తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Netflix With Airtel: ఈ ఎయిర్ టెల్ ప్రి పెయిడ్ ప్లాన్ తో నెట్ ఫ్లిక్స్ ఫ్రీ

Netflix with Airtel: ఈ ఎయిర్ టెల్ ప్రి పెయిడ్ ప్లాన్ తో నెట్ ఫ్లిక్స్ ఫ్రీ

HT Telugu Desk HT Telugu

30 April 2024, 20:53 IST

  • Netflix with Airtel: టెలీకాం కంపెనీలు తమ ప్రి పెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ తో పాటు ప్రముఖ ఓటీటీలను కూడా ఉచితంగా అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఎయిర్ టెల్ తన ఒక ప్రి పెయిడ్ ప్లాన్ తో యూజర్లకు నెట్ ఫ్లిక్స్ ఓటీటీని ఉచితంగా అందించాలని నిర్ణయించింది. 

ఎయిర్ టెల్ ప్రి పెయిడ్ ప్లాన్ తో నెట్ ఫ్లిక్స్ ఫ్రీ
ఎయిర్ టెల్ ప్రి పెయిడ్ ప్లాన్ తో నెట్ ఫ్లిక్స్ ఫ్రీ (HT_PRINT)

ఎయిర్ టెల్ ప్రి పెయిడ్ ప్లాన్ తో నెట్ ఫ్లిక్స్ ఫ్రీ

Netflix with Airtel: ప్రి పెయిడ్ మొబైల్ వినియోగదారుల కోసం టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ కొత్త ఎంటర్టైన్మెంట్ ప్లాన్ ను ప్రారంభించింది. ఈ ప్లాన్ (Airtel 1,499 plan) తో నెట్ ఫ్లిక్స్ బేసిక్ సబ్స్క్రిప్షన్ తో పాటు అపరిమిత 5 జీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, మరికొన్ని అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

ట్రెండింగ్ వార్తలు

Stocks to buy today : భారీగా పతనమైన టాటా మోటార్స్​ షేర్లు ఇప్పుడు కొంటే.. భారీ ప్రాఫిట్స్​!

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో​ కొత్త వేరియంట్లు​..

7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్​! గ్రాట్యుటీ పెంపును హోల్డ్​లో పెట్టిన ఈపీఎఫ్​ఓ..

Tecno Camon 30 launch : ఇండియాలో టెక్నో కామోన్​ 30 సిరీస్​​ లాంచ్​- ధర ఎంతంటే..

ఎయిర్ టెల్ రూ. 1499 ప్రి పెయిడ్ ప్లాన్

ఎయిర్ టెల్ అందిస్తున్న ఈ రూ .1,499 ప్రీపెయిడ్ ప్లాన్ (Airtel 1,499 plan) తో వినియోగదారులకు రోజుకు 3 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. ఇది 84 రోజుల కాలపరిమితితో ఉంటుంది. రోజువారీగా ఎక్కువ డేటా అవసరమైన వారికి సరైన ప్లాన్ ఇది. ఇందులో డేటా, కాల్ ప్రయోజనాలతో పాటు ఉచితంగా నెట్ ఫ్లిక్స్ బేసిక్ సబ్స్క్రిప్షన్ (Netflix Basic subscription) కూడా లభిస్తుంది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ లోని విస్తృతమైన సినిమాలు, టీవీ షోలను ఈ ప్లాన్ ద్వారా ఉచితంగా ఎంజాయ్ చేయవచ్చచు. అదనంగా, ఎయిర్ టెల్ వినియోగదారులు వేగవంతమైన ఇంటర్నెట్ అనుభవం కోసం 5G-ఎనేబుల్డ్ ప్రాంతాల్లో అపరిమిత 5G డేటాను ఆస్వాదించవచ్చు. అంతేకాదు, ఈ ప్లాన్ తో అపోలో 24|7 సర్కిల్ కు సభ్యత్వం, ఉచిత హలో ట్యూన్స్, కాంప్లిమెంటరీ వింక్ మ్యూజిక్ లకు యాక్సెస్ కూడా లభిస్తుంది.

ఎయిర్ టెల్ కు మాత్రమే నెట్ ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్

కొత్త చందాదారుల కోసం నెట్ ఫ్లిక్స్ తన బేసిక్ ప్లాన్ ను నిలిపివేసింది. కానీ, ఎయిర్ టెల్ కస్టమర్లు ఈ ఆఫర్ ద్వారా ఆ ప్రయోజనాన్ని పొందవచ్చు. నెట్ ఫ్లిక్స్ బేసిక్ సబ్స్క్రిప్షన్ (Netflix Basic subscription) లో ఒకేసారి ఒక డివైజ్ లో మాత్రమే స్ట్రీమింగ్ సాధ్యమవుతుంది. ఇది వ్యక్తిగత వినియోగదారులకు అనువైనది. ఈ బేసిక్ సబ్ స్క్రిప్షన్ తో హై రిజల్యూషన్ స్ట్రీమింగ్ లభించదు.

ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ తో..

రూ. 1499 ప్రి పెయిడ్ ప్లాన్ (Airtel 1,499 prepaid plan) తో రీచార్జ్ చేసుకున్న అనంతరం వినియోగదారులు నెట్ ఫ్లిక్స్ బేసిక్ సబ్ స్క్రిప్షన్ పొందడానికి అర్హులవుతారు. ఆ యూజర్లు ఉచితంగా నెట్ ఫ్లిక్స్ కంటెంట్ ను పొందడానికి ముందుగా ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా వారు నెట్ ఫ్లిక్స్ బేసిక్ సబ్ స్క్రిప్షన్ కంటెంట్ ను పొందవచ్చు. ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ లో 'డిస్కవర్ థ్యాంక్స్ బెనిఫిట్స్' విభాగానికి వెళ్లాలి. అక్కడ నెట్ ఫ్లిక్స్ బెనిఫిట్ కనిపిస్తుంది. దాని కింద క్లెయిమ్ బటన్ ను ట్యాప్ చేయాలి. అనంతరం, దానిని యాక్టివేట్ చేయడానికి సూచనలను అనుసరించాలి. రూ. 1499 ఎయిర్ టెల్ ప్రి పెయిడ్ ప్లాన్ (Airtel 1,499 prepaid plan) తో రీచార్జ్ చేసిన మొబైల్ నంబర్ తో ఈ నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ముడిపడి ఉంటుంది. అందువల్ల, ఆ ప్లాన్ యాక్టివ్ గా ఉన్న 84 రోజుల పాటు వినియోగదారులు నెట్ ఫ్లిక్స్ కంటెంట్ ను ఉచితంగా ఎంజాయ్ చేయవచ్చు.

తదుపరి వ్యాసం