Poco M4 5G । అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలైన పోకో స్మార్ట్‌ఫోన్‌, ఫీచర్స్ మారాయి-poco m4 5g smartphone launched in global market check details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Poco M4 5g Smartphone Launched In Global Market, Check Details

Poco M4 5G । అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలైన పోకో స్మార్ట్‌ఫోన్‌, ఫీచర్స్ మారాయి

HT Telugu Desk HT Telugu
Aug 16, 2022 02:42 PM IST

పోకో నుంచి Poco M4 5G స్మార్ట్‌ఫోన్‌ అంతర్జాతీయ మార్కెట్లో విడుదల అయింది. ఇది బడ్జెట్ ధరలోనే లభించే ఫోన్. దీని ధర, ఫీచర్లు, ఇతర వివరాలు తెలుసుకోండి.

Poco M4 5G
Poco M4 5G

స్మార్ట్‌ఫోన్‌ తయారీదారు పోకో తమ బ్రాండ్ నుంచి Poco M4 పేరుతో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ ఇప్పుడు Poco అధికారిక వెబ్‌సైట్‌లో జాబితాలోకి వచ్చింది. దాదాపు నాలుగు నెలల కిందటే Poco M4ను కంపెనీ ఇండియాలో ప్రారంభించింది. అయితే తాజాగా విడుదల చేసిన గ్లోబల్ వేరియంట్‌లో స్వల్ప మార్పులు ఉన్నాయి. ఇది బడ్జెట్ కేటగిరీ స్మార్ట్‌ఫోన్‌గా అందిస్తోంది. అందుకు తగినట్లుగా డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను డౌన్‌గ్రేడ్ చేసింది. అయితే మిగతా ఫీచర్లలో పెద్దగా మార్పులేమి లేవు. మంచి రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్‌ప్లే, MediaTek డైమెన్సిటీ SoC అలాగే పెద్ద బ్యాటరీ వంటి ఫీచర్లను అందిస్తుంది.

Poco M4 5G స్మార్ట్‌ఫోన్‌ రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో అందిస్తున్నారు. మైక్రో SD కార్డ్ స్లాట్‌ ద్వారా ఫోన్ స్టోరేజీని 1TB వరకు విస్తరించుకోవచ్చు. డిజైన్ విషయానికి వస్తే ఈ స్మార్ట్‌ఫోన్ పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది, సుమారు 200 గ్రాముల బరువు ఉంటుంది. పోకో సిగ్నేచర్ ఎల్లో, కూల్ బ్లూ, పవర్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

ఇంకా ఇందులో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి, ధర ఎంత? తదితర వివరాలను ఇక్కడ పరిశీలించండి..

Poco M4 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 90Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.58 అంగుళాల ఫుల్ HD+ LCD డిస్‌ప్లే
  • 4GB/6GB RAM, 64GB/128GB స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్
  • వెనకవైపు 13 MP + 2MP డ్యుఎల్ కెమెరా సెటప్; ముందు భాగంలో 5 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 22.5W ఫాస్ట్ ఛార్జర్

కనెక్టివిటీ పరంగా 3.5mm హెడ్‌ఫోన్ జాక్, స్పీకర్ సెటప్ , బ్లూటూత్ v5.1, Wi-Fi 2.4Ghz & 5Ghz, GPS, GLONASS, గెలీలియో, బీడౌ సపోర్ట్ ఉన్నాయి.

బేస్ వేరియంట్ కోసం ధర రూ. 12,999కి లభిస్తుండగా, 128GB వేరియంట్ ధర రూ. 14,999/- గా ఉంది. యూరోపియన్ మార్కెట్లలో ఈ ధరలు రూ. 20 వేల వరకు ఉన్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్