Tariff hike : ‘టారీఫ్’ బాదుడుకు ఎయిర్టెల్ రెడీ! జియో మాత్రం..
Airtel Tariff hike : ఎయిర్టెల్ వినియోగదారులకు త్వరలోనే గట్టి షాక్ తగిలే అవకాశం ఉంది! టారీఫ్‌లను భారీగా పెంచేందుకు సంస్థ రెడీ అవుతోందట! జియో మాత్రం.. కొత్త స్ట్రాటజీని అప్లై చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది!
Tariff hike Airtel Jio : స్మార్ట్‌ఫోన్ వినియోగదారులపై పిడుగు! టారీఫ్‌లను పెంచేందుకు ఎయిర్టెల్ రెడీ అవుతోందని మీడియా కథనాలు చెబుతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత టారీఫ్ హైక్ ఉండే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నాయి. అయితే.. ఈ టారీఫ్ విషయంలో.. రిలయన్స్ జియో మాత్రం కొత్త స్ట్రాటజీని ప్లే చేసేందుకు ఆలోచిస్తున్నట్టు మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.
టారీఫ్ హైక్- ఎయిర్టెల్ వర్సెస్ జియో..
ఇండియాలో లీడింగ్ టెలికామ్ సంస్థలుగా కొనసాగుతున్నాయి.. ఎయిర్టెల్, జియో. ఈ రెండింటికే.. దాదాపు 82శాతం మార్కెట్ షేర్ ఉంది. వొడాఫోన్ఐడియా.. సబ్స్క్రైబర్స్, రెవెన్యూ పరంగా చాలా దూరంలో ఉంది. ఈ సంస్థ మార్కెట్ షేర్ 18.5శాతం.
కాగా.. జియో కన్నా ఎయిర్టెల్ టారీఫ్‌లు ఇప్పటికే కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇప్పుడు.. టారీఫ్‌లను పెంచేందుకు ఎయిర్టెల్ ప్లాన్స్ వేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే.. టారీఫ్ విషయంలో ఈ రెండింటి మధ్య వ్యత్యాసం మరింత పెరుగుతుంది.
Tariff hike news : మరోవైపు.. టారీఫ్‌లను పెంచకుండా.. యూజర్స్.. ఎక్కువ డేటా వాడుకునేందుకు ప్రోత్సహించాలని రిలయన్స్ జియో భావిస్తోందట! ఇలా చేస్తే.. డేటా కన్జమ్షన్ ఎక్కువ అవ్వడంతో పాటు రీఛార్జ్‌లు కూడా పెరుగుతాయని ఆశిస్తోందట. పైగా.. ఇండియన్ ప్రీమియం లీగ్ కూడా నడుస్తుండటంతో.. డైటా కన్జమ్షన్స్ కచ్చితంగా పెరుగుతుందని జియో భావిస్తోందట.
ఇటీవలి కాలంలో ఏఆర్పీయూ (యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్)పై భారీగా ఫోకస్ చేసింది ఎయిర్టెల్. జియో మాత్రం.. ఏఆర్‌పీయూని ఫ్లాట్‌గా ఉంచుతోంది. పైగా.. ఎయిర్టెల్ టారీఫ్‌లు పెంచితే.. సబ్స్క్రైబర్లు జియోకి షిఫ్ట్ అవుతారని ఆశిస్తోంది.
5జీ డేటా జోరు..
Airtel Tariff hike : నివేదికల ప్రకారం.. ప్రజలు యూజర్ ఎక్స్‌పీరియెన్స్‌పై ఫోకస్ చేశారు. అందుకే.. 5జీ ప్యాక్స్‌లో ఎక్కువ డబ్బులు ఉన్న రీఛార్జ్ ప్లాన్స్‌ని ఎంచుకుంటున్నారు! అదే సమయంలో.. జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్పైనా చాలా మంది ఫోకస్ చేస్తున్నారు.
"ఎక్కువ ధరలు ఉన్న 5జీ ప్యాక్స్‌ని యూజర్స్ ఆప్ట్ చేసుకుంటున్నారు. ఫైబర్ ప్లాన్స్ కూడా లాభదాయకంగా ఉన్నాయని వారికి అర్థమవుతున్నాయి. ఇతర కంపెనీల నుంచి యూజర్స్ కూడా వస్తున్నారు. ఫలితంగా.. హెడ్లైన్ టారీఫ్ హైక్ చేయకపోయినా.. మా ఏఆర్పీయూ పెరుగుతుందని ఆశిస్తున్నాము," అని జియో ఎగ్జిక్యూటివ్స్ చెబుతున్నారు.
ఎనలిస్ట్‌ల ప్రకారం.. హోం బ్రాడ్‌బ్యాండ్ విషయంలో జియో వేగంగా వృద్ధిచెందుతోంది. ఇయర్ ఆన్ ఇయర్లో 37.6శాతం పెరిగింది. అదే సమయంలో.. ప్రో-యాక్టివ్ చర్యలు చేపట్టిన ఎయిర్టెల్.. ఏఆర్‌పీయూని నెలకు రూ. 200 కన్నా ఎక్కువ స్థాయికి తీసుకెళ్లింది.
Jio Tariff hike news : ప్రస్తుతం.. ఎయిర్టెల్ టారీఫ్ రూ. 208గా ఉంది. రిలయన్స్ జియోకి అది రూ. 182గాను, వొడాఫోన్‌ఐడియాకు రూ. 145గాను ఉన్నాయి. అంటే.. టారీఫ్‌ల విషయంలో ఎయిర్టెల్ ముందు వరుసలో ఉంది.
ఇక ఇప్పుడు.. 2024 లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత, జులై సమయంలో ఎయిర్టెల్ టారీఫ్‌లను పెంచొచ్చు. ఎంత పెంచుతుంది? అంటే.. కనీసం 15శాతం హైక్ ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సంబంధిత కథనం