Bigg Boss Telugu Winner: బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రేస్‌లో ఆ ముగ్గురే.. ఈవారం ఆమె ఎలిమినేషన్ పక్కా!-bigg boss 7 telugu title winner voting top 3 contestants and this week shobha shetty eliminated ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu Winner: బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రేస్‌లో ఆ ముగ్గురే.. ఈవారం ఆమె ఎలిమినేషన్ పక్కా!

Bigg Boss Telugu Winner: బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రేస్‌లో ఆ ముగ్గురే.. ఈవారం ఆమె ఎలిమినేషన్ పక్కా!

Sanjiv Kumar HT Telugu
Dec 06, 2023 06:16 AM IST

Bigg Boss 7 Telugu Winner Voting: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ మరో రెండు వారాలు మిగిలి ఉంది. ఇప్పటికే టైటిల్ విన్నర్ ఎవరనేది తేల్చేందుకు ఓటింగ్ పోల్స్ ఓపెన్ చేసి ప్రేక్షకుల చేతుల్లో పెట్టేసారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఈ టైటిల్ విన్నర్ రేసులో ముగ్గురు చాలా గట్టిగా పోటీ పడుతున్నారు.

బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రేస్‌లో ఆ ముగ్గురే.. ఈవారం ఆమె ఎలిమినేషన్ పక్కా!
బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రేస్‌లో ఆ ముగ్గురే.. ఈవారం ఆమె ఎలిమినేషన్ పక్కా!

Bigg Boss 7 Telugu 14th Week Elimination: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ తుది ఘట్టానికి చేరుకుంది. మరో రెండు వారాల్లో ఏడో సీజన్ ముగిసిపోనుంది. డిసెంబర్ 15 వరకు టైటిల్ విన్నర్ ఓటింగ్ పోల్స్ ఉంచుతారు. డిసెంబర్ 17న గ్రాండ్ ఫినాలే నిర్వహించి బిగ్ బాస్ 7 తెలుగు టైటిల్ విన్నర్ ఎవరనేది ప్రకటించనున్నారు.

బిగ్ బాస్ 7 తెలుగులో ఫైనల్ నామినేషన్స్ హోరాహోరీగా జరిగాయి. ఇక ఈసారి ఎలిమినేషన్‌ కోసం కాకుండా టైటిల్ విన్నర్ కోసం ఓటింగ్ పోల్స్ పెట్టారు. అందులో ఎవరికీ తక్కువగా ఓటింగ్ వస్తే వారు ఎలిమినేట్ అవుతారు. 14వ వారం ఒకరు, 15వ వారంలో మధ్యలో (మిడ్ వీక్ ఎలిమినేషన్) మరొకరిని ఎలిమినేట్ చేస్తారు. దీంతో గ్రాండ్ ఫినాలే టైమ్‌కు టాప్ 5 కంటెస్టెంట్స్ ఉంటారు.

ఇక బిగ్ బాస్ 7 తెలుగు టైటిల్ విన్న ర్ రేసులో ముగ్గురు గట్టిగా పోటీ పడుతున్నారు. వారు ఎవరో కాదు హీరో శివాజీ, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్, సీరియల్ హీరో అమర్ దీప్ చౌదరి. రైతుబిడ్డ ప్రశాంత 34.44 శాతంతో మొదటి ప్లేసులో ఉంటే.. 21.56 శాతంతో శివాజీ రెండో స్థానం, 20.47 శాతంతో అమర్ మూడో ప్లేస్‌లో ఉన్నారు. కాస్తా అటు ఇటుగా వీరి ఓట్లు మారుతూ వస్తున్నాయి. దీంతో టైటిల్ విన్నర్ అయ్యే అవకాశం ఈ ముగ్గురిలోనే ఉందని తెలుస్తోంది.

ఎక్కువగా పల్లవి ప్రశాంత్‌కు టైటిల్ విన్నర్ కొట్టే అవకాశం కనిపిస్తోంది. కానీ, డిసెంబర్ 15 వరకు ఏమైనా జరగొచ్చు. ఇక 17.9 శాతంతో నాలుగో స్థానంలో ప్రిన్స్ యావర్, 2.32 శాతంతో ఐదో ప్లేసులో అర్జున్, 2.23 శాతంతో ఆరో స్థానంలో ప్రియాంక, 1.08 శాతంతో ఏడో స్థానంలో శోభా శెట్టి నిలిచారు. తక్కువ ఓట్లు పడినావాళ్లు ఎలిమినేట్ అవుతారని బిగ్ బాస్ చెప్పాడు.

ఈ ఓటింగ్‌లో చివరన ఉన్న శోభా శెట్టి 14వ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఆమెను సేవ్ చేస్తూ స్ట్రాంగ్ అండ్ గుడ్ ప్లేయర్స్‌ను ఎలిమినేట్ చేస్తూ వచ్చిన బిగ్ బాస్ ఈవారం శోభా శెట్టిని పక్కాగా ఎలిమినేట్ చేస్తాడా అనే సందేహం కూడా వస్తోంది. కాకపోతే మిగతా వారు ఆమె కంటే బెటర్ కావడంతో ఈవారం శోభా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్.

Whats_app_banner