Elon Musk Tips | సరిగ్గా నిద్రపోలేకపోతున్నారా? ఎలాన్ మస్క్ చిట్కాలు ఇస్తున్నారు!
నిద్రలో ఇబ్బందులు లేదా ఎసిడిటీ సమస్యలు ఎదుర్కునేవారికి పరిష్కారంగా ఒక సింపుల్ చిట్కా ఉంది. దీనిని ఇచ్చింది ఎవరో హెల్త్ ఎక్స్ పర్ట్ అనుకుంటే పొరపాటే. ఈ చిట్కా ఇచ్చింది ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్. మరి ఆయన ఏం చెప్పారో ఇక్కడ చూడండి.
చాలా మంది వ్యక్తులు సరైన నిద్రలేక ఇబ్బంది పడుతుంటారు. నిద్రపోయేందుకు సమయం లభించినా వారికి నిద్రపట్టదు. రోజంతా కష్టపడి పనిచేయడం, ప్రయాణాలు చేయాల్సి రావడం, పని ఒత్తిళ్లు, ఇతర వ్యక్తిగత వృత్తిపరమైన ఆలోచనలతో సగటు వ్యక్తి సతమతమవుతున్నాడు. ఈ రకంగా వారి జీవనశైలి కూడా దెబ్బతింటోంది. అనారోగ్య పాలవుతున్నారు కూడా. ప్రతీ మనిషికి తినడానికి తిండి, తాగటానికి నీరుతో పాటు ఒక 7-8 గంటల నిద్ర చాలా అవసరం. సామాన్యుడికైనా, అపర కుబేరుడికైనా కంటి నిండా నిద్ర ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని ఊరికే చెప్పలేదు మరి.
నిద్రపట్టకపోవటానికి కారణాలు ఎన్ని ఉన్నప్పటికీ, నిద్రపోవడం మాత్రం తప్పనిసరి. మరి ఎలా నిద్రపోవాలి? అంటే ఇందుకు ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ ఒక సింపుల్ చిట్కా చెప్పారు. నిద్రలో నాణ్యత మెరుగుపరచటానికి తన చిట్కా పాటించాలని చెబుతున్నారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే.. నాణ్యమైన నిద్ర కోసం మీ మంచం తల భాగాన్ని ఒక 3 అంగుళాలు లేదా 5 సెంటీమీటర్ల వరకు ఎత్తు పెంచాలని చెప్పారు. అలాగే నిద్రవేళకు 3 గంటల ముందు భోజనం చేయకూడదని సూచించారు. ఇలా చేస్తే మంచి క్వాలిటీ నిద్ర కలుగుతుందని ఆయన ట్వీట్ చేశారు.
Here's the tweet
అయితే మస్క్ చేసిన ఈ ట్వీట్ పెద్ద ఎత్తున స్పందన లభించింది. నిజంగా ఈ రెండు టిప్స్ ఏ విధంగా సహాయపడతాయో ఎవరైనా చెప్తారా? అని ఒక యూజర్ అడిగిన ప్రశ్నకు కూడా మస్క్ జవాబు ఇచ్చారు.
నిద్రపోయేటపుడు మనకు తెలియకుండానే తేలికపాటి యాసిడ్ రిఫ్లక్స్‌ను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇది మనకు తెలియకుండానే మన నిద్రను నాణ్యమైన నిద్రను ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు.
ఎలాన్ మస్క్ ప్రకారం మంచంపై మన శరీరం తలవైపు కొద్దిగా ఎత్తులో ఉంచుకుని, కాళ్లవైపు భాగాన్ని దిగువన ఉంచుకొని పడుకుంటే రాత్రి భోజనం జీర్ణమయ్యే ప్రక్రియ కారణంగా తలెత్తే ఎసిడిటీ ఇబ్బందిని నివారించవచ్చును తద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా నిద్రపోవచ్చునని ఆయన ఉద్దేశ్యం.
అనంతరం ఈ చిట్కాను భారతీయులు కొన్ని వందల సంవత్సరాలుగా పాటిస్తున్నారంటూ ఆయుర్వేదంలో చెప్పిన ఒక నివేదికను ట్వీట్ చేశారు.
సంబంధిత కథనం