Airtel international roaming packs : అతి తక్కువ ధరకే ఎయిర్టెల్ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్స్ లాంచ్..
Airtel international roaming packs India : సరికొత్త ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్స్‌ని లాంచ్ చేసింది ఎయిర్టెల్ సంస్థ. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Airtel international roaming packs for Europe : అనేక అంతర్జాతీయ దేశాలకు తన రీచ్‌ని విస్తరించుకుంటోంది దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్. ఇందులో భాగంగా.. సరికొత్త, చౌకైన ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్స్‌ని తాజాగా లాంచ్ చేసింది. ఈ కొత్త ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్స్.. 184 దేశాల్లో పని చేస్తాయి. అంతేకాదు.. రోజుకు రూ. 133కే ఈ ప్యాక్స్ ప్రారంభమవుతుండటంతో.. కస్టమర్లు తమ సౌకర్యానికి తగ్గట్టు ఎంపిక చేసినకునే ఆప్షన్ కూడా లభిస్తోంది. ఈ రోమింగ్ ప్లాన్స్‌లో అన్లిమిటెడ్ డేటా, ఇన్-ఫ్లైట్ కనెక్టివిటీ వంటి ఫీచర్స్ కూడా ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో.. ఎయిర్టెల్ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్స్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఎయిర్టెల్ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్స్..
'వన్ ప్లాన్ టు ట్రైవెల్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్ (ప్రపంచంలో ఎక్కడికైనా ప్రయాణించేందుకు ఒకటే ప్లాన్)'ని తాజాగా లాంచ్ చేసింది ఎయిర్టెల్. దీని ధర రోజుకు రూ. 133. మాటిమాటికి రీఛార్జ్ చేసే అవసరాన్ని తగ్గిస్తూ.. ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్‌లో, మీకు ఎన్ని రోజులు కావాలంటే, అన్ని రోజుల పాటు ఈ ప్యాక్‌ని ఒకేసారి రీఛార్జ్ చేసుకునే వెసులుబాటును కూడా ఇస్తోంది టెలికాం సంస్థ.
ఈ ఎయిర్టెల్ ఇంటర్నేనల్ రోమింగ్ ప్లాన్‌లో ఇన్-ఫ్లైట్ కనెక్టివిటీ, 24x7 కాంటాక్ట్ సెంటర్ సపోర్ట్, అన్లిమిటెడ్ డేటాతో పాటు అనేక వెసులుబాటులు ఉన్నాయి. గమ్యస్థానాన్ని చేరుకున్న తర్వాత.. సంబంధిత ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్.. వెంటనే యాక్టివేట్ అవుతుంది. ఇలాంటి ప్యాక్స్.. 184 దేశాల్లో పనిచేస్తాయి. ఫలితంగా.. ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు.
Airtel international roaming packs details : "కస్టమర్లకు వాల్యూ అందిచేందుకు మేము కట్టుబడి ఉన్నామనేందుకు ఈ కొత్త ప్యాక్ నిదర్శనం. చౌకైన టారీఫ్‌లో డేటా, వాయిస్‌ని వాడుకునే స్వేచ్ఛ వారికి లభిస్తోంది," అని ఎయిరెటల్ కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్ అండ్ మార్కెటింగ్ డైరక్టర్ అమిత్ త్రిపాఠి తెలిపారు.
ఇదీ చూడండి:- Smartphones discounts: ఐ ఫోన్ 14 సహా ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్
కొత్త ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్‌తో లాభమేంటి?
ఒక్కో దేశంలో టారీఫ్‌లు ఒక్కో విధంగా ఉంటాయి. గతంలో.. ఇంటర్నేషనల్ ట్రావెలర్లు.. వేరువేరు రోమింగ్ ప్లాన్స్‌ని తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఎయిర్టెల్ సింగిల్ ప్యాక్‌తో.. ధర తగ్గడంతో పాటు అనేక ప్లాన్లు ఎంచుకోవాల్సిన శ్రమ తప్పుతుంది. అంతేకాకుండా.. ఆటో రెన్యువల్ ఫీచర్‌ని కూడా ప్రవేశపెట్టింది ఎయిర్టెల్. ఇక రీఛార్జ్ చేసుకోవడం మరింత సులభమవుతుంది.
ఎయిర్టెల్ స్టాక్‌కి రెక్కలు..
Airtel share price target : ఎయిర్టెల్ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్స్ లాంచ్‌తో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత.. టారీఫ్ హైక్ ఉంటుందన్న వార్తల మధ్యల.. సంస్థ షేర్లు దూసుకెళుతున్నాయి. మంగళవారం ట్రేడింగ్ సెషన్ ఉదయం 11గంటలకు.. ఎయిర్టెల్ షేరు 2.5శాతం పెరిగి, రూ. 1,329కి చేరింది. ఎయిర్టెల్ స్టాక్.. ఐదు రోజుల్లో 8.5శాతం, నెల రోజుల్లో 9.5శాతం మేర పెరిగింది. ఇక ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఏకంగా 31.2శాతం మేర పెరిగింది ఎయిర్టెల్ షేరు ధర.
సంబంధిత కథనం