తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Income Tax On Diwali Gifts : దీపావళికి గిఫ్ట్స్​ వచ్చాయా? అయితే ట్యాక్స్​ కట్టాల్సిందే..!

Income tax on Diwali gifts : దీపావళికి గిఫ్ట్స్​ వచ్చాయా? అయితే ట్యాక్స్​ కట్టాల్సిందే..!

Sharath Chitturi HT Telugu

18 October 2022, 11:59 IST

    • Income tax on Diwali gifts : దీపావళికి మీకు బోనస్​లు, గిఫ్ట్​లు వచ్చాయా? అయితే వాటిపై మీరు పన్నులు చెల్లించే అవకాశం ఉంది. కొన్నింటికి మాత్రం మినహాయింపు ఉంది. అవేంటంటే..
దీపావళికి గిఫ్ట్స్​ వచ్చాయా? ట్యాక్స్​ కట్టాల్సిందే
దీపావళికి గిఫ్ట్స్​ వచ్చాయా? ట్యాక్స్​ కట్టాల్సిందే (MINT_PRINT)

దీపావళికి గిఫ్ట్స్​ వచ్చాయా? ట్యాక్స్​ కట్టాల్సిందే

Income tax on Diwali gifts : దీపావళి నేపథ్యంలో ఉద్యోగులకు బోనస్​లు, వ్యాపారులకు గిఫ్ట్​లు అందుతూ ఉంటాయి. ఇక కుటుంబసభ్యులు, స్నేహితులు.. మిఠాయిలతో పాటు విలువైన వస్తువులను బహుమతులుగా ఇచ్చిపుచ్చుకుంటారు. అంతా బాగానే ఉంది కానీ.. చాలా మంది ఈ గిఫ్ట్​లపై ట్యాక్స్​ కట్టే విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. ఇంతకి ఏ గిఫ్ట్​లు ట్యాక్స్​ పరిధిలోకి వస్తాయి?

రూ. 50,000 మించితే..

దీపావళికి వచ్చే కొన్ని బహుమతులు, నగదు.. ఆర్థిక ఏడాదిలో కట్టాల్సిన ట్యాక్స్​ పరిధిలోకి వస్తాయి. అయితే.. ఇది ఆయా వస్తువుల వాల్యూపై ఆధారపడి ఉంటుంది.

Tax exemption on Diwali gifts : కొన్నింటికి మినహాయింపు ఉంటుంది. వాటిపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ వాటిని ఐటీఆర్​(ఆదాయపు పన్ను రిటర్నులు)లో డిస్​క్లోజ్​ చేయాల్సి ఉంటుంది.

సాధారణంగా.. ఒక ఆర్థిక ఏడాదిలో గిఫ్ట్​ల విలువ రూ. 50,000 దాటితే.. సెక్షన్​ 56(2) కింద పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ గిఫ్ట్​లు.. నగదు లేదా వస్తువుల రూపంలో ఉండొచ్చు.

అయితే.. కుటుంబసభ్యులు, బంధువులు ఇచ్చిపుచ్చుకునే బహుమతులపై ట్యాక్స్​ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇవి పన్ను మినహాయింపులోకి వస్తాయి. అంటే.. సోదరులు, సోదరీమణులు, తల్లిదండ్రులు, జీవిత భాగస్వాములు ఇచ్చే గిఫ్ట్​లపై ట్యాక్స్​ చెల్లించాల్సిన పని లేదు. అయితే.. ఈ జాబితాలో స్నేహితులు లేరు. అందువల్ల స్నేహితులు ఇచ్చే నగదు లేదా బహుమతులపై పన్నులు చెల్లించాల్సి ఉంటుంది(రూ. 50వేలు మించితే).

ఇక గిఫ్ట్​లు అనేవి భూమి, భవనం రూపంలో ఉంటే.. వాటిని ఇమ్మూవెబుల్​ ప్రాపర్టీగా పరిగణిస్తారు. వీటిపై స్టాంప్​ డ్యూటీ వాల్యూ రూ. 50,000 మించి ఉంటే.. కచ్చితంగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.

ఇక ఆభరణాలు, పెయింటింగ్స్​, డ్రాయింగ్స్​, షేర్లు, కలెక్షన్లు వంటి మూవెబుల్​ ప్రాపర్టీ విలువ.. రూ. 50,000 దాటితే ట్యాక్స్​ కట్టాల్సి ఉంటుంది. ఈ జాబితాలో వాహనాలు లేవు. అందువల్ల ఇందులో ట్యాక్స్​లు కట్టాల్సిన అవరసం లేదు.