తెలుగు న్యూస్  /  Business  /  Yet Another Entry Level Smartphone Oppo A17k Launched, Check Price Details

Oppo A17k Price । ఒప్పో నుంచి మరో ఎంట్రీలెవెల్ స్మార్ట్‌ఫోన్, ధర ఇలా ఉంది!

HT Telugu Desk HT Telugu

19 October 2022, 14:46 IST

    • ఒప్పో కంపెనీ నుంచి రూ. 10 వేల బడ్జెట్ ధరలో Oppo A17k స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ఫీచర్లు ఎలా ఉన్నాయో చూడండి.
Oppo A17k
Oppo A17k

Oppo A17k

Oppo A17k స్మార్ట్‌ఫోన్ విడుదలతో Oppo బ్రాండ్ భారతదేశంలో తన A-సిరీస్ ఫోన్‌ల సంఖ్యను మరింత పెంచింది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలోనే సరసమైన ధరలో Oppo A17 అనే స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేంది. ఇప్పుడు కొత్తగా విడుదలైన Oppo A17k కూడా దాని పాత వెర్షన్‌కు మరొక ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఇది కూడా ఇంచుమించు అదే బడ్జెట్ స్థాయి ధరలో లభ్యమవుతోంది.

ఇది ఎంట్రీలెవెల్ ఫోన్ కాబట్టి ఫీచర్లుగా మామూలుగా ఉంటాయి. Oppo A17k ఒక MediaTek ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది, ఫోటోగ్రఫీ కోసం వెనుకవైపు ఒకే కెమెరాను కలిగి ఉంటుంది. Tecno , Redmi, అలాగే ఇన్ఫినిక్స్ వంటి బ్రాండ్లు తమ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లకు కనీసం డ్యుఎల్ కెమెరా అందిస్తుండగా ఒప్పో మాత్రం అందుకు భిన్నంగా ఏకైక కెమెరాను ఇవ్వడం గమనార్హం.

Oppo A17k ఏకైక 3GB + 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తుంది. మునుపటి మోడల్ కంటే ర్యామ్ తక్కువగా ఉంది. అయితే మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజ్ సామర్థ్యాన్ని 1TB వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ గోల్డ్, నేవీ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఫీచర్ల జాబితాలో ఇంకా ఏయే అంశాలు ఉన్నాయి, ధర ఎంత, తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Oppo A17k స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన6.56-అంగుళాల IPS LCD HD+ డిస్‌ప్లే
  • 3 GB RAM, 64 GB స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్
  • వెనకవైపు 8 మెగా పిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 5 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12.1 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ

కనెక్టివిటీ కోసం, డ్యూయల్-సిమ్ స్లాట్, Wi-Fi 5, బ్లూటూత్ v5.3 , aptX, aptX HD , LDAC వంటి హై-ఎండ్ కోడెక్‌ల సపోర్ట్ ఉన్నాయి. ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాటర్ రెసిస్టెన్స్ కూడా కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 10,499/- Oppo అధికారిక వెబ్‌సైట్, ప్రధాన ఇ-కామర్స్ రిటైలర్ల ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.