Tesla Pi Phone । టెస్లా నుంచి మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు ఒక రేంజ్‌లో ఉంటాయి మరి!-tesla soon to launch pi phone under its own brand says reports check price features more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Tesla Soon To Launch Pi Phone Under Its Own Brand Says Reports, Check Price Features More

Tesla Pi Phone । టెస్లా నుంచి మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు ఒక రేంజ్‌లో ఉంటాయి మరి!

HT Telugu Desk HT Telugu
Oct 13, 2022 09:26 PM IST

Elon Musk కు చెందిన టెస్లా కంపెనీ నుంచి మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ Tesla Pi Phone విడుదల కాబోతున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ ఫోన్లో ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయి, ధర ఎంత తదితర వివరాలు చూడండి.

Tesla Pi Phone
Tesla Pi Phone

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అన్ని వైపుల నుంచి ప్రజలకు కనెక్ట్ అవుతున్నారు. తన యాజమాన్యంలోని టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ రేంజ్ గురించి చెప్పక్కర్లేదు, తన స్పేస్ ఎక్స్ కంపెనీ అంతరిక్ష పరిశ్రమలో అపూర్వమైన ఎత్తుకు చేరుకుంది. ఆ తర్వాత భూమిపై అత్యుత్తమ సువాసన అంటూ తాజాగా Burnt Hair అనే పెర్ఫ్యూమ్ లాంచ్ చేసి కొత్త వెంచర్ ప్రారంభించారు. ఇవన్నీకాకుండ ఇప్పుడు కొత్తగా మరో న్యూస్ కూడా వస్తుంది. అదేమిటంటే టెస్లా కంపెనీ సమీప భవిష్యత్తులో స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

టెస్లా బ్రాండ్ మీద Tesla Pi Phone పేరుతో ఒక సరికొత్త స్మార్ట్‌ఫోన్ మోడల్ విడుదల కాబోతున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ ఫోన్‌కు సంబంధించి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర మొదలైన అన్ని వివరాలను వెల్లడించాయి. టెస్లా పై ఫోన్ కోసం టెస్లా తన స్వంత చిప్‌సెట్‌ను రూపొందించిందని, దానికి టెస్లా ప్రాసెసర్ అని పేరు పెట్టిందని పేర్కొన్నాయి. GPU కోసం టెస్లా దాని స్వంత టెస్లా GPUని ఉపయోగించింది. Pi ఫోన్‌లో NVMe స్టోరేజ్ రకం ఉండనుంది. నివేదికల ప్రకారం, Tesla తమ మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ను డిసెంబర్ 2022లో విడుదల చేయబోతోంది. అయితే ఈ లాంచ్ గురించి టెస్లా ఎటువంటి వివరాలను అధికారికంగా ధృవీకరించలేదు.

తాజా నివేదికల ప్రకారంగా, Tesla Pi Phone స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన డిజైన్, ఫీచర్లు, ధర మొదలైన అంశాలు ఇక్కడ మీకు తెలియజేస్తున్నాం, చెక్ చేయండి.

Tesla Pi Phone Expectations, Feature List

  • 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.7 అంగుళాల OLED FHD+ డిస్‌ప్లే
  • 8GB RAM, 512 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • Tesla ప్రాసెసర్
  • వెనకవైపు 50MP+ 50MP+50MP ట్రిపుల్ కెమెరా
  • ముందువైపు ఒకే పంచ్-హోల్ కలిగిన 50MP సెల్ఫీ కెమెరా
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం

కనెక్టివిటీ కోసం డ్యూయల్-బ్యాండ్ Wi-Fi 802.11 a/b/g/n/ac/6e, బ్లూటూత్ 5.2 LE, A-GPS, GLONASS ఉంటాయి.

Tesla Pi Phone ధర, రూ. 70 వేల నుంచి రూ. వేల మధ్య ఉండవచ్చునని అంచనా. ఇంకా ఈ ఫోన్ స్క్రాచ్-రెసిస్టెంట్ గ్లాస్, లియోఫోబిక్ కోటింగ్‌తో రక్షణతో ప్రీమియం బ్లాక్ రంగులో విడుదల కాబోతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం