5G Activation in Smartphone | మీ స్మార్ట్‌ఫోన్‌లో 5G కోసం సెట్టింగ్స్ ఇలా మార్చండి!-how to enable 5g in my smartphone here are the steps device wise in telugu ,బిజినెస్ న్యూస్
Telugu News  /  Business  /  How To Enable 5g In My Smartphone, Here Are The Steps Device Wise In Telugu

5G Activation in Smartphone | మీ స్మార్ట్‌ఫోన్‌లో 5G కోసం సెట్టింగ్స్ ఇలా మార్చండి!

How to Enable 5G in My Smartphone
How to Enable 5G in My Smartphone (Unsplash)

How to Enable 5G in My Smartphone: మీ స్మార్ట్‌ఫోన్‌లో 5G కనెక్టివిటీ పొందాలనుకుంటున్నారా? అయితే సెట్టింగ్స్ మార్చుకోండి. ఎలా మార్చుకోవచ్చో ఇక్కడ దశల వారీగా వివరించాం చూడండి.

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారతదేశంలో ఇప్పుడు 5G సేవలు అందుబాటులోకి వచ్చాయి. IMC 2022లో 5G ప్రారంభోత్సవం జరిగిన వెంటనే Airtel ఎనిమిది మెట్రో నగరాల్లో 5G సేవలను ప్రకటించింది. అనంతరం రిలయన్స్ జియో కూడా తమ 5G సర్వీస్ బీటా టెస్టింగ్‌ను నాలుగు నగరాల్లోని ఎంపిక చేసిన కస్టమర్ల కోసం ప్రారంభించింది.

ట్రెండింగ్ వార్తలు

అయితే ఈ 5G సేవను అందించే నెట్‌వర్క్ సర్వీస్ ప్రొవైడర్‌తో సంబంధం లేకుండా మీ స్మార్ట్‌ఫోన్‌లో 5Gని కనెక్టివిటీని పొందాలంటే కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ స్మార్ట్‌ఫోన్ 5Gని సపోర్ట్ చేసేది అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు 5G స్పీడ్ పొందగలుగుతారు.

ఈ 5G సేవలను ఉపయోగించడానికి ప్రత్యేకమైన SIM కార్డ్‌ని కొనుగోలు చేయడం అవసరం లేదని Jio అలాగే Airtel ఇదివరకే ప్రకటించాయి. కాకపోతే ఇప్పుడున్న 4జీ సిమ్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.

How to Enable 5G in My Smartphone- సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి?

మీ స్మార్ట్‌ఫోన్‌ను 5Gతో కనెక్ట్ చేయటానికి అనుసరించాల్సిన దశలను ఇక్కడ అందిస్తున్నాం. ఒక్కో బ్రాండ్ డివైజ్‌లో ఒక్కోరకంగా సెట్టింగ్స్ మార్చుకోవాల్సి ఉంటుందని గమనించండి.

బ్రాండ్ వారీగా మీ స్మార్ట్‌ఫోన్‌లో 5Gని ఎనేబుల్ చేయడానికి ఈ కింద సూచించిన దశలను అనుసరించండి.

సెట్టింగ్‌లు> నెట్‌వర్క్ & ఇంటర్నెట్> SIMలు> ప్రాధాన్య నెట్‌వర్క్ రకం> 5Gని ఎంచుకోండి.

సెట్టింగ్‌లు> కనెక్షన్‌లు> మొబైల్ నెట్‌వర్క్‌లు> నెట్‌వర్క్ మోడ్ తెరవండి> 5G/LTE/3G/2G ఎంచుకోండి (ఆటోకనెక్ట్)

సెట్టింగ్‌లు తెరవండి> Wi-Fi & నెట్‌వర్క్‌లు> SIM & నెట్‌వర్క్> ప్రాధాన్య నెట్‌వర్క్ రకం> 2G/3G/4G/5G (ఆటోమేటిక్) ఎంచుకోండి

సెట్టింగ్‌లు తెరవండి> కనెక్షన్ & షేరింగ్> SIM 1 లేదా SIM 2పై నొక్కండి> ప్రాధాన్య నెట్‌వర్క్ రకం> 2G/3G/4G/5G ఎంచుకోండి (ఆటోమేటిక్)

సెట్టింగ్‌లు తెరవండి> కనెక్షన్ & షేరింగ్> SIM 1 లేదా SIM 2పై నొక్కండి> ప్రాధాన్య నెట్‌వర్క్ రకం> 2G/3G/4G/5G ఎంచుకోండి (ఆటోమేటిక్)

సెట్టింగ్‌లను తెరవండి> SIM 1పై నొక్కండి లేదా SIM 2> మొబైల్ నెట్‌వర్క్> నెట్‌వర్క్ మోడ్> 5G మోడ్‌ను ఎంచుకోండి

సెట్టింగ్‌లు తెరవండి> SIM కార్డ్ & మొబైల్ నెట్‌వర్క్‌లు> ప్రాధాన్య నెట్‌వర్క్ రకం> 5Gని ఎంచుకోండి.

పైన పేర్కొన్నట్లుగా సెట్టింగ్‌లు మార్చుకుంటే మీ స్మార్ట్‌ఫోన్ 5G కనెక్ట్ అవుతుంది. అయితే యూజర్లు ఉన్న ప్రాంతం, వాడుతున్న హ్యాండ్‌సెట్, నెట్‌వర్క్ ఆధారంగా 5G వేగం మారవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం