తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Frozen Paratha Attracts 18% Tax: ప్యాక్డ్, ఫ్రోజెన్ పరాటాలపై 18% పన్ను

Frozen paratha attracts 18% tax: ప్యాక్డ్, ఫ్రోజెన్ పరాటాలపై 18% పన్ను

HT Telugu Desk HT Telugu

14 October 2022, 20:10 IST

    • Frozen paratha attracts 18% tax: నిలువ చేసిన, లేదా ఫ్రీజ్ చేసిన పరాటాలపై 18 శాతం పన్ను సబబేనని గుజరాత్ అపీలేట్ అథారిటీ స్పష్టం చేసింది. సాధారణ రోటీ లేదా చపాతీలకు ఫ్రోజెన్ పరాటాలకు తేడా ఉందని పేర్కొంది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Instagram/@daily_new_recipe)

ప్రతీకాత్మక చిత్రం

ప్యాక్డ్, ఫ్రోజెన్ పరాటాలకు 18% పన్ను విధించడంపై గుజరాత్ లోని అపీలేట్ అథారిటీకి వాడిలాల్ సంస్థ ఫిర్యాదు చేసింది. ఇతర ఆహార పదార్ధాల మాదిరిగానే ప్యాక్డ్, ఫ్రోజెన్ పరాటాలను కూడా 5% పన్ను పరిధిలోకి తీసుకువచ్చేలా ఆదేశాలివ్వాలని కోరింది.

Frozen paratha attracts 18% tax: అవి ఇవీ వేర్వేరు

అయితే, ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన గుజరాత్ అపీలేట్ అథారిటీ శుక్రవారం తీర్పు ప్రకటించింది. ప్యాక్డ్, ఫ్రోజెన్ పరాటాలను సాధారణ చపాతీ, రోటీలతో పోల్చలేమని స్పష్టం చేసింది. రెండింటిలోపు కామన్ గా గోధుమ పిండిని వాడినప్పటికీ.. పరాటాల్లో అదనంగా మరికొన్ని ఇన్ గ్రేడియంట్స్ ను వాడుతారని పేర్కొంది. మలబార్, మిక్స్డ్ వెజిటబుల్, ఆనియన్, మెంతి, ఆలూ.. తదితర పేర్లతో వేర్వేరు పదార్ధాలను కలిపి ప్యాక్డ్, ఫ్రోజెన్ పరాటాలను తయారు చేస్తారన్నారు.

Frozen paratha attracts 18% tax: డైరెక్ట్ గా తినలేం..

అదీకాకుండా, రోటీ, చపాతీలను నేరుగా తినడం సాధ్యమవుతుందని, ప్యాక్డ్, ఫ్రోజెన్ పరాటాలను మళ్లీ వండాల్సి(వేడి చేయాల్సి) ఉంటుందని, అందువల్ల రోటీ, చపాతీలతో ప్యాక్డ్, ఫ్రోజెన్ పరాటాలను పోల్చలేమని స్పష్టం చేసింది. అందువల్ల ప్యాక్డ్, ఫ్రోజెన్ పరాటాలకు 18% పన్ను సబబేనని పేర్కొంది.

తదుపరి వ్యాసం