Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు 8లోకి ఇద్దరు మాజీ కంటెస్టెంట్స్ కన్ఫర్మ్- ఇక నవ్వులు అన్‌లిమిటెడ్!
Bigg Boss Telugu 8 Contestants: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో గత సీజన్స్‌లోని మాజీ కంటెస్టెంట్స్‌ను పార్టిస్‌పేట్ చేసేందుకు తీసుకొస్తున్నారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరు మాజీ ఇంటి సభ్యులు కన్ఫర్మ్ అయ్యారు. వారి రాకతో బిగ్ బాస్ 8 తెలుగులో నవ్వులు అన్‌లిమిటెడ్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది.
Bigg Boss 8 Telugu Contestants: బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ ప్రారంభానికి ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్స్ ఎవరనేది క్యూరియాసిటీగా మారింది. ప్రతిరోజు ఆ కంటెస్టెంట్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.. ఈ మాజీ ఇంటి సభ్యుడు వస్తున్నాడంటూ మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది.
17 మంది కంటెస్టెంట్స్
ఇదివరకే బిగ్ బాస్ 8 తెలుగులోకి సుమారుగా 17 మంది కంటెస్టెంట్స్ కన్ఫర్మ్ అయినట్లు తెలిసిందే. వారిలో పది మంది పక్కాగా హౌజ్‌లోకి ప్రారంభం రోజునే వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే, ఈ సీజన్ 8లో పాత సీజన్స్‌లోని మాజీ కంటెస్టెంట్స్‌ను కూడా దింపనున్నారనే వార్తలు చాలా గట్టిగా వినిపించాయి. దానికి తగినట్లు మాజీ ఇంటి సభ్యులతో బిగ్ బాస్ టీమ్ చర్చలు కూడా జరిపింది.
అయితే, వారిలో చాలా మంది మళ్లీ బిగ్ బాస్‌లో పాల్గొనెందుకు విముఖత చూపించారు. కానీ, ఇద్దరు మాత్రం ఒప్పుకుని కన్ఫర్మ్ అయినట్లు తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లోకి రానున్న ఇద్దరు మాజీ కంటెస్టెంట్స్‌లో ఒకరు ఆర్జే చైతూ. ఇతను బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లో ఇంటి సభ్యుడిగా పాల్గొన్నాడు.
జబర్దస్త్ కమెడియన్ ఎంట్రీ
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ కేవలం ఓటీటీలోనే 24 గంటలు నిరంతరంగా ప్రసారం అయింది. ఈ సీజన్‌కు హీరోయిన్ బిందు మాధవి విన్నర్‌గా నిలవగా.. ఆర్జే చైతూ తన ఆట తీరుతో మంచి ప్రదర్శన ఇచ్చాడు. తన మాటలతో చాలా వరకు నవ్వించే ప్రయత్నం చేశాడు ఆర్జే చైతూ. ఇక బిగ్ బాస్ 8 తెలుగులోకి రానున్న మరో ఎక్స్ కంటెస్టెంట్ జబర్దస్త్ అవినాష్.
బిగ్ బాస్ తెలుగు 4 సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్ అవినాష్ తన కామెడీతో చాలా నవ్వించాడు. సీరియస్ టాస్కుల్లో కూడా తనదైన కామెడీ టైమింగ్‌తో అలరించాడు. అలాగే బోల్డ్ బ్యూటి అరియానా గ్లోరీతో వన్ సైడ్ లవ్ ట్రాక్ నడిపించి ఎంటర్టైన్ చేశాడు. తనతో మాత్రమే కాకుండా ఫన్నీగా కావాలనే కామెడీ కోసం ఇతర లేడి కంటెస్టెంట్స్ అందాన్ని పొగుడుతూ, పులిహోర కలుపుతూ ప్రేక్షకులకు మాత్రం వినోదాన్ని అందించాడు అవినాష్.
స్లోగన్‌కు జస్టిఫికేషన్
జబర్దస్త్ అవినాష్ బిగ్ బాస్ 8 తెలుగులోకి వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయని, దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లే అని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. అవినాష్, ఆర్జే చైతూ ఈ సీజన్‌లోకి ఎంట్రీ ఇస్తే అటు మిగతా కంటెస్టెంట్స్, ఇటు ప్రేక్షకులకు నవ్వుల వినోదమే అని తెలుస్తోంది. బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ స్లోగన్ "ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు" అనేదానికి ఈ ఇద్దరు జస్టిఫికేషన్ ఇవ్వనున్నారని టాక్.
ఇదిలా ఉంటే, తాజాగా బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ నుంచి కొత్త అప్డేట్ ఇచ్చారు. ఇంకా మూడు రోజుల్లో బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ గృహప్రవేశం. తప్పకుండా రండి అంటూ నాగార్జున చెప్పే వీడియోను రిలీజ్ చేశారు. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న, నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న ఈ బిగ్ బాస్ 8 తెలుగు ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.