తెలుగు న్యూస్ / ఫోటో /
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రాట్యుటీ లిమిట్ పెంపుతో పాటు అనేక బెనిఫిట్స్ అమలు..
- ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! గ్రాట్యుటీ లిమిట్ పెంపుతో పాటు ఇతర విషయాల్లో కొన్ని కీలక సవరణలు చేసింది కేంద్రం. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
- ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! గ్రాట్యుటీ లిమిట్ పెంపుతో పాటు ఇతర విషయాల్లో కొన్ని కీలక సవరణలు చేసింది కేంద్రం. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
(1 / 7)
లోక్సభ ఎన్నికల తేదీ ప్రకటనకు ముందు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ లేదా డీఏను 4 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. గతంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 46 శాతంగా ఉండేది. దాన్ని 50 శాతానికి పెంచారు. ఇప్పటికే మార్చ్ వేతనంతో కలిపి పెరిగిన డీఏ ప్రభుత్వ ఉద్యోగులకు అందింది. ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి, ఫిబ్రవరి నెలల డీఏ బకాయిలు కూడా అందాయి.
(2 / 7)
కేంద్ర ప్రభుత్వం పలు ఇతర అలవెన్సులను కూడా పెంచింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని సిబ్బంది, శిక్షణ శాఖ కార్యాలయం మెమోరాండం జారీ చేసింది. ఏప్రిల్ 30న నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. భారత ప్రభుత్వ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖకు చెందిన పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ విభాగం ప్రకారం., డియర్నెస్ అలవెన్స్ మూల వేతనంలో 50 శాతం వరకు పెంచారు. ఇక రిటైర్మెంట్ గ్రాట్యుటీ, డెత్ గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని 25 శాతం వరకు పెంచారు.
(3 / 7)
ఇప్పటివరకు గ్రాట్యిటూ గరిష్ట పరిమితి రూ.20 లక్షలుగా ఉండేది. ఇప్పుడు దాన్ని రూ.25 లక్షలకు పెంచారు. అంటే ఇకపై గ్రాట్యుటీ గరిష్ట పరిమితి రూ.25 లక్షలకు పెరిగింది. ఇక ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్, గ్రాట్యుటీకి సంబంధించిన నిబంధనలను మారుస్తూ కొద్ది నెలల క్రితం కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.
(4 / 7)
సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్, 2021లోని రూల్ 8ను సవరించారు. సవరించిన నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగి తీవ్రమైన నేరానికి పాల్పడితే లేదా విధి నిర్వహణలో తన విధులను సక్రమంగా నిర్వర్తించకపోతే పదవీ విరమణ తర్వాత గ్రాట్యుటీ, పెన్షన్ నిలిపివేస్తారు.
(5 / 7)
గ్రాట్యుటీ పరిమితిని పెంచడంతో పాటు, కేంద్ర ప్రభుత్వం అనేక ఇతర అలవెన్సులను పెంచింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) ఏప్రిల్ 2న ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది. చైల్డ్ ఎడ్యుకేషన్ అలవెన్స్, చైల్డ్ కేర్ స్పెషల్ అలవెన్స్ (వికలాంగ మహిళలకు), రిస్క్ అలవెన్స్, నైట్ డ్యూటీ అలవెన్స్, ఓవర్ టైమ్ అలవెన్స్ పెంచారు. పార్లమెంటరీ సహాయకులకు ప్రత్యేక అలవెన్సులు కూడా పెరుగుతున్నాయి.
(6 / 7)
ఉద్యోగుల ఇద్దరు పిల్లలకు మాత్రమే హాస్టల్ సబ్సిడీ ఇస్తామని ఆఫీస్ మెమోలో పేర్కొన్నారు. డీఏను 50 శాతం పెంచితే హాస్టల్ సబ్సిడీ 25 శాతం పెరుగుతుందని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హాస్టల్ సబ్సిడీ కింద నెలకు గరిష్టంగా రూ.8,437.5 రీయింబర్స్మెంట్ పొందవచ్చు. ఇది కాకుండా, ప్రభుత్వ ఉద్యోగులు పిల్లల విద్యా భత్యం కింద నెలకు గరిష్టంగా రూ .2812.5 పొందవచ్చు.
ఇతర గ్యాలరీలు