50 మెగాపిక్సెల్ కెమెరాతో Oppo K10 స్మార్ట్‌ఫోన్ విడుదల-oppo k10 smartphone launched in india ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Oppo K10 Smartphone Launched In India

50 మెగాపిక్సెల్ కెమెరాతో Oppo K10 స్మార్ట్‌ఫోన్ విడుదల

HT Telugu Desk HT Telugu
Mar 23, 2022 02:42 PM IST

Oppo K10 స్మార్ట్‌ఫోన్ అలాగే Oppo Enco Air 2 TWS ఇయర్‌బడ్‌లను ఒప్పో కంపెనీ భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. ఫోన్ ధర రూ. 14,990 నుంచి ప్రారంభమవుతుంది.

Oppo K10 Smartphone
Oppo K10 Smartphone (Oppo India)

మొబైల్ తయారీదారు ఒప్పో చెప్పినట్లుగానే K సిరీస్ స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈరోజు అనగా మార్చి 23న Oppo K10 స్మార్ట్‌ఫోన్ అలాగే Oppo Enco Air 2 TWS ఇయర్‌బడ్‌లను ఒప్పో కంపెనీ భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది.

Oppo K10 అనేది Realme 9 అలాగే Redmi Note 11 వంటి స్మార్ట్‌ఫోన్లకు సరితూగే ఒక ఎంట్రీ-లెవల్ మిడ్-బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5G ఫీచర్ లేదు. స్వచ్ఛమైన పిక్చర్ క్వాలిటీ కోసం Oppo K10 స్మార్ట్‌ఫోన్‌లో మృదువైన డిస్‌ప్లేతో పాటు మెరుగైన కెమెరాను కంపెనీ ఆఫర్ చేస్తోంది. వెనుకవైపు 50 మెగాపిక్సెల్ కెపాసిటీ కలిగిన ట్రిపుల్ కెమెరాను ఇందులో అమర్చారు.

Oppo K10 బ్లాక్ కార్బన్, బ్లూ ఫ్లేమ్ అనే రెండు రంగులలో వస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 14,990 నుంచి ప్రారంభమవుతుంది. Oppo Enco Air 2 ఇయర్‌బడ్స్ ధర రూ. 2,499/- గా ఉంది. ఇక ఈ ఫోన్ మిగతా ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.

OPPO K10 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 90HzHz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.59 అంగుళాల ఫుల్-HD+ డిస్‌ప్లే
  • 6GB/8GB RAM + 128GB స్టోరేజ్ సామర్థ్యం
  • క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ చి
  • వెనకవైపు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ సెన్సార్లు,
  • ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ AI ఫ్రంట్ కెమెరా
  • ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 33W ఛార్జర్‌
  • ధర రూ. 14,990 నుండి ప్రారంభం

ర్యామ్ ఆధారంగా OPPO K10 స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 6GB RAM వేరియంట్ ధర రూ. 14,990 కాగా, 8GB RAM వేరియంట్ ధర రూ. 16,990/- గా నిర్ణయించారు. మార్చి 29 నుండి అన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోరల్లో ఓపెన్ సేల్స్ ప్రారంభమవుతాయి.

WhatsApp channel

సంబంధిత కథనం