తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Honor Play 6c | బడ్జెట్ ధరలోనే 5g స్మార్ట్‌ఫోన్‌, ఫీచర్లు ఏమున్నాయి?

Honor Play 6C | బడ్జెట్ ధరలోనే 5G స్మార్ట్‌ఫోన్‌, ఫీచర్లు ఏమున్నాయి?

HT Telugu Desk HT Telugu

11 October 2022, 23:46 IST

    • హానర్ బ్రాండ్ నుంచి బడ్జెట్ ధరలో Honor Play 6C 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు చూడండి.
Honor Play 6C 5G
Honor Play 6C 5G

Honor Play 6C 5G

చైనీస్ స్మార్ట్‌ఫోన్‌ మేకర్ హానర్ నిశబ్దంగా తమ బ్రాండ్ నుంచి Honor Play 6C అనే సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 480 5G ప్రాసెసర్ ఉపయోగించారు. దీనిని చౌకైన 5G ప్రాసెసర్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రకారంగా Honor Play 6C అనేది ఒక బడ్జెట్ ధరలో లభించే 5G స్మార్ట్‌ఫోన్‌ అవుతుంది. అందువల్ల ఇందులో ఫీచర్లు కూడా మామూలుగా ఉంటాయి.

ఈ హ్యాండ్‌సెట్లోని ప్రధాన అంశాలను పరిశీలిస్తే ఇందులో వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 4-సిరీస్ చిప్, సింగిల్ రియర్ ఫేసింగ్ కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన పెద్ద బ్యాటరీ ఉన్నాయి. హానర్ తమ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ Honor X40 GTని విడుదల చేస్తుందనుకున్న తరుణంలో ఈ Play 6C ఫోన్‌ను విడుదల చేసింది.

Honor Play 6C రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉండగా, మూడు విభిన్న రంగుల్లో లభ్యమవుతోంది. ఇది మ్యాజిక్ నైట్ బ్లాక్, అరోరా బ్లూ , టైటానియం సిల్వర్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఇంకా Honor Play 6Cలో స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు అలాగే దీని ధరకు సంబంధించిన మొత్తం సమాచారం ఈ కింద చూడండి.

Honor Play 6C 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 90Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.5 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే
  • 6GB/ 8GB RAM, 128 GB స్టోరేజ్ సామర్థ్యం
  • స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్
  • వెనకవైపు 13MP కెమెరా
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 22.5W ఫాస్ట్ ఛార్జర్

కనెక్టివిటీ కోసం.. 5G, Wi-Fi 802.11ac, బ్లూటూత్ 5.1, GPS, USB-C పోర్ట్ , 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.

ప్రస్తుతం ఈ ఫోన్ చైనా మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే మిగతా మార్కెట్లలోకి రానుంది. ధర సుమారు రూ. 12 వేల నుంచి రూ. 15 వేల వరకు ఉంది.

తదుపరి వ్యాసం