Vi MiFi | ఇక మీ చుట్టూ WiFi.. పాకెట్ రౌటర్‌ను విడుదల చేసిన వోడాఫోన్ ఐడియా!
Vodafone Idea గురువారం నాడు 150 Mbps వేగాన్ని సపోర్ట్ చేసే పాకెట్-సైజ్ 4G రౌటర్ Vi MiFiని భారత మార్కెట్లో విడుదల చేసింది.
Vi MiFi పాకెట్ రౌటర్‌ను వినియోగదారులు తమతో పాటు ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్ ఫోన్లు ఇలా ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేసే అన్ని గాడ్జెట్స్ కోసం దీనిని ఉపయోగించవచ్చు.
వర్క్ ఫ్రమ్ హోం చేసే వాళ్లకు ఈ రౌటర్ ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఇంట్లో ఒకే చోట కూర్చొని పనిచేయడం చిరగ్గా అనిపిస్తే.. ఏదైనా విహారయాత్రకు వెళ్లి ఆ ప్రదేశంలో Vi MiFi రౌటర్‌తో ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకొని తమ పనిని కొనసాగించవచ్చు.
ఈ WiFi రౌటర్ ను ఒకేసారి 10 డివైజ్‌లకు కనెక్ట్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. 2700 mAh బ్యాటరీ కెపాసిటీ కలిగిన ఈ రౌటర్ ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 5 గంటల వరకు పనిచేస్తుందని వొడాఫోన్ ఐడియా పేర్కొంది.
ఈ ఎలక్ట్రానిక్ పరికరం ధర రూ. 2,000/- గా నిర్ణయించారు. వినియోగదారులు Vi అందించే ఇంటర్నెట్ సేవను ఉపయోగించడానికి రూ. 399 నుండి పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు ప్రారంభమవుతున్నాయి. Vi తన Mi-Fi 4G రౌటర్‌ను దేశవ్యాప్తంగా 60 నగరాల్లో ఉన్న Vi స్టోర్‌ల ద్వారా విక్రయిస్తోంది.
దీనికి కాంపిటీషన్‌గా మార్కెట్లో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ రౌటర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. రిలయన్స్ జియో అందించే జియోఫై రౌటర్ ఉచిత జియో సిమ్ కార్డ్‌తో పాటు రూ. 1,999 ధరతో అందిస్తుంది. ఈ JioFi రౌటర్ 150 Mbps వరకు డౌన్‌లోడ్ వేగాన్ని అలాగే 50 Mbps వరకు అప్‌లోడ్ వేగాన్ని అందిస్తుంది.
ఇక Airtel E5573Cs-609 4G పోర్టబుల్ WiFi రౌటర్ ధర సుమారు రూ. 2,000. ఇది Airtel ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌లకు సపోర్ట్ చేస్తుంది.
సంబంధిత కథనం