్టింగ్ అదిరిపోయిందని, మాస్ లెవెల్ యాక్టింగ్ అని ఫ్యాన్స్, నెటిజన్స్ ఫుల్ పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు.
150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్
అయితే, తమిళంలో అదరగొట్టిన రాయన్ సినిమా తెలుగులో మాత్రం బాక్సాఫీస్ వద్ద కాస్తా కష్టపడినట్లు సమాచారం. ఇది పక్కన పెడితే వరల్డ్ వైడ్‌గా రాయన్ సినిమా దాదాపుగా రూ. 150 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు కొట్టింది. ధనుష్ హీరోగా, అది కూడా డైరెక్ట్ చేసిన సినిమా ఇంత పెద్ద హిట్ కావడం విశేషంగా మారింది.
ఇలాంటి రాయన్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేయనుంది. జూలై 26న థియేటర్లలో విడుదలైన రాయన్ సినిమా నెల కాకముందే డిజిటల్ ప్రీమియర్ కానుంది. రాయన్ ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ మంచి ధర వెచ్చించి కొనుగోలు చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో రాయన్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని తాజాగా అధికారిక ప్రకటన వచ్చేసింది.
నెలకంటే 3 రోజుల ముందుగానే
రాయన్ సినిమాను అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఆగస్ట్ 23న ప్రసారం చేయనున్నారు. అంటే, నెలకు మూడు రోజుల ముందుగానే ఓటీటీలోకి రాయన్ వచ్చేయనుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ సోషల్ మీడియాలో వేదికగా అధికారికంగా వెల్లడించింది.
ఇప్పుడు రాయన్ ఓటీటీ రిలీజ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అయిపోయింది. థియేటర్లలో ఈ చిత్రాన్ని చూసినవాళ్లతోపాటు చూడనివాళ్లు కూడా వీక్షించేందుకు ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఇంకో వారంలో రాయన్ ఓటీటీలో దర్శనం ఇవ్వనున్నాడు. కాగా, రాయన్ మూవీలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ఓ కీలక పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు.
రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్
ధనుష్ హీరోగా, స్వీయ దర్శకత్వంలో వచ్చిన రాయన్ మూవీలో సందీప్ కిషన్‌తోపాటు ఎస్‌జే సూర్య, కాళిదాస్ జయరామ్, దుసరా విజయన్, వరలక్ష్మీ శరత్ కుమార్, అపర్ణ బాలమురళి, ప్రకాష్ రాజ్, సెల్వ రాఘవన్, శరవణన్ ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. అంతేకాకుండా ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
కాగా రాయన్ సినిమాను తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి రిలీజ్ చేశారు. ఇక రివేంజ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన రాయన్ మూవీలో సందీప్ కిషన్ రోల్ చాలా ఇంపార్టెంట్ అని టాక్ వచ్చింది. ఈ మూవీతో ధనుష్ డైరెక్టర్‌గా కూడా మంచి హిట్ కొట్టినట్లు అయింది.