ITR refund status : ఆన్లైన్లో ఐటీఆర్ రీఫండ్ స్టేటస్ చెక్ చేసుకోండి ఇలా..
ITR refund status : ఐటీ రిటర్నుల రీఫండ్ స్టేటస్‌ను ఆన్లైన్లో చెక్ చేసుకోవడం చాలా సులభం. ఆ వివరాలు మీకోసం..
ఆన్లైన్లో ఐటీ రిటర్నుల స్టేటస్ చెక్ చేసుకోండి ఇలా.. (MINT)
ITR refund status : 2022-23 ఆర్థిక ఏడాది ఐటీ రిటర్నుల ఫైలింగ్ గడువు ముగిసింది. ఇక పన్నుచెల్లింపుదారులు ఇప్పుడు ఐటీఆర్ రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చింది? అనే విషయాన్ని ఆన్లైన్లో సులభంగా తెలుసుకోవచ్చు.
ఆన్లైన్లో ఐటీ రిటర్నుల స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా?
ఐటీ రిటర్నులు ఫైల్ చేసిన 10 రోజులకు రీఫండ్ స్టేటస్‌ను చూసుకునే వెసులుబాటు కల్పిస్తోంది ఆదాయపు పన్నుశాఖ.
- ముందుగా.. https://eportal.incometax.gov.in/iec/foservices/#/login లో లాగిన్ అవ్వాలి.
- యూజర్ ఐడీ- పాస్వర్డ్ టైప్ చేయాలి.
- 'మై అకౌంట్'కు వెళ్లి.. రీఫండ్/ డిమాండ్ స్టేటస్ క్లిక్ చేయాలి.
- డ్రాప్ డౌన్ మెనూలోకి వెళ్లి.. 'Income Tax Returns' సెలక్ట్ చేసుకుని 'సబ్మిట్' బటన్ ప్రెస్ చేయాలి.
- మీ అక్నాలెడ్జ్ నెంబర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.
- కొత్త వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీ ఐటీఆర్ వివరాలన్నీ అందులో కనిపిస్తాయి. అక్కడే రీఫండ్ డేట్ కూడా ఉంటుంది.
పాన్ నెంబర్‌తో ఐటీఆర్ రీఫండ్ చెక్ చేసుకోవడం ఎలా?
- https://tin.tin.nsdl.com/oltas/servlet/RefundStatusTrack లోకి వెళ్లాలి.
- పాన్ కార్డు నెంబర్ టైప్ చేయాలి
- అసెస్మెంట్ ఇయర్ 2022-23గా సెలక్ట్ చేసుకోవాలి.
- సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి.
- మీ రీఫండ్ స్టేటస్ కనిపిస్తుంది.
సంబంధిత కథనం