Honor X40i | ఆకర్షణీయమైన డిజైన్‌తో హానర్ నుంచి సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్‌!-honor x40i 5g smartphone launched with attractive features ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Honor X40i 5g Smartphone Launched With Attractive Features

Honor X40i | ఆకర్షణీయమైన డిజైన్‌తో హానర్ నుంచి సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్‌!

HT Telugu Desk HT Telugu
Jul 13, 2022 06:02 PM IST

హానర్ నుంచి Honor X40i అనే ఒక మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది. ఆకర్షణీయమైన డిజైన్‌ కలిగిన ఈ ఫోన్లో ఫీచర్లు కూడా బాగున్నాయి. పూర్తి సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి..

Honor X40i
Honor X40i

చైనీస్ స్మార్ట్‌ఫోన్‌ మేకర్ హానర్ తాజా మిడ్‌రేంజ్ ఫీచర్లతో Honor X40i అనే ఒక సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది గతంలో వచ్చిన X30i ఫోన్‌కు సక్సెసర్. సరికొత్త Honor X40i సొగసైన డిజైన్‌ను కలిగి ఉంది. చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ముఖ్యంగా దీని బ్యాక్ ప్యానెల్ మిరుమిట్లు గొలుపేలా కలర్ షేడ్స్ కలిగి ఉంది. ఇది రోజ్ పింక్, సిల్వర్, గ్రీన్, బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది. ఈ హ్యాండ్ సెట్ బరువు కేవలం 175 గ్రాములు మాత్రమే.

Honor X40i స్మార్ట్‌ఫోన్‌లో ప్రధానంగా స్పెసిఫికేషన్స్ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది మెరుగైన ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్లను కలిగి ఉంది. స్టోరేజ్, ర్యామ్ ఆధారంగా ఈ ఫోన్ మూడు కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. బేస్ వేరియంట్ కూడా 8GB ర్యామ్ ఇంకా 128GB స్టోరేజ్ సామర్థ్యంతో వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. అలాగే డ్యూయల్ రియర్-కెమెరా సెటప్, మీడియాటెక్ చిప్‌సెట్, భారీ బ్యాటరీ ఉన్నాయి.

Honor X40iలో స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు అలాగే దీని ధరకు సంబంధించిన మొత్తం సమాచారం ఈ కింద చూడండి.

Honor X40i స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 60Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.7 అంగుళాల ఫుల్ HD+ LCD డిస్‌ప్లే
  • 8 GB/12 GB RAM, 128 GB/256 GB స్టోరేజ్ సామర్థ్యం
  • Mediatek డైమెన్సిటీ 700 ప్రాసెసర్
  • వెనకవైపు 50 MP + 2MP డ్యుఎల్ కెమెరా సెటప్; ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 4000 mAh బ్యాటరీ సామర్థ్యం, 40W ఫాస్ట్ ఛార్జర్

కనెక్టివిటీ పరంగా డ్యూయల్-సిమ్ కార్డ్ స్లాట్, 5G, 4G LTE, డ్యూయల్-బ్యాండ్ WiFi,బ్లూటూత్ v5.1, GPS, USB టైప్-సి పోర్ట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, లైట్ సెన్సార్, గ్రావిటీ సెన్సార్ ఉన్నాయి.

ప్రస్తుతం చైనా మార్కెట్లో ఈ ఫోన్ విక్రయాలు జూలై 22 నుంచి ప్రారంభమవుతాయి. ధరలు సుమారు రూ. 19,000 నుంచి రూ.23,000 వరకు ఉన్నాయి. త్వరలో మిగతా మార్కెట్లలోనూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్