Honor Pad 8 । ఫ్లిప్‌కార్ట్‌లో హానర్ కొత్త టాబ్లెట్ సేల్.. ధర ఎంతంటే?
హానర్ కంపెనీ నుంచి Honor Pad 8 అనే టాబ్లెట్ విడుదలైంది. ఇందులో 2K డిస్‌ప్లే, DTS సౌండ్ వంటి మెరుగైన ఫీచర్లు ఉన్నాయి. మిగతా ప్రత్యేకతలను చూడండి.
చైనీస్ టెక్నాలజీ కంపెనీ HONOR చాలా ఏళ్ల తర్వాత మళ్లీ భారత మార్కెట్లో టాబ్లెట్ ఫోన్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ క్రమంలో తాజాగా Honor Pad 8 పేరుతో ఒక సరికొత్త టాబ్లెట్ ఫోన్‌ను విడుదల చేసింది. మిడ్- రేంజ్ బడ్జెట్‌లో లభించే ఈ టాబ్లెట్‌లో 2K రెసల్యూషన్ కలిగిన పెద్దని స్క్రీన్, మెరుగైన బ్యాటరీ, బ్రాండ్ తమ స్వంతంగా అభివృద్ధి చేసిన హిస్టెన్ ఆడియో అల్గోరిథం వంటివి ముఖ్యాంశాలుగా ఉన్నాయి.
దృఢమైన మెటాలిక్ బాడీ డిజైన్‌తో వచ్చిన Honor Pad 8 టాబ్లెట్, ర్యామ్ ఆధారంగా రెండు కాన్ఫిగరేషన్లలలో అందుబాటులో ఉంటుంది. అయితే ఏకైక బ్లూ కలర్ ఆప్షన్‌లో లభ్యమవుతుంది. సాఫ్ట్‌వేర్ అంశాలను పరిశీలిస్తే ఈ టాబ్లెట్ స్మార్ట్ మల్టీ-విండో, మల్టీ-స్క్రీన్ సపోర్ట్ చేసే ఫీచర్‌లను కలిగి ఉంది.
ఇంకా Honor Pad 8 టాబ్లెట్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి, ధర ఎంతవరకు ఉంది తదితర వివరాలను ఇక్కడ పరిశీలించండి.
Honor Pad 8 టాబ్లెట్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 2K రిజల్యూషన్ కలిగిన 12-అంగుళాల IPS LCD డిస్‌ప్లే
- DTS:X అల్ట్రాసౌండ్ టెక్నాలజీతో 8 స్పీకర్ సిస్టమ్
- 4GB/6GBGB RAM, 128 GB స్టోరేజ్ సామర్థ్యం
- క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్
- వెనకవైపు 5MP కెమెరా, ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా
- ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
- 7250 mAh బ్యాటరీ సామర్థ్యం, 22.5W ఛార్జింగ్
కనెక్టివిటీ పరంగా ఈ టాబ్లెట్ PCలో 4G, Wi-Fi 5, బ్లూటూత్ 5.1, GPS , టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
ధరలు ఈ విధంగా ఉన్నాయి.. 4GB + 128GB మోడల్‌కు రూ. 19,999/-
6GB + 128GB మోడల్‌కు రూ. 21,999/-
Honor Pad 8 టాబ్లెట్ సెప్టెంబర్ 23, శుక్రవారం నుండి ఫ్లిప్‌కార్ట్ లోఅందుబాటులో ఉంటుంది.
సంబంధిత కథనం