Airtel vs Jio: డైలీ లిమిట్ లేకుండా ఒకేసారి డేటా లభించే ఎయిర్‌టెల్, జియో ప్లాన్‍లు ఇవే-airtel vs reliance jio lump sum data plans from these telcos ,బిజినెస్ న్యూస్
Telugu News  /  Business  /  Airtel Vs Reliance Jio Lump Sum Data Plans From These Telcos

Airtel vs Jio: డైలీ లిమిట్ లేకుండా ఒకేసారి డేటా లభించే ఎయిర్‌టెల్, జియో ప్లాన్‍లు ఇవే

Airtel vs Jio: డైలీ లిమిట్ లేకుండా ఒకేసారి డేటా లభించే ఎయిర్‌టెల్ ప్లాన్‍లు ఇవే (Photo: Mint)
Airtel vs Jio: డైలీ లిమిట్ లేకుండా ఒకేసారి డేటా లభించే ఎయిర్‌టెల్ ప్లాన్‍లు ఇవే (Photo: Mint)

Airtel vs Jio: డైలీ డేటా లిమిట్ లేకుండా.. ఒకేసారి ప్లాన్‍తో వచ్చే డేటా మొత్తం వచ్చేలా ఎయిర్‌టెల్, జియో అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్‍లు ఇవి.

Airtel vs Jio: సాధారణంగా ప్రీపెయిడ్ ప్లాన్‍లలో డేటాకు డైలీ లిమిట్ ఉంటుంది. రోజుకు 1జీబీ, 1.5జీబీ, 2జీబీ.. ఇలా హైస్పీడ్ డేటా లిమిట్ ఉంటుంది. ఆ డేటా అయిపోతే కేబీ స్పీడ్‍లో నెట్ వస్తుంది. అయితే, ఎలాంటి డైలీ లిమిట్ లేకుండా.. ప్లాన్‍ డేటా మొత్తం ఒకేసారి వచ్చే ప్రీపెయిడ్ ప్లాన్‍లను కూడా ప్రముఖ టెలికం సంస్థలు ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో అందుబాటులో ఉంచాయి. కొందరు ఒక్కోరోజు అసలు డేటా వాడరు, కొన్ని రోజుల్లో ఎక్కువ డేటా అవసరం అవుతుంది. ఇలాంటి వారికి డైలీ డేటా లిమిట్ లేకుండా ఒకేసారి డేటా మొత్తం వచ్చే ఈ ప్లాన్‍లు (Lump sum Data Plans) సూటయ్యే ఛాన్స్ ఉంది.

ట్రెండింగ్ వార్తలు

ఎయిర్‌టెల్ రూ.509 ప్లాన్

Airtel 509 Plan: రూ.509 నెల వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్‍ను యూజర్ల కోసం ఎయిర్‌టెల్ అందుబాటులో ఉంచింది. వినియోగదారులు ఈ ప్లాన్‍ను రీచార్జ్ చేసుకుంటే 60జీబీ డేటా ఒకేసారి వస్తుంది. అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. 300ఎస్ఎంఎస్‍లు లభిస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఒక నెలగా ఉంది. అంటే డైలీలిమిట్ లేకుండా ఈ ప్లాన్‍తో 60జీబీ ఒకేసారి వస్తుంది. రోజులో ఈ డేటాలో ఇష్టమైనంత వాడుకోవచ్చు. ఇక నెలలోగానే 60జీబీ డేటా అయిపోతే ఆ తర్వాత వాడే ప్రతీ ఎంబీ డేటాకు 50పైసలు కట్ అవుతాయి. ఇక ఈ ప్లాన్‍తో వింక్ మ్యూజిక్, ఫ్రీ హలోట్యూన్ ప్రయోజనాలు దక్కుతాయి.

ప్రస్తుతం రూ.239 అంత కంటే ఎక్కువ ప్లాన్‍లతో రీచార్జ్ చేసుకున్న కస్టమర్లకు అన్‍లిమిటెడ్ 5జీ డేటాను ఎయిర్‌టెల్ ఇస్తోంది. అంటే అంటే ఒకవేళ మీ ప్రాంతంలో ప్రస్తుతం ఎయిర్‌టెల్ 5జీ కవరేజ్ ఉంటే.. 5జీ నెట్‍వర్క్‌పై ఈ ప్లాన్‍ను తీసుకున్నా అన్‍లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. ఒకవేళ 4జీ నెట్‍వర్క్‌పై అయితే.. మీ ప్లాన్ డేటా ఖర్చవుతుంది.

రిలయన్స్ జియో రూ.296 ప్లాన్

Jio 296 Plan: రిలయన్స్ జియో రూ.296 ప్లాన్‍తో డేటా రోజువారి కాకుండా ఒకేసారి వస్తుంది. రూ.296 ప్లాన్‍తో రీచార్జ్ చేసుకుంటే ఒకేసారి 25జీబీ డేటా లభిస్తుంది. అన్‍లిమిటెడ్ కాల్స్, ప్రతీ రోజు 100ఎస్ఎంఎస్‍లు వాడుకోవచ్చు. జియో టీవీ, జియో సినిమా లాంటి యాప్స్ ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. 30 రోజుల్లోగా 25జీబీ డేటా అయిపోతే.. ఆ తర్వాత 64కేబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ వాడుకోవచ్చు.

ప్రస్తుతం జియో కూడా 5జీ వెల్‍కమ్ ఆఫర్ ఇస్తోంది. రూ.239 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకున్న యూజర్లకు అన్‍లిమిటెడ్ 5జీ డేటాను ఇస్తోంది. అంటే జియో 5జీ కవరేజ్ ఉన్న ప్రాంతాల్లో 5జీ నెట్‍వర్క్‌పై యూజర్లు 5జీ డేటాను అన్‍లిమిటెడ్‍గా ఉచితంగా వాడుకోవచ్చు.

జియో, ఎయిర్‌టెల్ ఈ ఉచిత అన్‍లిమిటెడ్ 5జీ డేటా ప్రయోజనాన్ని ఇంకా కొన్ని రోజులు మాత్రమే కొనసాగించే అవకాశం ఉంది. ఇప్పటికే 5జీ కోసం ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్‍లను ప్రవేశపెట్టేందుకు టెలికం సంస్థలు సిద్ధమవుతున్నాయి.

WhatsApp channel