Jio Plus NEW PLANS: ఫ్యామిలీ మొత్తానికి ఒకే ప్లాన్.. ‘జియో ప్లస్ పోస్ట్ పెయిడ్’
Jio Plus NEW PLANS: ప్రముఖ టెలీకాం సంస్థ రిలయన్స్ జియో నుంచి కొత్త పోస్ట్ పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్లు వచ్చాయి. ఒక నెల ఫ్రీ ట్రయల్ తో ఈ జియో ప్లస్ ప్లాన్లు అందుబాటులోకి వస్తున్నాయి.
Jio Plus New post paid plans: నెలకు రూ. 399 టారిఫ్ తో పోస్ట్ పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్లను జియో ఇంట్రడ్యూస్ చేస్తోంది. ఈ పోస్ట్ పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ ద్వారా ఒక కుటుంబంలోని నలుగురికి రూ. 696 లతో నెల మొత్తం మొబైల్ సేవలు అందుతాయి.
Jio Plus New post paid plans: ఏంటీ ఈ ప్లాన్?
ఈ ఫ్యామిలీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ లో మొదటి వ్యక్తికి నెలకు రూ. 399 చార్జి పడుతుంది. అదనంగా తీసుకునే ప్రతీ కనెక్షన్ కు రూ. 99 మాత్రమే చార్జి అవుతుంది. అంటే, మొత్తం నలుగురు కుటుంబ సభ్యులకు రూ. 696 ల కనీస మొత్తం మాత్రమే చార్జ్ అవుతుంది. అంటే, ఒక్కో సభ్యుడి నెలవారీ మొబైల్ ఖర్చు రూ. 174గా ఉంటుంది. మొత్తం ఫ్యామిలీకి ఒకే బిల్ వస్తుంది. అలాగే ఈ ఫ్యామిలీ ప్లాన్ తీసుకుంటే, ప్లాన్ లోని కుటుంబ సభ్యులు తమ డేటాను షేర్ చేసుకోవచ్చు. డైలీ డేటా లిమిట్ ఉండదు. జియో ట్రూ 5జీ వెల్ కం ఆఫర్ ద్వారా అన్ లిమిటెడ్ 5జీ డేటాను పొందవచ్చు.
Jio Plus New post paid plans: ఆమెజాన్, నెట్ ఫ్లిక్స్..
ఈ జియో ఫ్యామిలీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ ద్వారా మీకు నచ్చిన మొబైల్ నెంబర్ ను ఎంపిక చేసుకోవచ్చు. ప్రీమియం కంటెంట్ ను ఉచితంగా పొందవచ్చు. ఇంటర్నేషనల్ రోమింగ్ కూడా ఉచితంగా పొందవచ్చు. నెట్ ఫ్లిక్స్, ఆమెజాన్, జియోటీవీ, జియో సినిమా యాప్స్ చూడొచ్చు. జియో ఫైబర్ యూజర్లు, కార్పొరేట్ ఉద్యోగులు, వేరే టెలీకాం సంస్థలకు చెందిన పోస్ట్ పెయిడ్ కస్టమర్లు, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లు అదనంగా సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సిన అవసరం లేదు. వేరే నెట్ వర్క్ నుంచి సత్వరమే జియోకు మారవచ్చు. అలాగే, సిమ్ హోం డెలివరీ, యాక్టివేషన్ కోసం 7000070000 కు మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. ప్రస్తుతం జియో 5జీ సేవలు భారత్ లోని 331 నగరాలకు అందుతున్నాయి.
Jio Plus New post paid plans: జియో ప్లస్ కనెక్షన్ పొందడం ఎలా?
- 70000 70000 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. వాట్సాప్ లో మీకు పూర్తి వివరాలు అందుతాయి.
- సెక్యూరిటీ డిపాజిట్ వైవర్ కోసం సంబంధిత ఆప్షన్ ను ఎంచుకోవచ్చు.
- ఫ్రీ హోం డెలివరీ ఆప్షన్ కూడా ఉంటుంది.
- ఇప్పటికే జియో ప్రీ పెయిడ్ సిమ్ వాడుతున్నవారు కూడా ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్ కు మారవచ్చు.
- వారు తమ ఫోన్లో ఇన్ స్టాల్ అయి ఉన్న మై జియో యాప్ లోకి వెళ్లి ‘prepaid to postpaid’ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
- ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత ఫ్రీ ట్రయల్ ప్లాన్ ను ఎంచుకోవాలి.
- మార్చి 22 నుంచి జియో ప్లస్ సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి.
- పూర్తి వివరాలకు www.jio.com/jioplus వెబ్ సైట్ ను సందర్శించండి.