OnePlus 10T 5G। వన్‌ప్లస్ పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది, ధర కూడా పవర్‌ఫుల్-oneplus 10t 5g smartphone launched in india at rs 49999 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Oneplus 10t 5g। వన్‌ప్లస్ పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది, ధర కూడా పవర్‌ఫుల్

OnePlus 10T 5G। వన్‌ప్లస్ పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది, ధర కూడా పవర్‌ఫుల్

HT Telugu Desk HT Telugu
Aug 03, 2022 09:50 PM IST

OnePlus 10T 5G ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్లో విడుదలైంది. దీని ధర రూ. 49,999 నుంచి ప్రారంభం అవుతుంది.

OnePlus 10T 5G
OnePlus 10T 5G

ప్రముఖ మొబైల్ తయారీదారు వన్‌ప్లస్.. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న OnePlus 10T 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత్ సహా గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. OnePlus 8T తర్వాత OnePlus నుంచి వచ్చిన మొదటి T-సిరీస్ ఫోన్ ఇదే. ఇది ఈ బ్రాండ్ నుంచి వచ్చిన రెండవ గ్లోబల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్. ఇప్పటివరకు వచ్చిన వన్‌ప్లస్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లలో OnePlus 10Tనే అత్యంత శక్తివంతమైన ఫోన్‌గా భావిస్తున్నారు. ఈ సరికొత్త ఫోన్‌లో ఉపయోగించిన చిప్‌సెట్, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ప్రధాన హైలైట్లుగా ఉన్నాయి.

OnePlus 10T 5G స్మార్ట్‌ఫోన్‌ లేటెస్ట్ Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ Gen 1 ప్రాసెసర్, భారీ 150W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో మెరుగైన పనితీరును అందించే పరికరంగా నిలవనుంది. ఈ 150W ఫాస్ట్ ఛార్జర్ ఫోన్‌ను 19 నిమిషాల్లో 1-100% ఛార్జ్ చేస్తుంది. భారత మార్కెట్లో OnePlus 10T ధర రూ. 49,999 నుంచి ప్రారంభం అవుతుంది.

ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ ఆధారంగా ఈ ఫోన్ మూడు కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. అలాగే మూన్‌స్టోన్ బ్లాక్, జేడ్ గ్రీన్ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్‌లు ప్రారంభమయ్యాయి. OnePlus.in, OnePlus స్టోర్ యాప్, Amazon, OnePlus ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లు, పార్టనర్ అవుట్‌లెట్లలో ఆగస్టు 6 నుంచి OnePlus 10T 5G విక్రయాలు ప్రారంభమవుతాయి.

మరి ఈ OnePlus 10T 5Gలో ఇంకా ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి? వేరియంట్ల ఆధారంగా ధరలు ఎంత? తదితర విషయాలను ఈ కింద చూడండి.

OnePlus 10T 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 120Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే
  • 8GB/12GB/16GB RAM, 128/256GB స్టోరేజ్ సామర్థ్యం
  • Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ Gen 1 ప్రాసెసర్
  • వెనకవైపు 50MP (Sony IMX766)+8MP+2MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌, ముందు భాగంలో 32 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ ఆక్సిజన్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్ (ఈ ఏడాది చివర్లో ఆక్సిజన్‌ 13 ఓఎస్ అప్డేట్ పొందుతుంది)
  • 4800mAh డ్యూయల్-సెల్ బ్యాటరీ, 150W ఛార్జింగ్

ధరలు.. బేస్ వేరియంట్ 8GB + 128GB ధర రూ. 49,999/- గా ఉండగా

మిడ్ వేరియంట్ 12GB + 256GB ధరను రూ. 54,999/- గా ఉంది.

ఇక టాప్ వేరియంట్ 16GB + 256GB ధరను రూ. 59,999/- గా నిర్ణయించారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్