తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tvs Iqube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో​ కొత్త వేరియంట్లు​..

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో​ కొత్త వేరియంట్లు​..

Sharath Chitturi HT Telugu

20 May 2024, 16:20 IST

google News
    • TVS iQube new variant : టీవీఎస్ మోటార్.. తన బెస్ట్​ సెల్లింగ్​ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఐదు వేరియంట్లలో అందించనుంది. 2.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్​తో కొత్త వేరియంట్​ను ప్రవేశపెట్టిన ఈవీ తయారీదారు త్వరలోనే డెలివరీ మొదలవుతుందని స్పష్టం చేసింది.
టీవీఎస్​ ఐక్యూబ్​..
టీవీఎస్​ ఐక్యూబ్​..

టీవీఎస్​ ఐక్యూబ్​..

TVS iQube electric scooter new variants : టీవీఎస్ మోటార్ తన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను భారతదేశంలో ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. ద్విచక్ర వాహన తయారీదారు.. మే 20న ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల కొత్త వేరియంట్లను ఆవిష్కరించింది. అంతేకాకుండా.. ఐక్యూబ్ ఎస్టీ వేరియంట్ డెలివరీ త్వరలో ప్రారంభమవుతుందని ప్రకటించింది. ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు కొత్త 2.2 కిలోవాట్ యూనిట్, 3.4 కిలోవాట్, 5.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్స్​లో లభిస్తోంది. ఈ వేరియంట్ల ధరలు రూ.85,000 నుంచి రూ.1.38 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటాయి.

టీవీఎస్​ ఐక్యూబ్​ కొత్త బ్యాటరీ ప్యాక్​ వివరాలు..

ఎంట్రీ లెవల్ టీవీఎస్ ఐక్యూబ్ ఇప్పుడు రెండు బ్యాటరీ ప్యాక్లతో వస్తుంది. అవి.. కొత్త 2.2 కిలోవాట్- 3.4 కిలోవాట్​. 5 ఇంచ్​ కలర్ టీఎఫ్​టీ స్క్రీన్, టర్న్ బై టర్న్ నావిగేషన్, క్రాష్ అండ్ టో అలర్ట్ ఫీచర్స్​ ఇందులో ఉన్నాయి. వాల్ నట్ బ్రౌన్, పెరల్ వైట్ వంటి రెండు కొత్త రంగులు, రెండు గంటల వేగవంతమైన ఛార్జింగ్ సమయాన్ని క్లెయిమ్ చేసే 950 వాట్ ఛార్జర్ వంటి ఫీచర్లను ఈ వేరియంట్ అందిస్తోంది. ఈ వేరియంట్​ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 75 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.

TVS iQube electric scooter on road price Hyderabad : ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త 3.4 కిలోవాట్ల వేరియంట్ ద్విచక్ర వాహన తయారీదారు విడుదల చేసిన ఎస్టీ వేరియంట్​లో భాగం. రూ .1.38 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధర కలిగిన ఈ వేరియంట్​ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. 3.4 కిలోవాట్ల బ్యాటరీ ఉన్న ఎస్టీ వేరియంట్లో 7 ఇంచ్​ కలర్ టీఎఫ్టీ స్క్రీన్, అలెక్సాతో ఇంటిగ్రేటెడ్ వాయిస్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, డిజిటల్ డాక్యుమెంట్ స్టోరేజ్, 100కు పైగా కనెక్టెడ్ ఫీచర్లు, 32 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ వెర్షన్ గరిష్ట వేగం గంటకు 78 కిలోమీటర్లు.

5.1 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్​తో ఎస్టీ వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అత్యంత ఖరీదైన వెర్షన్​గా ఉంది. రూ .1.85 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధర కలిగిన ఈ వెర్షన్​ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 150 కిలోమీటర్ల రేంజ్​ని అందిస్తుంది. చిన్న బ్యాటరీ ప్యాక్​ కలిగిన ఎలక్ట్రిక్​ స్కూటర్​ వేరియంట్​లో అందించే దాదాపు అన్ని ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఎస్టీ వేరియంట్లు నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. వీటిలో కాపర్ బ్రాంజ్ మ్యాట్, కోరల్ శాండ్ శాటిన్, టైటానియం గ్రే మ్యాట్ స్టార్ లైట్ బ్లూ ఉన్నాయి.

ఇంకో విషయం! హెచ్​టీ తెలుగు ఇప్పుడు వాట్సప్ ఛానల్స్​లో అందుబాటులో ఉంది! ఆటోమొబైల్​ ప్రపంచం నుంచి ఎటువంటి అప్​డేట్​ని మీరు మిస్ కాకుండా ఉండటానికి హెచ్​టీ తెలుగు వాట్సాప్​ ఛానెల్​ని ఇప్పుడే సబ్​స్క్రైబ్​ చేసుకోండి.

తదుపరి వ్యాసం