Best prepaid plans : 1 ఇయర్ వాలిడిటీతో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే..!
Best prepaid plans with 1 year validity : 1 ఇయర్ వాలిడిటీతో ప్రీపెయిడ్ ప్లాన్స్ తీసుకోవాలని చూస్తున్నారా? అయితే ఇది మీరు చూడాల్సిందే..!
Best prepaid plans with 1 year validity : మీరు ఎక్కువగా డేటా వాడుతుంటారా? ఫ్రెండ్స్‌తో లేదా ఉద్యోగ అవసరాల కోసం ఎక్కువగా కాల్స్ చేయాల్సి వస్తుందా? ప్రతి నెల సిమ్‌లను రిఛార్జ్ చేసి చేసి విసిగెత్తిపోయారా? అయితే మీరు ఇది చూడాల్సిందే! ప్రముఖ టెలికాం సంస్థలు ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఐడియాలు.. తమ యూజర్లకు యాన్యువల్ ప్లాన్స్‌ను అందుబాటులో ఉంచుతున్నాయి. మరి వాటి ధరలు, వార్షిక ప్లాన్స్‌తో వచ్చే బెనిఫిట్స్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
ఎయిర్టెల్ రూ. 1,799 ప్లాన్..
బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఉండి భారీ మొత్తంలో డేటాను వినియోగించని వారికి ఈ ప్లాన్ సూట్ అవుతుంది. 365 రోజుల వాలిడిటీతో ఈ ఎయిర్టెల్ 1799 ప్రీపెయిడ్ ప్లాన్‌పై అన్లిమిటెడ్ కాలింగ్ పొందవచ్చు. అంతేకాకుండా 3,600 మెసేజ్‌లు (రోజుకు 100), 24జీబీ డేటా లభిస్తుంది. ఈ 24జీబీ డేటా అన్నది 365 రోజులకు వర్తిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. రోజువారీ డేటా వినియోగంపై ఎలాంటి లిమిట్ లేదు. ఉచిత హెలో టూన్స్, వింక్ మ్యూజిక్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ వంటివి ఈ ప్లాన్‌లో భాగం.
Airtel Annual plan : యాన్యువల్ ప్లాన్‌లో ఎక్కువ డేటా కావాలని భావించే వారికి.. రోజుకు 2జీబీ 4జీ డేటా లిమిట్‌తో రూ. 2,999 ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.
జియో రూ. 2879 ప్లాన్..
జియోలో 365 రోజుల వాలిడిటీతో అత్యంత చౌకైన ప్లాన్ ఈ రూ. 2,879 ప్లాన్. ఇందులో రోజుకు 2జీబీ 4జీ డేటా లభిస్తుంది. అన్లిమిటెడ్ కాలింగ్, జియో సినిమా, జియోటీవీ వంటి వాటికి యాక్సెస్ లభిస్తుంది. 5జీ స్మార్ట్‌ఫోన్ నుంచి 5జీ డేటా కూడా వస్తుంది. రోజుకు 2.5జీబీ 4జీ డేటా ప్యాక్ కావాలి అని అనుకుంటే. రూ. 2,999 ప్లాన్‌ను మీరు ఎంచుకోవచ్చు.
Jio prepaid recharge plans : జియో నుంచి రూ. 2,545 ప్లాన్ కూడా ఉంది. అయితే.. ఇది 336 రోజులకు మాత్రమే ఉంటుంది. రోజుకు 1.5జీబీ 4జీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్ వంటి బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయి.
వీఐ రూ, 1799 ప్లాన్..
ఎయిర్‌టెల్‌కు పోటీగా యాన్యువల్ ప్లాన్‌ను తీసుకొచ్చింది వోడాఫోన్ఐడియా. దీని వాలిడిటీ 365 రోజులు. 365 రోజుల వరకు 24జీబీ 4జీ డేటా లభిస్తుంది.
ఇక రూ. 2,899 యాన్యువల్ ప్యాక్‌లో రోజుకు 1.5జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ కాలింగ్, వీఐ మూవిస్- టీవీ యాప్‌కు ఫ్రీ యాక్సిస్ వంటి బెనిఫిట్స్ పొందవచ్చు.
Vodafone Idea recharge plan : కాగా.. ఈ ప్లాన్‌తో రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్లిమిటెడ్ డేటాతో ఉచితంగా డౌన్లోడ్స్, స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్‌కు అదనంగా 50జీబీ 4జీ డేటా ఆప్షన్‌ను కూడా ఇస్తోంది వీఐ. సోమవారం నుంచి శుక్రవాం వారకు ఏదైనా డేటాను వాడకుండా ఉంచేస్తే.. అది శని, ఆదివారాలకు ఫార్వర్డ్ అవుతుంది.
సంబంధిత కథనం