OPPO K10 5G మిడ్-బడ్జెట్ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు ఇలా ఉన్నాయి!-know oppo k10 5g price features and discounts here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /   Know Oppo K10 5g Price, Features And Discounts Here

OPPO K10 5G మిడ్-బడ్జెట్ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు ఇలా ఉన్నాయి!

HT Telugu Desk HT Telugu
Jun 08, 2022 03:45 PM IST

చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మిడ్-బడ్జెట్ రేంజ్‌లో OPPO K10 5G అనే స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర, ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

OPPO K10 5G
OPPO K10 5G

ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల తయారీసంస్థ ఒప్పో తాజాగా OPPO K10 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ ఒప్పో సంస్థ గతంలో విడుదల చేసిన OPPO K10 మోడల్‌కు 5G వెర్షన్.

OPPO K10 5G స్మార్ట్‌ఫోన్‌ మిడ్‌నైట్ బ్లాక్, ఓషన్ బ్లూ అనే రెండు కలర్ ఛాయిస్ లలో లభ్యమవుతుంది. అయితే ఈ ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది.

ఈ ఫోన్‌లో 33W శక్తి గల సూపర్ VOOC ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కలిగి ఉంది. ఎంతో వేగంగా దీని బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. 

ఇంకా ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి, ధర ఎంత? తదితర వివరాలను కింద పేర్కొన్నాం గమనించండి.

OPPO K10 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

90Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.5 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే

8GB RAM,  128GB స్టోరేజ్ సామర్థ్యం

మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్

వెనకవైపు 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్

ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్

5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 33W ఛార్జర్‌

ధర, రూ. 17,499/-

ఈ OPPO K10 5G జూన్ 15 నుండి Flipkart, OPPO ఆన్‌లైన్ స్టోర్‌లో అందుబాటులో ఉంటుంది. Flipkartలో మూడు నెలల వరకు ఎటువంటి అదనపు ధర లేకుండా సమానమైన నెలవారీ వాయిదాలలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. SBI కార్డ్‌లతో కొనుగోలు చేసే వారికి రూ. 1500 ఫ్లాట్ డిస్కౌంట్ కూడా లభించనుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్