7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్! గ్రాట్యుటీ పెంపును హోల్డ్‌లో పెట్టిన ఈపీఎఫ్ఓ..
20 May 2024, 15:57 IST
- Gratuity increase news : రిటైర్మెంట్ గ్రాట్యుటీ, డెత్ గ్రాట్యుటీ లిమిట్‌ని రూ. 25 లక్షలకు పెంచాలన్న నిర్ణయాన్ని ఈపీఎఫ్ఓ హోల్డ్‌లో పెట్టింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ప్రభుత్వ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ షాక్..!
Gratuity increase news : డీఏ (డియర్నెస్ అలొవెన్స్) పెంపునకు అనుగుణంగా.. రిటైర్మెంట్ గ్రాట్యుటీ, డెత్ గ్రాట్యుటీలను 25శాతానికి పెంచుతున్నట్టు గత నెలలో ఓ సర్క్యులర్ని జారీ చేసింది ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్). కాగా.. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారికి షాక్ ఇస్తూ.. ఇప్పుడు ఈ సర్క్యులర్ని ఈపీఎఫ్ఓ హోల్డ్‌లో పెట్టింది.
గతంలో 20లక్షలుగా ఉన్న రిటైర్మెంట్ గ్రాట్యుటీ, డెత్ గ్రాట్యుటీలను రూ. 25లక్షలకు పెంచుతూ 2024 ఏప్రిల్ 30న ఆదేశాలు జారీ చేసింది ఈపీఎఫ్ఓ.
Gratuity increase on Hold : కానీ.. ఈ నిర్ణయాన్ని, గ్రాట్యుటీ పెంపు ఆదేశాలను హోల్డ్‌లో పెడుతున్నట్టు.. మే 7న మరో సర్క్యులర్ని విడుదల చేసింది. మరి ఇందుకు గల కారణాలను ఈపీఎఫ్ఓ తన ఆదేశాల్లో వెల్లడించలేదు.
ఇదీ చూడండి:- Personal loan for business : వ్యాపారం కోసం పర్సనల్ లోన్ తీసుకుంటున్నాారా? తప్పు చేసినట్టే!
డీఏ పెంపుతో..
డీఏ, డీఆర్‌లను 4శాతం మేర పెంచుతున్నట్టు 2024 మార్చ్‌లో ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఫలితంగా.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ఊరట లభించింది.
7th Pay Commission DA hike : రూల్స్ ప్రకారం.. డీఏ 50శాతం సీలింగ్‌కి చేరిన తర్వాత, గ్రాట్యుటీ లిమిట్‌తో పాటు ఇతర ఆలోవెన్స్లను ఆటోమెటిక్‌గా సవరించాలి. డీఏ పెంపుతో 50శాతం సీలింగ్‌ని తాకింది కాబట్టి.. ఇతర అలోవెన్స్‌లు కూడా ఆటోమెటిక్‌గా మారుతాయని భావించారు. కానీ.. ఈపీఎఫ్ఓ తాజా చర్యలు చూస్తుంటే, అలా జరిగేలా కనిపించడం లేదు. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు కాస్త నిరాశను కలిగించే విషయమే.
మరి ఈ గ్రాట్యుటీ పెంపు ఎంత కాలం హోల్డ్‌లో ఉంటుంది? అసలు గ్రాట్యుటూ పెంపు ఉంటుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయంపై కొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సప్ ఛానల్స్‌లో అందుబాటులో ఉంది! పర్సనల్ ఫైనాన్స్ ప్రపంచం నుంచి ఎటువంటి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండటానికి హెచ్‌టీ తెలుగు వాట్సాప్ ఛానెల్‌ని ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.