Airtel's new ‘family plan’: చవకగా ఎయిర్ టెల్ పోస్ట్ పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్-airtel introduces a new family plan to counter jio s latest postpaid offering ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Airtel Introduces A New 'Family Plan' To Counter Jio's Latest Postpaid Offering

Airtel's new ‘family plan’: చవకగా ఎయిర్ టెల్ పోస్ట్ పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్

HT Telugu Desk HT Telugu
Mar 21, 2023 06:47 PM IST

Airtel's new ‘family plan’: రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడం కోసం టెలీకాం దిగ్గజం ఎయిర్ టెల్ కొత్త కొత్త ప్లాన్లతో వినియోగదారులను ఆకర్షించాలని ప్రయత్నిస్తోంది. తాజాగా, రూ. 599 కే ఒక కుటుంబంలోని ఇద్దరికి మొబైల్ సేవలందించే ప్లాన్ ను ప్రారంభించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Bloomberg)

Airtel's new ‘family plan’: రిలయన్స్ జియో కొత్తగా ఒక పోస్ట్ పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ ను ప్రారంభించింది. అందులో మొదటి లేదా ప్రైమరి కనెక్షన్ కు రూ. 399 చార్జ్ చేస్తుంది. ఆ పై మరో మూడు కనెక్షన్ల వరకు ఒక్కో కనెక్షన్ కు రూ. 99 మాత్రమే చార్జ్ చేస్తుంది. అంటే, మొత్తం 4 కనెక్షన్లకు రూ. 697 అవుతుంది. ఒక్కో కనెక్షన్ కు సుమారుగా నెలకు రూ. 174 చార్జ్ అవుతుంది. అయితే, ఈ ప్లాన్ తో జియో ఎటువంటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ను అందించడం లేదు.

ట్రెండింగ్ వార్తలు

జియోకు పోటీగా..

రిలయన్స్ జియో ఈ ప్లాన్ ను తీసుకురావడానికి ముందే ఎయిర్ టెల్ ఒక ఫ్యామిలీ ప్లాన్ ను ఇంట్రడ్యూస్ చేసింది. అది రూ. 999 ల ఫ్యామిలీ ప్లాన్. ఈ ప్లాన్ 4 సిమ్ లను సపోర్ట్ చేస్తుంది. అంటే ఒక కుటుంబంలోని నలుగురు వ్యక్తులు ఈ ప్లాన్ లో మొబైల్ సేవలు పొందవచ్చు. కానీ ఒక కుటుంబంలో ఇద్దరు మాత్రమే ఉంటే, వారికి ఈ ప్లాన్ భారమవుతుంది.

రూ. 599 ప్లాన్

అందువల్ల ఎయిర్ టెల్ కొత్తగా రూ. 599 ప్లాన్ ను ప్రారంభించింది. ఒక కుటుంబంలోని ఇద్దరు ఈ ప్లాన్ ద్వారా నెల మొత్తం డేటా, మొబైల్ సేవలు పొందవచ్చు. రూ. 599 ప్లాన్ తో పాటు రూ. 799 రూ. 998 ఫ్యామిలీ ప్లాన్ లను కూడా ఎయిర్ టెల్ ప్రారంభించింది. ఎయిర్ టెల్ బ్లాక్ ప్యాకేజ్లో భాగంగా ఇవి లభిస్తాయి. వీటి ద్వారా ఆమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్ స్టార్, ఎయిర్ టెల్ ఎక్స్ట్రీమ్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ తో పాటు అదనంగా డీటీహెచ్ (direct-to-home DTH)) సేవలను కూడా పొందవచ్చు.

WhatsApp channel

టాపిక్