IT returns : మధ్యాహ్నం 1 గంట వరకు 19.5లక్షల ఐటీ రిటర్నులు దాఖలు-195lakh it returns filed till 1pm today 31st july 2022 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  19.5lakh It Returns Filed Till 1pm Today 31st July 2022

IT returns : మధ్యాహ్నం 1 గంట వరకు 19.5లక్షల ఐటీ రిటర్నులు దాఖలు

Sharath Chitturi HT Telugu
Jul 31, 2022 03:28 PM IST

IT returns : ఐటీ రిటర్నుల దాఖలుకు నేడే చివరి రోజు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం 1 గంట వరకు 19.5లక్షలకుపైగా ఐటీ రిటర్నులు దాఖలయ్యాయి.

మధ్యాహ్నం 1 గంట వరకు 19.5లక్షల ఐటీ రిటర్నులు దాఖలు
మధ్యాహ్నం 1 గంట వరకు 19.5లక్షల ఐటీ రిటర్నులు దాఖలు (iStock)

IT returns : ఐటీ రిటర్నుల దాఖలుకు నేడే చివరి రోజు కావడంతో జోరుగా ఫైలింగ్స్​ జరుగుతున్నాయి! మధ్యాహ్నం 1గంట వరకు 19,53,581 ఐటీ రిటర్నులు దాఖలయ్యాయి.

మధ్యాహ్నం 12-1గంట మధ్యలో.. అంటే ఒక్క గంట వ్యవధిలో ఏకంగా 4,67,902 ఐటీ రిటర్నులు దాఖలయ్యాయి. ఈ విషయాన్ని ఆదాయపు పన్నుశాఖ ట్వీట్​ చేసింది.

ఐటీఆర్​ దాఖలలో సహాయం కోసం 1800 103 0025 లేదా 1800 419 0025 కు కాల్​ చేయవచ్చని ట్వీట్​లో పేర్కొంది.

ఇక శనివారం వరకు 5.10కోట్లకుపైగా ఐటీ రిటర్నులు దాఖలయ్యాయి. జులై 30న ఒక్కరోజే.. 57.51లక్షల ఐటీ రిటర్నులు నమోదుకావడం విశేషం.

ఐటీ రిటర్నుల దాఖల గడువును పెంచాలని అనేకమంది విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ గడువు పెంచే ప్రసక్తే లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ గడువు దాటితే.. జరిమానా కట్టి ఐటీ రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.

2020-21 ఆర్థిక ఏడాది.. 5.89కోట్ల ఐటీ రిటర్నులు దాఖలయ్యాయి. అప్పుడు.. గడువును 2021 డిసెంబర్​ 31వరకు పెంచింది ప్రభుత్వం. ఈసారి.. ఐటీ రిటర్నుల సంఖ్య ఇప్పటికే మెరుగ్గా ఉండటంతో.. చివరి నిమిషంలో గడువును ప్రభుత్వం పెంచకపోవచ్చని తెలుస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్